ఈ ఏడాది ఆదితో కలసి నటిస్తా | This year will be act with adi sai kumar | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది ఆదితో కలసి నటిస్తా

Published Mon, Jan 11 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

ఈ ఏడాది ఆదితో కలసి నటిస్తా

ఈ ఏడాది ఆదితో కలసి నటిస్తా

సాక్షి, తిరుమల: తన కుమారుడు ఆదితో కలసి ఈ ఏడాది ఓ చిత్రంలో నటించనున్నట్లు ప్రముఖ నటుడు సాయికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2015లో తాను నటించిన పటాస్, పండుగ చేస్కో, భలే మంచిరోజు చిత్రాలు సంతృప్తినిచ్చాయని తెలిపారు. కన్నడలో నటించిన విజయరంగీత్ తరంగా చిత్రం ఆస్కార్‌కు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాది నాలుగైదు భారీ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. తన కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న గరం చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, తన సతీమణి సురేఖ నిర్మాణ సారథ్యంలో దీన్ని నిర్మిస్తున్నామని అన్నారు. తన 40 ఏళ్ల సినీ ప్రస్థానం సంతోషంగా సాగిపోతోందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement