
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే.
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు.
లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది.
చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి