చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో... | Chuttalabbayi to release 19th August | Sakshi
Sakshi News home page

చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో...

Published Tue, Aug 16 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో...

చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో...

లవ్‌లీ రాక్‌స్టార్ ఆది, నమితా ప్రమోద్ జంటగా రూపొందిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నె ల 19న విడుదల కానుంది. వెంకట్ తలారి మాట్లాడుతూ- ‘‘అమెరికాలో ఐటీ కన్సల్టెంట్ నడుపుతున్న నేను సినిమాలపై ఉన్న ఆసక్తితో వీరభద్రమ్‌గారిని కలిశా. ఆయన ‘చుట్టాలబ్బాయి’ కథ చెప్పారు. ఆది, శర్వానంద్, నానిలను అనుకోగా అది ఫైనల్ అయ్యారు.

అన్ని ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. విలేజ్, సిటీ నేపథ్యంలో ఉంటుంది’’ అని తెలిపారు. మరో నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ- ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తరహాలో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సాయికుమార్ పాత్ర హెలెట్. ఆమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల్లోనూ విడుదల చేస్తున్నాం. త్వరలో మూడు కొత్త చిత్రాలు ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమాలు కలిసి చేస్తామా? విడివిడిగా చేస్తామా? అన్నది వారంలో చెబుతాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement