Chitram Srinu
-
బాలుగాడి లవ్ స్టోరీ’.. టీజర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని
ఆకుల అఖిల్, దర్శక మీనన్, ‘చిత్రం’ శ్రీను, ‘జబర్దస్త్’ గడ్డం నవీన్, ‘జబర్దస్త్’ చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాలుగాడి లవ్ స్టోరీ’. యల్. శ్రీనివాస్ తేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం ఇది. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రిలీజ్ చేసి, చిత్రం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. మంచి కాన్సెప్ట్, కథ ఉన్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో వస్తున్నాం. ఈ సినిమా హిట్‌ని మా తల్లిదండ్రులకు గిప్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు ఆకుల అఖిల్. ‘‘లవ్, సస్పెన్స్ అంశాలతో కూడిన చిత్రం ఇది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
'జయహో ఇండియన్స్' ఆంథమ్ సాంగ్ వచ్చేసింది
మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేది నాయకులా? అమాయకులా? దేశమా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజ్ భీమ్‌రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ‘చిత్రం’ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్ భీమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘జయహో ఇండియన్స్..’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా యాజిన్ నిజార్ పాడారు. ‘‘ఇప్పటికే విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘జయహో ఇండియన్స్..’ ఆంథమ్కి కూడా స్పందన బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
ముగ్గురు దర్శకుల విశ్వదాభిరామ
‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘విశ్వదాభిరామ’. ఈ చిత్రానికి సురేష్ కాశీ, సురేంద్ర కమల్, అశోక్ చక్రం దర్శకత్వం వహించడం విశేషం. సోలో స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్(సురేంద్ర వంటి పులి) నిర్మించారు. దర్శకులు మాట్లాడుతూ –‘‘కొండవీటి కోట నేపథ్యంలో జరిగే డెత్ గేమ్ థ్రిల్లర్ ‘విశ్వదాభిరామ’. ఇప్పటి వరకూ కామెడీ పాత్రల్లో అలరించిన ‘చిత్రం’ శీను ఈ చిత్రంలో తొలిసారి విలన్‌గా నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఇదొక సరికొత్త థ్రిల్ కలిగిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. భువన్ తేజ్, అనిల్, ఆనంద్, సహస్ర, రాజారెడ్డి, మానస నటించిన ఈ చిత్రానికి కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ. -
260 సినిమాల్లో నటించా
హాస్యనటుడు ‘చిత్రం’ శ్రీను రాజమండ్రి : గోదావరి అందాలు, పాపికొండలు అంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిత్రం శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 260 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. మలకపల్లిలో సత్యసింహ సీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్ర: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు జ: తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా నటుడినయ్యూ. ఇప్పటి వరకు 260 సినిమాల్లో నటించా. ప్ర: మీకు బాగా నచ్చిన, పేరు తెచ్చిన సినిమాలు జ: నేను నటించిన అన్ని సినిమాలు ఇష్టమే. చిత్రం, ఆనందం, వెంకీ, దుబాయ్ శ్రీను, బొమ్మరిల్లు, మంత్ర, 100% లవ్, ఆది నాకు మంచి పేరును, గుర్తింపును తెచ్చారుు. ప్ర: మీ సొంత ఊరు జ: ఖమ్మం ప్ర: ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు జ: సునీల్ హీరోగా నటిస్తున్న సినిమాలో, శ్రీకాంత్, రవితేజలు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నా. సత్యసింహ సీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమాలో మంచి పాత్ర చేస్తున్నా. ప్ర: గోదావరి ప్రాంతం గురించి.. జ: నాకు గోదావరి ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. జిల్లాలో పలు సినిమాలు షూటింగ్‌ల సమయంలో వచ్చాను. కొవ్వూరు పరిసరాల్లోకి రావడం ఇదే మొదటిసారి. చాలాబాగుంది. పల్లెటూరి వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది.