thalasani srinivasa yadav
-
ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పనకు రూ.7289 కోట్లు
హిమాయత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు మూడు దశల్లో రూ.7289 కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నట్టు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. మొదటి దశలో 239 పాఠశాలల్లో 35శాతం నిధులను ఖర్చు చేసి మే 15వ తేదీలోపు వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన బస్తీ–మన బడి’ కార్యక్రమం అమలులో భాగంగా శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయులతో మంత్రి తలసాని అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మహముద్ అలీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటే ష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, టీఎస్‌డబ్ల్యూఈఐసీడీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , జీహెచ్ఎంసీ కమిషనర్ లోకే ష్‌కుమార్ హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల విచ్చలవిడి ఫీజుల వల్ల ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో విద్య ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో పేదలకు భారంగా ఉన్న విద్యను సులభతరం చేసేందుకు, ప్రైవేటు విద్య కంటే నాణ్యమైన, విలువైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ‘మన బస్తీ–మన బడి’కి శ్రీకారం చుట్టారని తెలిపారు. ముందుగా బడులను బాగు చేసి అన్ని వర్గాల వారికి ప్రభుత్వ బడులపై నమ్మకం, విశ్వాసం కలిగించడమే సీఎం ఉద్దేశమన్నారు. స్కూళ్లల్లో కరెంటు కట్ చేయొద్దు స్కూలు గేటు మొదలు ప్రహరీ గోడ, స్కూల్లో ఫర్నీచర్, మంచినీటి సదుపాయం, మూత్రశాలలు ఇలా ప్రతి ఒక్క సౌకర్యంపై దృష్టి సారిస్తామని తలసాని తెలిపారు. కరెంట్ బకాయిలు కారణంగా ఏఒక్క ప్రభుత్వ స్కూల్లో కరెంట్ కట్ అవడానికి వీలు లేదన్నారు. విద్యుత్ శాఖ, విద్యాశాఖ రెండూ ప్రభుత్వ శాఖలే కాబట్టి..ఈ రెండు శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలే గానీ కరెంట్ సరఫరా నిలుపుదల చేయకూడదన్నారు. ఈ విషయంలో విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్, డీఈఓలు అవసరమైతే నేరుగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు. -
స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన విచారకరం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోంది.. ఫైర్ సేఫ్టీ పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులకు చెబుతున్నామని, అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో బయటికి రాలేక ఆరుగురు 5 అంతస్తులోనే చిక్కుకుని మరణించిన సంగతి తెలిసిందే. వారంతా క్యూనేట్ అనే సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసిందన్న ఆయన.. ఆ సంస్థపై ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయం కాకుండా యూనిట్ నుంచి కూడా బాధితులకు సాయమందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదాలు అన్నీ 40 ఏళ్ల నాటివని.. ఈ క్రమంలో పాత బిల్డింగులు ఫైర్ సేఫ్టీ లేని భవనాలు సుమారుగా 30 లక్షల దాకా ఉన్నాయని తెలిపారు. వీటిపై చర్యలు తీసుకునే క్రమంలో ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ.. ప్రమాద ఘటన పై ఒక కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయన్న ఆమె..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
బాలుగాడి లవ్ స్టోరీ’.. టీజర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని
ఆకుల అఖిల్, దర్శక మీనన్, ‘చిత్రం’ శ్రీను, ‘జబర్దస్త్’ గడ్డం నవీన్, ‘జబర్దస్త్’ చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాలుగాడి లవ్ స్టోరీ’. యల్. శ్రీనివాస్ తేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం ఇది. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రిలీజ్ చేసి, చిత్రం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. మంచి కాన్సెప్ట్, కథ ఉన్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో వస్తున్నాం. ఈ సినిమా హిట్‌ని మా తల్లిదండ్రులకు గిప్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు ఆకుల అఖిల్. ‘‘లవ్, సస్పెన్స్ అంశాలతో కూడిన చిత్రం ఇది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
కిలో మటన్ రూ.700కే అమ్మాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మటన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారాన్ని బట్టి కొన్ని షాపుల్లో రూ. వెయ్యి వరకు ధరలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మటన్ ధరలను కళ్లెం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. కిలో మటన్ రూ. 700 రూపాయలకే అమ్మాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేశించారు. అలాగే చేపలు, కోళ్లు, గుడ్లుకు ధరలు పెరగకుండా పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముందుగా నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని, రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. (తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు) శనివారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించామని తెలిపారు. తెలంగాణలో లాక్డౌన్ అమలు, కరోనా పరీక్షలు జరుగుతున్న తీరును కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రసంశించారని అన్నారు. వలస కార్మికుల తరలింపునకు రైళ్లు ఏర్పాటు చేయాలని తామే మొదట సూచించినట్లు తలసాని గుర్తుచేశారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. (రెడ్ జోన్లో దేశ రాజధాని జిల్లాలు) ‘కరోనా వైరస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుని మాట్లాడాలి. బాధ్యత కలిగిన ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడు కరోనా కష్ట కాలంలో విమర్శలు చేయడం భావ్యం కాదు. నరం లేని నాలుక ఉందని, పనికి మాలిన చెత్త నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఫంక్షన్ పెట్టమని అడిగి మరీ వచ్చాను
‘‘నిఖిల్ సినిమాలు గతంలో ఒకటి, రెండు చూశా. కానీ, కలిసే సందర్భం రాలేదు. ‘అర్జున్ సురవరం’ప్రీమియర్ షోలో నన్ను చూడగానే తను ఎగై్జట్ అయిన విధానం చూస్తే నాకు మరో తమ్ముడు, శిష్యుడు దొరికాడని సంతోషం కలిగింది. ప్రేమించే మనుషులు దొరకడం బ్యాంక్ బ్యాలెన్స్‌గా భావిస్తా. నిఖిల్ వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగిందనుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్‌కి నేను రావడం చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను బిజీగా ఉంటాను కాబట్టి నన్ను ఫంక్షన్‌కి రమ్మని ‘ఠాగూర్’ మధు ఇబ్బంది పెట్టరు. మరి ఎవరి ప్రభావంతో, ఎవరి ప్రమేయంతో వచ్చానన్నది చాలా మందికి అనుమానం ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత నేనే రావాలనుకున్నా. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని వచ్చా. నిర్మాత రాజ్‌కుమార్ మరొక ప్రధానమైన కారణం. ఎక్కడైనా పైరసీ జరుగుతుంటే సైబర్ పోలీసుల్లా వెళ్లి తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని పూర్తీగా ధ్వంసం చేసి, ఇండస్ట్రీకి గొప్ప సహాయం చేస్తున్నాడు. తను సినిమా తీస్తున్నాడనే విషయం, తన వెనక ‘ఠాగూర్’ మధు ఉన్నాడనే విషయం నాకు తెలియదు. ఓ రోజు వచ్చి సినిమా తీశాననగానే ఆశ్చర్యంగా అనిపించింది.. ప్రివ్యూ చూశాక ఫంక్షన్‌కి పిలుస్తారేమో అనుకుంటే పిలవలేదు. నన్ను పిలవడానికి కూడా తనకి మొహమాటం. ఈ సినిమా గురించి ప్రజలకు చెప్పాలి, వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాలంటే నన్ను ఉపయోగించుకోండి అన్నాను.. అయినా కూడా ఇబ్బంది పడ్డాడు (నవ్వుతూ). సంతోష్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సినిమా చేశాడు. కథ బాగుంటే భాషతో సంబంధం లేదు.. ఎవరైనా ఆదరిస్తారు. లవర్‌బాయ్‌గా ఉండే నిఖిల్ ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మారాడనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే కంటెంట్‌తో కనెక్ట్ అవుతారు. స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత చూడాలి. ఇప్పటి వరకూ ఏ ఫంక్షన్‌కైనా నన్ను పిలిస్తే వెళ్లాను. కానీ, ‘అర్జున్ సురవరం’ సినిమాకి ఫంక్షన్ పెట్టుకోండి, ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి మరీ పెట్టించుకున్నా (నవ్వుతూ). లావణ్యా త్రిపాఠి నవ్వంటే నాకు ఇష్టం. ఆ సొట్ట బుగ్గలు భలే ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాల ఫంక్షన్స్‌కి నేనున్నాను అంటూ ముందుకొచ్చే నా సోదరుడు తలసానిగారికి అభినందనలు. ఈ సినిమాలోని ‘చేగువేరా..’ పాట చూస్తున్నప్పుడు నా తమ్ముడు పవన్ కల్యాణ్ గుర్తొచ్చాడు’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఆదరించి హిట్ చేయాలి. ‘బాహుబలి, సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ సత్తా చాటాయి. చిరంజీవిగారు టీవీ సీరియల్స్, సినిమా ఫంక్షన్స్‌తో పాటు ఇలాంటి చిన్న సినిమాల వేడుకలకు రావడం చాలా సంతోషం. ఆయన రావడం వల్ల చిన్న సినిమాల స్టామినా పెరిగి జనాల్లో క్రేజ్ వస్తుంది.. అందుకే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటున్నాను’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘ఇది నిజమో, కలో అర్థం కావడం లేదు. లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మెగాస్టార్ చిరంజీవిగారు మా ఫంక్షన్‌కి వస్తారంటే నమ్మలేకపోయాను.. కానీ ఆయన వచ్చారు.. వేదికపై ఉన్నారు. మా సినిమాకి చాలా అడ్డకుంలు వచ్చాయి. ఆ దేవుడు రూపంలో చిరంజీవిగారు వచ్చారు. మా సినిమా చూసిన ఆయన నన్ను హత్తుకున్న రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ– ‘‘నేను ఓ సినిమా నిర్మించడం, ఆ ఫంక్షన్‌కి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ‘ఛాలెంజ్’ సినిమా స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ ముందుకు నడిపిస్తోంది’’ అన్నారు. ‘‘మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన చిరంజీవిగారికి, ఆయన అభిమానులకు థ్యాంక్స్. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు టి.సంతోష్. ‘‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇది.. రిలీజ్ కోసం ఎగై్జటెడ్‌గా ఉన్నా’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. దర్శకులు మారుతి, చందూ మొండేటి, నటుడు రాజా రవీంద్ర, కెమెరామేన్ సూర్య తదితరులు పాల్గొన్నారు. -
‘అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాడు’
సాక్షి, నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించి చంద్రబాబు నాయుడు కుంటిసాకుగా ఢిల్లీకి పారిపోయి ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి తప్పదని ఈవీఎంలపై చంద్రబాబు దమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. ఐటీ టెక్నాలజీకి కేరాష్ అడ్రస్ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక శక్తిగా మారబోతున్నారన్నారు. -
6 కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కొత్త మంత్రివర్గంలో ఆరు కొత్త ముఖాలకు చోటు దక్కింది. నేడు ఉదయం 11.30లకు పదిమంది మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. గత కేబినెట్ నుంచి నలుగురు పాతవారికే కొత్త జాబితాలో స్థానం దక్కింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. పాతవారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి మాత్రమే తాజా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని వీరిని సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో ఆహ్వానించారు. ‘మీరు ప్రభుత్వంలో ఉంటున్నారు. బంగారు తెలంగాణ సాధనకు కలిసి పనిచేద్దాం’అని సీఎం చెప్పారు. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు సైతం మంత్రులుగా ప్రమాణం చేసే వారికి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఫోన్లో సీఎం మాట్లాడిన వెంటనే వీరంతా ప్రగతిభవన్‌కు చేరుకుని కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం కోసం సాధారణ పరిపాలన శాఖ రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త మంత్రులకు నిబంధనల ప్రకారం కేటాయించాల్సిన అధికారిక వాహనాలను సిద్ధం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులకు, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలకు ఆహ్వానాలు పంపించారు. మహిళలు, ఎస్టీలకు నో చాన్స్ సీఎం కేసీఆర్ పదిమంది టీమ్‌లో ఆరుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్‌అలీ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారికి మంత్రులుగా అవకాశం దక్కలేదు. ఎస్టీ వర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)ల పేర్లను పరిశీలించినా చివరికి ఈ వర్గం నుంచి ఎవరినీ ఎంపిక చేయకుండా వాయిదా వేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈసారీ మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. టీఆర్ఎస్ తరుఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)లలో ఒకరికి తాజా విస్తరణలో మంత్రిగా చాన్స్ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. జాబితాలో మాత్రం మహిళలకు చోటు దక్కలేదు. ఆ ఏడుగురికి అవకాశం లేదు గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో ఐదుగురే మళ్లీ మంత్రులుగా ఉండబోతున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ గతంలోనే ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. దీంతో పాతవారిలో ఐదుగురికి మళ్లీ అమాత్యయోగం దక్కింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన మినహా ఏడుగురికి అవకాశం దక్కలేదు. కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, కె.తారకరామారావు, జోగు రామన్న, టి.పద్మారావుగౌడ్, సి.లక్ష్మారెడ్డిలకు ఈసారి మంత్రులుగా అవకాశం రాలేదు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నం కానున్నారు. ఈ కారణంగా కేటీఆర్‌కు తాజా విస్తరణలో మంత్రి పదవిని కేటాయించలేదు. అయితే టీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుకు మంత్రి పదవి దక్కపోవడంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలకు డబుల్... మంత్రి విస్తరణలో మహబూబ్‌నగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. గత ప్రభుత్వంలోనూ ఈ రెండు జిల్లాలకు ఇదే రకంగా ప్రాతినిథ్యం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో కె.తారకరామారావు, ఈటల రాజేందర్ మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్లకు చోటు దక్కింది. ఉమ్మడి మహబూబ్‌నర్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మంత్రులుగా ఉంటున్నారు. మెదక్ ఉమ్మడి సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఈ జిల్లా నుంచి తన్నీరు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు తాజా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కలేదు. గత సంప్రదాయం మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ గత సంప్రదాయాన్నే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 2014లో జూన్ 2న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అదే ఏడాది డిసెంబరులో మరోసారి విస్తరణ తర్వాత కొత్తగా ఆరుగురిని మంత్రులుగా చేర్చుకున్నారు. ఈ విస్తరణలోనే ఎస్టీ వర్గానికి చెందిన అజ్మీరా చందులాల్, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ ఈసారీ మరోసారీ రెండో విస్తరణలో ఆరుగురికి అవకాశం కల్పించనున్నారు. ఈటలకు ఆలస్యంగా! మంత్రులుగా ప్రమాణం చేసే వారికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లో సమాచారం ఇచ్చి ఆహ్వానించడం సంప్రదాయం. సీఎం కేసీఆర్ ఎంపిక చేసిన పది మందికి సీఎం ఆఫీస్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఫోన్లు చేశారు. తొమ్మిది మందికి సాయంత్రం ఏడు గంటలకు ఫోన్లో సమాచారం అందింది. ఈటల రాజేందర్‌కు మాత్రం రాత్రి 10 గంటల తర్వాత ఫోన్లో అధికారిక సమాచారం వచ్చింది. మొదట తొమ్మిది మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందని అనుకున్నారు. చివరికు రాత్రి పది గంటలకు ఫోన్ రావడంతో ఈటల వర్గీయులు ఊరట చెందారు. మరోసారి విస్తరణలో ఆరుగురు లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి. అప్పుడు మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ ఆరుగురు ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. తదుపరి విస్తరణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, ఎస్టీ వర్గానికి చెందిన ఒకరికి కచ్చితంగా చోటు దక్కనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన ముగ్గురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎంపికైన వారి వివరాలు ఆదిలాబాద్ : అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) నిజామాబాద్ : వేముల ప్రశాంత్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) కరీంనగర్ : కొప్పుల ఈశ్వర్ – ఎస్సీ(మాల), ఈటల రాజేందర్ – బీసీ (ముదిరాజ్) మహబూబ్‌నగర్: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి – ఓసీ(రెడ్డి), వి. శ్రీనివాస్‌గౌడ్ – బీసీ(గౌడ్) హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌యాదవ్ – బీసీ(యాదవ) రంగారెడ్డి: చామకూర మల్లారెడ్డి – ఓసీ(రెడ్డి) నల్లగొండ: గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) వరంగల్: ఎర్రబెల్లి దయాకర్‌రావు – ఓసీ(వెలమ) -
పంపిణీకి రాజస్తాన్, గుజరాత్ గొర్రెలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేశామని, ఇకపై రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల పంపిణీలో 96.13 శాతంతో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 94.04 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. రంగారెడ్డి, సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో తొలి జాబితా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తయిందని, రెండో జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు. త్వరలో గొర్రెల పెంపకందారులు, మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చెరువులు, రిజర్వాయర్లలో గతేడాది 22 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, ఈ ఏడాది 51 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఆక్వా ఎక్స్పో నిర్వహిస్తున్నామని, 25 దేశాల ప్రతినిధులు రానున్నట్లు వివరించారు. -
80 వేల గొర్రెలు పంపిణీ చేశాం: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80,724 గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఈ నెల 20న ప్రారంభించిన గొర్రెల పంపిణీ అమలును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పశుసంవర్థక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటు న్నారని మంత్రి తెలిపారు. పథకం అమలులో ఏమైనా సమస్యలుంటే సలహాలు, సూచనలు చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ ఛైర్మన్ రాజయ్యయాదవ్, ఎండీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
స్వర్ణకమలం మీద ఇష్టంతో...
ఆది, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఉప్పలపాటి చరణ్‌తేజ్, గుర్రం విజయలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత చరణ్ తేజ్ తల్లిదండ్రులు ఉప్పలపాటి రామకృష్ణ, అనురాధ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌గారి సినిమాల్లో ‘స్వర్ణకమలం’, అందులో భానుప్రియగారి పాత్ర నాకు బాగా ఇష్టం. ఆ తరహా సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమా అలానే ఉంటుంది. ఆది ఏ పాత్రను అయినా బాగా చేయగలుగుతారు. అయితే హీరోయిన్‌కు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉండాలి. అందుకే శ్రద్ధా శ్రీనాథ్‌ను తీసుకున్నాం. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. రెండేళ్ల క్రితమే ఈ కథ వినిపించిన దర్శకుడు మూడున్నర నెలల క్రితం బౌండెడ్ స్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నా’’ అన్నారు ఆది. ‘‘కన్నడలో రెండు, తమిళంలో ఓ సినిమా చేశా. తెలుగులో నా తొలి సినిమా ఇది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ చండ్ర, కొలిపెర్ల రోహిత్. -
ముంబై వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం సోమవారం ఉదయం ముంబై నగరానికి వెళ్లారు. అక్కడ అంతర్ రాష్ట్ర సరిహద్దులు, చెక్ పోస్టులు, వాణిజ్య పన్నుల విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం కోసమే మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీ బాల్క సుమన్, అధికారుల బృందం సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. -
'చంద్రబాబు డబ్బు వ్యవహారాల గురించి నాకే బాగా తెలుసు'
హైదరాబాద్: రాజకీయాల్లో డబ్బు ప్రవాహాన్ని తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని.. ఆయన డబ్బు వ్యవహారాల గురించి తనకే బాగా తెలుసునని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను నిప్పంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఏపీకి ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఆయన అన్నారు. నగరంలో 20 ఏళ్లుగా విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగాయని తెలిపారు. రూ.25 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. అదే విధంగా కొత్త నిర్మాణాల కోసం సింగిల్ విండో అనుమతులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల అవసరం లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అంతేకాకుండా 111 జీవో విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.