80 వేల గొర్రెలు పంపిణీ చేశాం: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80,724 గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఈ నెల 20న ప్రారంభించిన గొర్రెల పంపిణీ అమలును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పశుసంవర్థక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటు న్నారని మంత్రి తెలిపారు. పథకం అమలులో ఏమైనా సమస్యలుంటే సలహాలు, సూచనలు చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ ఛైర్మన్ రాజయ్యయాదవ్, ఎండీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.