Korean BTS Member Jungkook Plays Naatu Naatu Song From RRR Movie - Sakshi
Sakshi News home page

BTS Boys: పాపులర్‌ బిటిఎస్‌ బాయ్‌ నోట మన తెలుగు పాట.. ట్రెండింగ్‌లో నాటు నాటు

Mar 4 2023 1:43 PM | Updated on Mar 4 2023 2:29 PM

Korean BTS Member Jungkook Plays Naatu Naatu Song From RRR Movie - Sakshi

కొరియన్‌ బిటిఎస్‌ బాయ్స్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యూజిక్‌ బ్యాండ్‌కి విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన వీరి వీడియోలే దర్శనం ఇస్తాయి. ఈ బిటిఎస్‌ బ్యాండ్‌లోని బాయ్స్‌కు ఉండే లేడీ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలంటూ కుప్పలు తెప్పలుగా వారికి రిక్వెస్ట్స్‌ వస్తుంటాయట. ఇదిలా ఉంటే ఈ బిటిఎస్‌ బ్యాండ్‌కు చెందిన ఓ సింగర్‌ మన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని నాటు నాటు సాంగ్‌ అంటే చాలా ఇష్టమట.

చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ

తాజాగా అతడు ఆ పాటకు హమ్‌ చేస్తూ స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి ఆ సింగర్‌ ఎవరంటే అమ్మాయిల రాకుమారుడైన జంగ్‌ కూక్‌. రీసెంట్‌గా జంగ్‌ కూక్‌ నాటు నాటు పాట వింటూ ఆ పాటను స్వయంగా ఆలిపించాడు. అయితే ఈ పాటను తెలుగులోనే విని పాడటం విశేషం. పాడటంమే కాదే నాటు నాటు సిగ్నేచర్‌ స్టేప్‌ కూడా వేశాడు. 

చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏ జన్మ పుణ్యమో..

అనంతరం ఈ పాట తనని ఎంతగా ఆకట్టుకుందో కూడా వివరించిన వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేశాడు.  ప్రస్తుతం వీడియోకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బిటిఎస్‌ బ్యాండ్‌ సింగర్‌ స్వయంగా నాటు నాటు పాడటం చూసి తెలుగు అభిమానులంతా మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఇక జంగ్‌ కూక్‌ నాటు నాటు పాట పాడిన అనంతరం ప్రస్తుతం ఈ పాట, ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్‌ కొరియాలో ట్రెండింగ్‌లో నిలిచిందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement