ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే నాటునాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దక్కించుకుంది. తాజాగా నాటునాటు పాటకు లండన్‌లో డ్యాన్స్ చేస్తూ అలరించారు. ఏకంగా 700 మంది లండన్ వీధుల్లో స్టెప్పులేస్తూ సందడి చేశారు.
(ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!)
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. మహిళలంతా శారీలతో ఆర్ఆర్ఆర్ సాంగ్‌కు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు ధరించిన మహిళలు లండన్ వీధుల్లో దుమ్ములేపారు. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల నాటు నాటు స్టెప్పులతో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సాంగ్ క్రేజీ మామూలుగా లేదంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్.
(ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!)
Naatu Naatu opposite 10 Downing Street today https://t.co/neqM08DJuu pic.twitter.com/WMIUfvSqqD
— Naomi Canton (@naomi2009) August 7, 2023
The saree walkathon ended up at Gandhi's statue in Parliament Square opposite Big Ben. The aim was to promote hand-woven sarees from across India to mark national handloom day. https://t.co/neqM08DJuu pic.twitter.com/kcqqPR1gil
— Naomi Canton (@naomi2009) August 7, 2023
Comments
Please login to add a commentAdd a comment