
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తాచాటుతుంది. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ ఓదెల సూపర్ సక్సెస్ అయ్యారు.
గతంలో రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ గతంలో పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు చేసినా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు.
ఇప్పుడు దసరాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందడంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన ‘బీఎమ్‌డబ్లూ’ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కరీంనగర్‌లో జరిగిన దసరా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన అందరి ముందే డైరెక్టర్‌కు కారును ప్రజెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment