మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేది నాయకులా? అమాయకులా? దేశమా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజ్ భీమ్‌రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ‘చిత్రం’ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్ భీమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘జయహో ఇండియన్స్..’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా యాజిన్ నిజార్ పాడారు. ‘‘ఇప్పటికే విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘జయహో ఇండియన్స్..’ ఆంథమ్‌కి కూడా స్పందన బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment