BTS
-
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
బీటీఎస్ బ్యాండ్ బాయ్స్‌కి గడ్డం ఉంటే.. ఎలా ఉంటుందో చూడండి..
-
'దసరా' మూవీ షూటింగ్ ఎలా జరిగిందో తెలుసా? వీడియో రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దసరా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి అదరగొడుతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనూ దసరా పాటలు, డైలాగ్స్ మోత మోగుతోంది. సినిమా సూపర్ హిట్ కావడంతో రీసెంట్గా కరీంనగర్లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే దసరా మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు మేకింగ్ వీడియోను వదిలారు. మీరూ చూసేయండి మరి. -
పాపులర్ బిటిఎస్ బాయ్ నోట మన తెలుగు పాట.. వీడియో వైరల్
కొరియన్ బిటిఎస్ బాయ్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యూజిక్ బ్యాండ్‌కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి వీడియోలే దర్శనం ఇస్తాయి. ఈ బిటిఎస్ బ్యాండ్‌లోని బాయ్స్‌కు ఉండే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలంటూ కుప్పలు తెప్పలుగా వారికి రిక్వెస్ట్స్ వస్తుంటాయట. ఇదిలా ఉంటే ఈ బిటిఎస్ బ్యాండ్‌కు చెందిన ఓ సింగర్ మన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అంటే చాలా ఇష్టమట. చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ తాజాగా అతడు ఆ పాటకు హమ్ చేస్తూ స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి ఆ సింగర్ ఎవరంటే అమ్మాయిల రాకుమారుడైన జంగ్ కూక్. రీసెంట్గా జంగ్ కూక్ నాటు నాటు పాట వింటూ ఆ పాటను స్వయంగా ఆలిపించాడు. అయితే ఈ పాటను తెలుగులోనే విని పాడటం విశేషం. పాడటంమే కాదే నాటు నాటు సిగ్నేచర్ స్టేప్ కూడా వేశాడు. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అనంతరం ఈ పాట తనని ఎంతగా ఆకట్టుకుందో కూడా వివరించిన వీడియోను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం వీడియోకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బిటిఎస్ బ్యాండ్ సింగర్ స్వయంగా నాటు నాటు పాడటం చూసి తెలుగు అభిమానులంతా మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక జంగ్ కూక్ నాటు నాటు పాట పాడిన అనంతరం ప్రస్తుతం ఈ పాట, ఆర్ఆర్ఆర్ సౌత్ కొరియాలో ట్రెండింగ్‌లో నిలిచిందని సమాచారం. -
పాప్ బ్యాండ్ బీటీఎస్‌తో బైడెన్ భేటీ : వీడియో వైరల్
Biden says it was great to meet BTS: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ సూపర్ గ్రూప్ బీటీఎస్ బృందం అమెరికా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమవేశమైంది. ఈ సమావేశంలో ఆసియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, వివక్షత తదితర అంశాలకు సంబంధించిన పరిష్కారమార్గాల గురించి చర్చించారు. ఈ మేరకు పాప్ బృందం బైడెన్‌ని కలవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, వివక్ష పెరుగుదల గురించి అవగాహన పెంచడానికి బైడెన్ చేస్తున్న కృషిని ప్రశంసించింది. కరోనాకి సంబంధించిన ద్వేష పూరిత నేరాల చట్టంపై సంతంకం చేయడం వంటి బైడెన్ నిర్ణయాలను పాప్ బృందం కొనియాడింది. గత కొంతకాలంలో వైట్‌హౌస్‌లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు బైడెన్ చేస్తున్న కృషిని అభినందించడమే కాకుండా తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు శ్వేతసౌధంలో జరిగిన సమావేశానాకి సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. It was great to meet with you, @bts_bighit. Thanks for all you’re doing to raise awareness around the rise in anti-Asian hate crimes and discrimination. I look forward to sharing more of our conversation soon. pic.twitter.com/LnczTpT2aL — President Biden (@POTUS) June 1, 2022 (చదవండి: అందుకే ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయం: ఎట్టకేలకు బైడెన్ కీలక ప్రకటన) -
BTS Butter Music Video: గంటలో రికార్డులు బద్ధలు!
'బీటీఎస్'... వరల్డ్ వైడ్‌గా పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. ఇండియాలోనూ ఈ గ్రూప్‌కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుగురు సౌత్ కొరియన్ బాయ్స్‌తో ఉండే ఈ గుంపు.. పాప్ ప్రపంచంలో ఓ ప్రభంజనం. కొరియా నుంచి మొదలై జపాన్, అమెరికా.. ఇలా వరుస దేశాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ.. ఇంటర్నేషనల్ సెన్సేషన్‌గా మారింది. వీళ్ల ఆల్బమ్స్ మిలియన్ల కొద్దీ కాపీల్ని అమ్ముడు పోతుంటాయి. రీసెంట్గా ట్విట్టర్, యూట్యూబ్‌లతో అదిరిపోయే రికార్డులతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది బీటీఎస్. బీటీఎస్ లేటెస్ట్ ఆల్బమ్ ‘బటర్’ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన కాసేపటికే రికార్డుల మోత మొదలైంది. సాంగ్ లాంచ్ లైవ్‌ను 3.89 మిలియన్ల మంది యూట్యూబ్ ప్రీమియర్‌లో వీక్షించగా, కేవలం పదమూడు నిమిషాల్లోనే కోటి మంది యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ను చూశారు. 54 నిమిషాల్లో రెండు కోట్ల మంది వీక్షించడం కూడా యూట్యూబ్‌లో ఓ రికార్డే. ఇది వరకు ఈ రికార్డు బీటీఎస్ వాళ్ల ‘డైనమైట్’ ఆల్బమ్ పేరిటే ఉండేది. ఇక నాలుగు గంటల్లో యూట్యూబ్‌లో 37 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది బటర్. ఇది బీటీఎస్కి రెండో ఇంగ్లీష్ సింగిల్ ఆల్బమ్. ఇంకోవైపు వరల్డ్‌వైడ్‌గా బటర్‌కి సంబంధించిన హ్యాష్‌ట్యాగులు ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.