స్వర్ణకమలం మీద ఇష్టంతో... | aadhi, shraddha srinadh is new movie shooting started at hyderabad. | Sakshi
Sakshi News home page

స్వర్ణకమలం మీద ఇష్టంతో...

Published Sat, Jun 10 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

స్వర్ణకమలం మీద ఇష్టంతో...

స్వర్ణకమలం మీద ఇష్టంతో...

ఆది, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా విశ్వనాథ్‌ అరిగెల దర్శకత్వంలో ఉప్పలపాటి చరణ్‌తేజ్, గుర్రం విజయలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత చరణ్‌ తేజ్‌ తల్లిదండ్రులు ఉప్పలపాటి రామకృష్ణ, అనురాధ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌గారి సినిమాల్లో ‘స్వర్ణకమలం’, అందులో భానుప్రియగారి పాత్ర నాకు బాగా ఇష్టం. ఆ తరహా సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమా అలానే ఉంటుంది.

ఆది ఏ పాత్రను అయినా బాగా చేయగలుగుతారు. అయితే హీరోయిన్‌కు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉండాలి. అందుకే శ్రద్ధా శ్రీనాథ్‌ను తీసుకున్నాం. ఈ నెల 19న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రెండేళ్ల క్రితమే ఈ కథ వినిపించిన దర్శకుడు మూడున్నర నెలల క్రితం బౌండెడ్‌ స్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చాడు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నా’’ అన్నారు ఆది. ‘‘కన్నడలో రెండు, తమిళంలో ఓ సినిమా చేశా. తెలుగులో నా తొలి సినిమా ఇది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: రాఘవ చండ్ర, కొలిపెర్ల రోహిత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement