Cherukuri Sudhakar Raju
-
'దసరా' డైరెక్టర్‌కు 'బీఎండబ్లూ' కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తాచాటుతుంది. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ ఓదెల సూపర్ సక్సెస్ అయ్యారు. గతంలో రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ గతంలో పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు చేసినా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు దసరాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందడంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన ‘బీఎమ్‌డబ్లూ’ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కరీంనగర్లో జరిగిన దసరా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన అందరి ముందే డైరెక్టర్‌కు కారును ప్రజెంట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సహజీవనం చేయాలనుకోవడం లేదు!
‘‘స్టార్ హీరోయిన్.. స్టార్డమ్..నటనలో హీరోలని డామినేట్ చేస్తున్నారు...వంటి వాటి గురించి నేను ఆలోచించను. ప్రేక్షకులకు అలా అనిపిస్తుందేమో? నా వరకూ నా పాత్రకి 100శాతం న్యాయం చేయాలని మాత్రమే ఆలోచిస్తా’’ అని సాయిపల్లవి అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న విశేషాలు... ► ‘ప్రేమమ్, ఫిదా, పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో ప్రేమించడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం వంటి పాత్రలు చేశారని అడుగుతున్నారు. ఆ విషయం నేను ఆలోచించనే లేదు. నా తర్వాతి సినిమాలో అలాంటి పాత్ర లేకుండా చూసుకుంటా (నవ్వుతూ). అయితే ప్రతి స్టోరీలో ఎంతో కొంత ప్రేమ కథ ఉంటుంది. అది కామన్ కదా. ► నేను నటించిన ‘పడి పడి లేచె మనసు, మారి 2’ సినిమాలు ఒకే రోజు విడుదలవడం సంతోషంగా ఉంది. ‘పడి పడి లేచె మనసు’ లో డాక్టర్‌గా నా పాత్ర కూల్‌గా ఉంటుంది. ‘మారి 2’లో ఆటో డ్రైవర్‌గా రఫ్‌గా, మాస్‌గా ఉంటుంది. ► ‘పడి పడి లేచె మనసు’ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం కోల్‌కత్తాలో జరిగింది. నేను కోల్‌కత్తాకి వెళ్లడం అదే ఫస్ట్ టైమ్. హనుగారు ఈ కథ చెప్పినప్పుడు హార్ట్‌ఫుల్‌గా ఫీలయ్యా. సినిమాను తెరపై చూసుకున్నప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ► ఈ సినిమాలో నాకు, శర్వాకి మంచి కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు. ఆ పాత్రల్లో మేము కాదు.. సూర్య, వైశాలి మాత్రమే కనిపిస్తారు. శర్వా మంచి సహనటుడు. చక్కగా మాట్లాడతాడు. మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎటువంటి ఈగోలు మాకు లేవు. అందుకే ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చాయి. హనుగారు చాలా హార్డ్ వర్కర్. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ సినిమా గురించే ఉంటాయి. ► వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. ఓ 20ఏళ్ల తర్వాత కూడా ‘ఆ అమ్మాయి బాగా నటించింది’ అంటే చాలు. డాక్టర్ వృత్తిని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చా. నా సినిమాలు, నా పాత్రలు చూసినప్పుడు నా తల్లిదండ్రులు సంతోష పడటంతో పాటు గర్వపడాలి. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. చిట్టి పొట్టి డ్రెస్సులు నాకు అంత కంఫర్ట్‌గా ఉండవు. అందుకే వాటికి దూరం. ‘ఫిదా’ సినిమాలో ఓ సన్నివేశంలో అవసరం కాబట్టి వేసుకోక తప్పలేదు (నవ్వుతూ). ► సినిమాల్లో నా పాత్రలో లవ్.. బ్రేకప్స్ ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా అయితే ప్రస్తుతానికి లేవు. స్కూల్ డేస్‌లో అబ్బాయిలు నావైపు చూసేవారు కానీ ధైర్యంగా మాట్లాడేవారు కాదు. నా మొహంపైన అప్పుడు కూడా మొటిమలు ఉండేవి. అయినా అబ్బాయిలు చూస్తున్నారంటే నాకు సంతోషంగా అనిపించేది. కాలేజ్ డేస్‌లో ప్రేమలో పడే టైమ్‌లేదు. పుస్తకాలతో ప్రేమలో పడిపోయా. ఇప్పుడు నా ప్రేమ సినిమాలతోనే. అవును.. సినిమాలతో ప్రేమలో ఉన్నా (నవ్వుతూ). నిజ జీవితంలో సహజీవనం చేయాలనుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటా. సహజీవనం గురించి నేను తప్పుగా మాట్లాడటంలేదు. ఎవరిష్టం వారిది. ► నేను బయట ఎక్కడైనా కనిపిస్తే సాయిపల్లవి అనడం లేదు.. భానుమతి అంటున్నారు. అంతలా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇదొక బాధ్యతగా భావించి, ప్రాధాన్యం ఉన్న, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడలేను. ఇప్పుడిలా మాట్లాడుతున్నానంటే కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ములగారు, భానుమతి పాత్రే కారణం. నేను టైమ్‌కి షూటింగ్ రాననడం కరెక్ట్ కాదు. టైమ్‌కి సెట్లో ఉంటా. హిట్టు, ఫ్లాపు అనేది పెద్దగా మైండ్‌కి ఎక్కించుకోను. మన ప్రయత్న లోపం ఉండకూడదనుకుంటా. ఆ తర్వాత దేవుడి, ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రిజల్ట్ ఏదైనా మన మంచికే అనుకుంటాను. ► నేనెప్పుడూ హీరోయిన్గా ఫీలవ్వను. ఓ సాధారణ అమ్మాయిలానే ఉంటా. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్, బంధువులు కూడా నన్ను హీరోయిన్గా ట్రీట్ చేయరు. ఇంట్లో నా పనులు నేనే చేసుకుంటా. కమర్షియల్ యాడ్స్ చేయడం ఇష్టం ఉండదు. చారిటీ కార్యక్రమం అయితే డబ్బులు తీసుకోకుండా చేస్తా. ► తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఓ సినిమాకి చర్చలు జరిగాయి. ఇంకా సైన్ చేయలేదు. ఇందులో అందరూ అనుకుంటున్నట్లు నాది నక్సలైట్ పాత్ర అయితే కాదు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో సూర్యతో ‘ఎన్జీకే’ మూవీలో నటిస్తున్నా. -
అమ్మాయిల సమస్యలపై..
‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో ‘ఈ అమ్మాయి’ చిత్రం ఆరంభమైంది. శ్రీ అవధూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై దొంతు రమేశ్ దర్శకత్వంలో దొంతు బుచ్చయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి పారిశ్రామికవేత్త చెరుకూరి సుధాకర్ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నవ్యాంధ్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యస్.వి.ఎన్. రావు క్లాప్‌నిచ్చారు. ‘‘రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలాఖరులో ప్రారంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం. జనవరి 23న ఆడియోను, ఫిబ్రవరి 14న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని దొంతు రమేశ్ అన్నారు. ‘‘వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని దొంతు బుచ్చయ్య చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అంజి సలాది, పాటలు: పెంచల్ దాస్ , కెమెరా: గువ్వాడ చంద్రమోహన్, సహనిర్మాత: గోగుల అనిల్ కుమార్. -
రాజా అక్రమార్క
♦ ఆ ఇద్దరిలో ఒకడే.. ఈ చేకూరి సుధాకర్‌రాజు ♦ పోలీసులకు చిక్కిన ట్యాంపర్ కింగ్ సుధాకర్‌రాజు ♦ ఇతని బాగోతాలను గతంలోనే బయటపెట్టిన సాక్షి ♦ కానిస్టేబుల్ నుంచి రియల్టర్ వరకు అన్నీ మోసాలే ♦ హైదరాబాద్ నుంచే విశాఖలో భూచక్రం తిప్పిన ఘనుడు ♦ మంత్రి, ఆయన తనయుడి అండతో అరాచకాలు ♦ ఏఆర్ కానిస్టేబుల్‌గా చేస్తూ.. డీఎస్పీనంటూ దందాలు చేయడంతో ఉద్యోగం ఊడింది.. ♦ దాంతో రియల్టర్ అవతారమెత్తాడు. మాటల చాతుర్యంతో అందరినీ బురిడీ కొట్టిస్తూ భూదందాలు మొదలెట్టాడు.. ♦ అంతేనా రికార్డులు తారుమారు చేసి.. అనుభవదారుల తలరాతలు మార్చేయడంలో తానే రాజుననిపించుకున్నాడు.. ♦ హైదరాబాద్‌లోనే ఉంటూ ఇక్కడ దందాలు నడిపేవాడు.. మంత్రి, అతని కుమారుడి అండతో చెలరేగిపోయాడు.. ♦ కేసులెన్ని నమోదైనా.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తప్పించుకోవడంలో ఘనుడనిపించుకున్నాడు.. ♦ దానికోసమే తన ఇంటి పేరును కూడా మార్చేసుకున్నాడు.. అయినా ఆర్నెల్ల క్రితమే ‘సాక్షి’ కథనాలకు చిక్కిన ఈ రాజా అక్రమార్కుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు. సాక్షి, విశాఖపట్నం: భూ దందాలు, రికార్డుల తారుమారుతోపాటు లేని కంపెనీలను సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టే ఆ ఘనుడే చేకూరి సుధాకర్‌రాజు అలియాస్ చింతాడ సుధాకర్‌రాజు. ఆరంభంలో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి డీఎస్పీ అవతారమెత్తి పోలీసులకు చిక్కిన కృష్ణా జిల్లాకు చెందిన ఈ సుధాకర్‌రాజు ఉద్యోగం పోగొట్టుకున్నాక హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. కొన్నాళ్లకు విశాఖ స్థిరాస్తి వ్యాపారంలోకి ప్రవేశించాడు. హైదరాబాద్‌లోనే ఉంటూ విశాఖలో భూదందాలు, అక్రమాలకు పాల్పడుతున్నాడు. అతనిపై అప్పటికే పలు కేసులుండడంతో ఇంటి పేరును చేకూరికి బదులు చింతాడగా మార్చుకుని సీహెచ్ సుధాకర్రాజుగా చెలామణీ అవుతున్నాడు. నేతలతో బంధం కోట్లు గడించాక రాజకీయ నాయకులతో బంధాన్ని పెంచుకున్నాడు. వారి అండతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించడం, రికార్డులను ట్యాంపర్ చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు, పాస్‌పుస్తకాలు సృష్టించడం, టైటిల్‌డీడ్స్ మార్చడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అమ్మకం చేపట్టడం మొదలెట్టాడు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకస్థానంలో ఉన్న సీనియర్ మంత్రి కుమారుడితో సంబంధాలు పెట్టుకున్నాడు. దీంతో అక్రమంగా కొట్టేసిన భూ ములను సక్రమం చేసుకునే పనిని తేలిక చేసుకున్నాడు. విశాఖలో వెలుగు చూసిన భారీ భూకుంభకోణంలో రికార్డుల ట్యాంపరింగే కీలకంగా మారింది. ఇందులో సుధాకర్‌రాజు పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది. తహసీల్దార్ల వద్ద మాత్రమే ఉండాల్సిన డిజిటల్ కీని హస్తగతం చేసుకొని ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లోకి వెళ్లి డి పట్టా అని ఉన్న చోట ‘డి’ని ‘జి’గా మార్చేయడం.. అనుభవదారుల పేర్లు మార్చి వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు పుట్టిస్తాడు. వాటిని చూపి రిజిస్ట్రేషన్లు కూడా చేయించేస్తాడు. అంతేకాదు.. చేకూరి కెమికల్స్ పేరుతో ఒకటి, మరో ఇన్ఫ్రా ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్టు లేని కంపెనీలను సృష్టించాడన్న ఆరోపణలున్నాయి. కేసులే కేసులు.. ఎండాడ, రుషికొండ, భీమిలి, మధురవాడ, కొమ్మాది, పీఎంపాలెంతో పాటు నగరంలోని సీతమ్మధార, వాల్తేరు, చినగదిలి, చినగంట్యాడ తదితర ప్రాంతాల్లో సుధాకర్‌రాజు భూదందాలకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఈయన అక్రమాలపై విశాఖ ఫోర్త్‌టౌన్, త్రీటౌన్, భీమిలి, పరవాడ, టూటౌన్, పీఎం పాలెం పోలీస్ స్టేషన్లలో 2012 నుంచి డజనుకు పైగానే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ రాజకీయ అండతో ఇన్నాళ్లూ అరెస్టు కాకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ చీటింగ్ రాజు జోలికెళ్లడానికి పోలీసులు కూడా సాహసం చేయలేకపోయారు. జూ సమీపంలోని సీతకొండ విశాఖ వ్యాలీ స్కూలు వద్ద 24.05 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లో ఉన్న సుధాకర్‌రాజును ఎట్టకేలకు విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కాల్‌డేటా తీస్తే.. సుధాకర్‌రాజు కాల్‌డేటాను పరిశీలిస్తే ఆయనుకు రాష్ట్రమంత్రి, ఆయన కుమారుడితో పాటు ఇతర నేతలతో ఉన్న లింకులన్నీ బయటపడే అవకాశం ఉంది. ఆ మంత్రి కుమారుడితో ఈయనకు వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌రాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వీరితో ఉన్న సంబంధాలు వెలుగు చూస్తాయి. ముందే చెప్పిన ‘సాక్షి’ సుధాకర్‌రాజు సాగిస్తున్న భూకబ్జాలు, భూదందాల వ్యవహారాన్ని ‘సాక్షి’ దినపత్రిక ముందే వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఎలా కాజేస్తున్నది, ఫోర్జరీ డాక్యుమెంట్లను ఎలా సృష్టిస్తున్నదీ, రికార్డుల ట్యాంపరింగ్‌కు ఎలా పాల్పడుతున్నదీ వెలుగులోకి తెచ్చింది. ఈయనకు రాష్ట్రమంత్రి, ఆయన తనయుడు సహకరిస్తున్న తీరునూ, హైదరాబాద్‌లో ఉంటూ సుధాకర్‌రాజు విశాఖలో భూ చక్రం తిప్పుతున్న తీరునూ పలు కథనాల ద్వారా బయటపెట్టింది.