260 సినిమాల్లో నటించా | Chitram Srinu interview with sakshi | Sakshi
Sakshi News home page

260 సినిమాల్లో నటించా

Published Sun, Aug 2 2015 9:55 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

260 సినిమాల్లో నటించా - Sakshi

260 సినిమాల్లో నటించా

హాస్యనటుడు ‘చిత్రం’ శ్రీను
 
రాజమండ్రి : గోదావరి అందాలు, పాపికొండలు అంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిత్రం శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 260 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. మలకపల్లిలో సత్యసింహ సీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం  ‘సాక్షి’తో ముచ్చటించారు.
 
ప్ర: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు

జ: తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా నటుడినయ్యూ. ఇప్పటి వరకు 260 సినిమాల్లో నటించా.

ప్ర: మీకు బాగా నచ్చిన, పేరు తెచ్చిన సినిమాలు
జ: నేను నటించిన అన్ని సినిమాలు ఇష్టమే. చిత్రం, ఆనందం, వెంకీ, దుబాయ్ శ్రీను, బొమ్మరిల్లు, మంత్ర, 100% లవ్, ఆది నాకు మంచి పేరును, గుర్తింపును తెచ్చారుు.

ప్ర: మీ సొంత ఊరు
జ: ఖమ్మం

ప్ర: ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు
జ: సునీల్ హీరోగా నటిస్తున్న సినిమాలో, శ్రీకాంత్, రవితేజలు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నా. సత్యసింహ సీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమాలో మంచి పాత్ర చేస్తున్నా.

ప్ర: గోదావరి ప్రాంతం గురించి..
జ: నాకు గోదావరి ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. జిల్లాలో పలు సినిమాలు షూటింగ్‌ల సమయంలో వచ్చాను. కొవ్వూరు పరిసరాల్లోకి రావడం ఇదే మొదటిసారి. చాలాబాగుంది. పల్లెటూరి వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement