
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ చిత్రం. రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్‌కి అతి దగ్గర్లో ఉంది.
ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల తొలి ప్రయత్నంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. రంగస్థలంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే దర్శకుడిగా తన మాస్ మార్క్ చూపించాడు. దీంతో శ్రీకాంత్ ఓదలె నెక్ట్స్ సినిమా ఎవరితో తీయనున్నారనే క్యూరియాసిటీ నెలకొంది.
ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కినేని అఖిల్‌కు ఇప్పటికే ఆయన కథ చెప్పారని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment