
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది.
విడుదలైన వారం రోజుల్లోనే దసరా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి అదరగొడుతుంది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనూ దసరా పాటలు, డైలాగ్స్ మోత మోగుతోంది.
సినిమా సూపర్ హిట్ కావడంతో రీసెంట్‌గా కరీంనగర్‌లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే దసరా మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు మేకింగ్ వీడియోను వదిలారు. మీరూ చూసేయండి మరి.
Comments
Please login to add a commentAdd a comment