టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది.
ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్‌ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు.
(ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!)
తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్‌లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని అన్నారు.
తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు.
James Cameron.. 🤗
Your precious words always inspire us to strive better and be the best.
We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC— RRR Movie (@RRRMovie) February 7, 2024
Comments
Please login to add a commentAdd a comment