బాలుగాడి లవ్‌ స్టోరీ’.. టీజర్‌ రిలీజ్‌ చేసిన మంత్రి తలసాని | Balu Gadi Love Story Teaser unveiled at Minister Srinivas | Sakshi
Sakshi News home page

బాలుగాడి లవ్‌ స్టోరీ’.. టీజర్‌ రిలీజ్‌ చేసిన మంత్రి తలసాని

Published Tue, Jan 17 2023 12:41 AM | Last Updated on Tue, Jan 17 2023 8:10 AM

Balu Gadi Love Story Teaser unveiled at Minister Srinivas - Sakshi

ఆకుల అఖిల్, దర్శక మీనన్, ‘చిత్రం’ శ్రీను, ‘జబర్దస్త్‌’ గడ్డం నవీన్, ‘జబర్దస్త్‌’ చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాలుగాడి లవ్‌ స్టోరీ’. యల్‌. శ్రీనివాస్‌ తేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం ఇది. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ రిలీజ్‌ చేసి, చిత్రం యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

అనంతరం ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ– ‘‘టీజర్‌ బాగుంది. మంచి కాన్సెప్ట్, కథ ఉన్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో వస్తున్నాం. ఈ సినిమా హిట్‌ని మా తల్లిదండ్రులకు గిప్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు ఆకుల అఖిల్‌. ‘‘లవ్, సస్పెన్స్‌ అంశాలతో కూడిన చిత్రం ఇది. బ్యాలెన్స్‌ ఉన్న స్పెషల్‌ సాంగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement