Kasarla Shyam
-
రాములో రాముల పాటను అందరూ చాలా ఆదరించారు
-
ఆ పాటతో నాకు అంత పెద్ద పేరు వచ్చింది
-
కాసర్ల శ్యామ్ జోర్దార్ పాటలు
-
‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’.. భీమ్స్ సాంగ్ అదిరింది
ఈ మధ్య కాలంలో తెలంగాణ జానపద గీతాలకు చిత్ర పరిశ్రమలో మంచి స్పందల లభిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఫోక్ సాంగ్స్ ఉంటున్నాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్గాను ఈ పాటలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నివృతి వైబ్స్ సంస్థ అత్యుత్తమమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆడియో, విజువల్ కంటెంట్‌తో ఫోక్ సాంగ్స్‌ని చిత్రీకరించి యూట్యూబ్‌లో రిలీజ్ చేసి హిట్ కొట్టేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలకు ఆడియన్స్‌ని నుంచి మంచి స్పందల లభించిన చింది. (చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? ) తాజాగా ఈ సంస్థ మరో తెలంగాణ జానపద గీతాన్ని మ్యూజిక్ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. (చదవండి: వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక ) బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్, ఇమేజ్ను దక్కించుకున్న జయతి ఈ సాంగ్‌లో అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సాంగ్ కు సంగీత సారథ్యాన్ని వహించారు. కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రావణ భార్గవి అద్భుతంగా ఆలపించారు. -
‘నువ్వే కావాలి అమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి -
'జయహో ఇండియన్స్' ఆంథమ్ సాంగ్ వచ్చేసింది
మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేది నాయకులా? అమాయకులా? దేశమా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజ్ భీమ్‌రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ‘చిత్రం’ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్ భీమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘జయహో ఇండియన్స్..’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా యాజిన్ నిజార్ పాడారు. ‘‘ఇప్పటికే విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘జయహో ఇండియన్స్..’ ఆంథమ్కి కూడా స్పందన బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వైరల్‌గా మారుతున్న కరోనా పాటలు
సాక్షి, వరంగల్ : ఎక్కడ చూసినా కరోనా వైరస్ కు సంబంధించిన మాటలు.. పాటలే వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్లే ఇది సాధ్యమవుతుందని గ్రహించి.. ముందుకు సాగుతున్నారు. వైరస్ నియంత్రణకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషితో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి బాధ్యతను వివరిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కళాకారులు, రచయితలు పాటలను రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ చైతన్యపరుస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ నియంత్రణకు పాటించాల్సిన సూచనలు, సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటలను రూపొందించారు. గల్లీ కళాకారుడి నుంచి సినిమా రంగంలో రాణిస్తున్న కళాకారుల వరకు స్వయంగా పాటలు రాసి పాడారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) ప్రాణం ఉంటే చాలన్నా.. ప్రాణం ఉంటే చాలు.. బలుసాకు తిని బతుకుందాం.. అనే పాటను వరంగల్‌కు చెందిన ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యాం రచించారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చెప్పినట్లు విందామంటూ పాట ద్వారా వివరించారు. ఈ పాటను గాయని మంగ్లీతో కలిసి పాడారు. వీడియోతో కూడిన ఈ పాటను ఈనెల 18న మంగ్లీ యూ ట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు 42వేల మందికి పైగా విక్షించారు. అలాగే ‘గుండె చెదిరి పోకురా.. గూడు ఒదల మాకురా’ అనే వీడియో సాంగ్‌ను సైతం కాసర్ల శ్యాం రచించారు. ఇందులో మంచు మనోజ్ నటించారు. ఈ పాటను ఇప్పటి వరకు 1.3లక్షల మంది వీక్షించారు. డాక్టరు.. మా డాక్టరు.. ‘డాక్టరు మా డాక్టరు.. దేశ ప్రాణ దాతవే డాక్టరు’.. అనే పాటను మహబూబాబా ద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి చెందిన గిద్దె రాంనర్సయ్య రచించి పాడారు. తెలంగాణ పాటలు అనే యూ ట్యూబ్ చానల్లో ఏప్రిల్ 8న అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు 3వేల మందికిపైగా వీక్షించారు. ‘వినరా భారత వీర కుమారా.. ‘వినరా భారత వీర కుమారా.. కరోనా’ అనే సాంగ్‌ను వరంగల్‌కు చెందిన యువకులు రూపొందించారు. లాక్ డౌన్ ఉండంతో ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లకే పరిమి తమై పాటను రూపొందించారు. మొదట ట్యూన్స్‌ను నగరంలోని పుప్పాలగుట్టకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గందమాల పరకాలకు చెందిన గేయ రచయిత ఈశ్వర్ ప్రసాద్‌కు పంపించగా.. ఆయన పాట రాసి పంపించాడు. అదే పాటను హన్మకొండకు చెందిన గాయకుడు వంశీ క్రిష్ణకు పంపించగా స్టూడియోలో రికారి్డంగ్ చేసి ఫోన్ ద్వారా పవన్‌కు పంపించాడు. దీంతో పాటకు మ్యూజిక్ యాడ్ చేసి రూపొందించారు. ఎడిటింగ్ వర్క్ ఎనోష్ కూలూరి పూర్తి చేశారు. పవన్ గందమాల తన యూట్యూబ్ చానల్ ద్వారా ఈనెల 6న పాటను విడుదల చేశారు. ఇప్పటి వరకు 3వేల మందికి పైగా వీక్షించారు. -
ఆ మాట వినగానే నాన్న షాక్ అయ్యారు
‘‘నచ్చావులే’ సినిమా నుంచి నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘సవారి’ పాటల్ని పెద్ద హిట్ చేశారు. ముఖ్యంగా ‘నీ కన్నులు..’ పాట ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటతో టిక్ టాక్‌లో కొన్ని లక్షల వీడియోలు చేశారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, రాసిన కాసర్ల శ్యామ్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘వలయం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదల చేసిన ‘నిన్ను చూశాకే..’ పాటకి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా శేఖర్ చంద్ర చెప్పిన విశేషాలు. ►మా నాన్నగారు (హరి అనుమోలు) కెమెరామేన్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు ఆయన షాకయ్యారు. సినిమాటోగ్రఫీ అంటే ఫర్వాలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా అంటే చాలా రిస్క్ అన్నారు. కొన్ని సినిమాలు చేశాక వాటికి వచ్చిన స్పందన చూసి ఆయనకి నమ్మకం కుదిరింది. ►నేను సంగీత దర్శకుడు కావడానికి స్ఫూర్తి కీరవాణి, ఏ.ఆర్.రెహమాన్గార్లు. నేను చిత్రపరిశ్రమకి వచ్చి 14 ఏళ్లు అయింది. ఇప్పటి వరకూ దాదాపు 35 సినిమాలు చేశాను. నా కెరీర్ చాలా కూల్‌గా వెళ్తోంది. నా పాటలకు మంచి స్పందన వస్తోంది. వాటిని ఎక్కువగా టిక్ టాక్‌లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగులో సాధించాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత ఇతర భాషల గురించి ఆలోచిస్తా. ►నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా కల్యాణ్ రామ్‌గారి ‘118’ . అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది.. అది పెద్ద చాలెంజ్. ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా? అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్ సినిమా. అయితే ‘చందమామే..’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అని కల్యాణ్ రామ్‌గారు అభినందించడం మరచిపోలేను. ►పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదనే భావన ఉంది. నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. దీంతో ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు కదా? ప్రేమ కథా చిత్రాలు చేయడం వల్ల మంచి మెలోడీస్, థ్రిల్లర్స్ చేయడం వల్ల చక్కని నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం ఉంటుంది. -
రాములో .. రాములా సౌత్ ఇండియా రికార్డ్
సాక్షి, వరంగల్ :‘నాటక రంగం నుంచి రచనా రంగంలోకి వచ్చాను.. మా నాన్న స్టేజీ ఆర్టిస్ట్.. నా చదువు ఎక్కువగా వరంగల్‌లోనే సాగింది.. చిన్నప్పటి నుంచి నాటకాలు, రచనలు అంటే చాలా ఇష్టం.. అదే మక్కువతో రచయితగా మారాను. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నేను రాసిన రాములో... రాముల పాటకు ప్రశంసలు దక్కాయి...’ అంటున్నారు సినీ గేయ రచయిత కాసర్ల శ్యాం! వరంగల్‌కు బుధవారం వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించగా తన సినీ ప్రస్థానాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.... మాది హన్మకొండ నేను పుట్టి పెరిగింది అంతా వరంగల్‌లోనే. హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన మా నాన్న గారు మధుసూదన్‌రావు రంగస్థల నటులు. అప్పట్లో మా నాన్న కూడా పలు చిత్రాల్లో నటించారు. దీంతో ఆయనను హన్మకొండ శోభన్‌బాబు అని పిలిచేవారు. దీంతో చిన్నతనం నుంచే నాకు కూడా సాహిత్యం ఇష్టం ఏర్పడింది. క్షీర సాగరమధురం, నటరాజు నవ్వాలి వంటి నాటకాల్లో చిన్నప్పుడే పాత్రలు పోషించాను. జానపదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వరంగల్ శంకర్, సారంగపాణి తమ బృందాల్లో నాకు అవకాశం ఇచ్చారు. తొలుత నాటకరంగంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం, జానపద గేయ రచయితగా, గాయకుడిగా అనేక మలుపులు తిరిగింది. నేను రాసిన, పాడిన పాటల్లో చాలా వరకు ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి. చదివింది ఇక్కడే.. హన్మకొండలోని మచిలీబజార్‌లోని ప్రగతి స్కూల్లో 10వ తరగతి వరకు, ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్, యూనివర్సిటీలో చదువుకున్నాను. చదువుకునే రోజుల్లో జ్యోతి కల్చరల్ ఆర్ట్స్‌ను ప్రారంభించి 13 నృత్య నాటికలు రాయడంతో పాటు సమాచార శాఖ ఆధ్వర్యాన ప్రదర్శనలు ఇచ్చాను. వరంగల్ శంకరన్న, సారంగపాణి, మా ఇంట్లో వారి ప్రోత్సాహంతో హైదారాబాద్ వెళ్లాను. అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్ ఆర్ట్స్‌లో చేరాక ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించా. రాములో .. రాములా సౌత్ ఇండియా రికార్డ్ త్రివిక్రమ్ దర్శకత్వంతో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో రాములో... రాములా పాట రాశాను. సౌత్ ఇండియాలోనే 24గంటల్లో 8.3 మిలియన్ మంది వీక్షకులు ఈ పాటను యూ ట్యూబ్‌లో వీక్షించారు. 20 రోజుల్లో 50 మిలియన్ మంది వీక్షించారు. ప్రముఖ హీరో వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న వెంకీ మామ, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే, నితిన్ నటిస్తున్న భీష్మ ఇలా పలు సినిమాల్లోనూ పాటలు రాశాను. ఇక బస్ స్టాప్ సినిమాలోని కలలు.. పాటకు 2012లో సంతోషం అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ వారు సినారే అవార్డు, తెలుగు రచయితల అసోసియేషన్ నుంచి విశిష్ట రచన పురస్కారం, సింగిడి అవార్డులు దక్కాయి. ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా 2003 సంవత్సరంలో దర్శకురాలు బి.జయ తన చంటిగాడు సినిమాలో అవకాశవిుచ్చారు. ఆ సినిమాలో ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా. ఆ తర్వాత ఏడేళ్లలో ఏడు చిత్రాలకు మాత్రమే పని చేశా. ఓ పక్క ఎంఫిల్... మరోపక్క పాటలు... కష్టమైంది. కృష్ణవంశీ మహాత్మాలో నీలపురి గాజులు... పాటతో బ్రేక్ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలోని రింగ్ ట్రింగ్ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేవిశ్రీప్రసాద్‌తో వర్క్ చేయాలనుకున్న కోరిక ఎఫ్2 సినిమాలోని రెచ్చిపోదాం బ్రదర్ పాట ద్వారా తీరింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో దిమాక్ కరాబ్ నే పాట కూడా మంచి పేరు తీసుకొచి్చంది. ఇప్పటికి 150కు పైగా చిత్రాల్లో 350కు పైగా పాటలు రాశాను. వరంగల్‌కు మంచి గుర్తింపు వరంగల్‌కు చెందిన వారే ప్రస్తుతం ఎక్కువగా సినిమా రంగంలో రాణిస్తున్నారు. పెద్ద డైరెక్టర్లు, మంచి టెక్నీషియన్లు, సంగీత దర్శకులు, గేయ రచయితలు ఎందరో వరంగల్ వారే ఉన్నారు. ఇక్కడ రామప్ప, ఖిలా వరంగల్, లక్నవరం, భద్రకాళి దేవాలయం ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కాగా, సినిమా రంగంలో కొత్తగా వచ్చే వారికి అతి విశ్వాసం ఉండొద్దు. కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుంది. అవకాశాలు రావడం లేదు కదా అని నిరాశకు లోనైతే ఇబ్బందులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం వరిస్తుంది. -
సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్
పాటతత్వం ‘‘కాఫీడేలు, కాఫీబారుల రాకతో హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఇరాని హోటళ్ల వైభవం తగ్గుతోందిప్పుడు. ఆ హోటళ్లలో మత సామరస్యం, మంచి చెడు, సరదా సంగతుల గురించి వివరించే పాట ఇది’’ అన్నారు పాటల రచయిత కాసర్ల శ్యామ్. శ్రీహరి హీరోగా నటించిన ‘రియల్‌స్టార్’ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో శ్యామ్ రాసిన ‘సలాం నమస్తే హైదరబాద్.. ఇరాని హోటల్ జిందాబాద్’ పాటతత్వం గురించి రచయిత మాటల్లో... చనుబాలు లేక చంటి పోరడు చప్పరించేది చాయ్ బొట్టు బ్రెడ్డు జాము లేని పేద ఇంట డబల్ రొట్టెనే బ్రేక్ ఫాస్ట్... హోటల్ మెట్ల మీద ఓ బిచ్చగత్తె కూర్చుంటుంది. ఏడుస్తున్న పిల్లాడికి పాలు ఇద్దామంటే రావు. అప్పుడు ఓ గ్లాస్లో చాయ్ తెప్పించి పిల్లాడికి పడుతుంది. సినిమాలో పాట అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది. పాలుకు డబ్బులు లేక చాయ్, బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు ఆ చాయ్‌లో బ్రెడ్ ముంచుకుని తినడం అలవాటు చేసిన పేద కుటుంబాలు మనకు చాలా తారసపడతాయి. ఆదాబ్ అంటడు ఆచారి/ నమస్తే అంటడు నజీరు భాయ్/తీసుకుంటారు అలాయ్ భళాయ్/ ఆర్డరిచ్చి వన్ బై టూ చాయ్ / అందరు ఇక్కడ ఒకటేనయ్యా.. అందరి అడ్డా ఇదేర భయ్యా వన్ బై టూ చాయ్ చెప్పి.. ఓ ముస్లిమ్, ఓ హిందూ కలసి తాగుతారు. సర్వమత జనులు ఇక్కడ స్నేహితులవుతారు. అందరూ ఒక్కటే అని చెప్పడమే ఈ పల్లవి ఉద్దేశం. రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవులకు ఇది మజిలీ చెమట చుక్కలను సేదదీర్చుటకె ఇక్కడి పంఖా గాలి నిమిషమైన తన కష్టం మరిచి కూర్చోవాలనే కూలీ ఒడిని పంచుటకె వేచి ఉన్నది అబ్ తక్ కుర్సీ ఖాళీ గుప్పు గుప్పుమని పొగలు గక్కె టీ కప్పు తనను చూడాలని ఎప్పుడేప్పుడని ఎదురుచూసే పేదోడి పెదవి తాకాలని రిక్షావాడి మాడిన పేగుని వేడితో చల్లార్చాలని శ్రీహరిగారు చెప్పి మరీ రాయించుకున్న చరణమిది. రిక్షావాడి కడుపులో పేగులు మాడుతుంటే.. ఆ ఆకలిని తీర్చి వేడి వేడి టీ చల్లారుస్తుందని చెప్పాను. ఆ చాయ్ పేదోడికి పరమాణ్ణం. గల్లీ గ్యాంగ్‌కు టైంపాసు ఇది నిరుద్యోగులకు ఆఫీసు చుట్టుపక్కల బస్తీలకు ఈ కేఫె కేరాఫ్ అడ్రస్సు కలిసే దోస్తులు దొర్లే నవ్వులు బిల్లు కొరకు కొట్లాటలు సిగరెట్ పొగలు భగ్న ప్రేమికులు దొరుకు అప్పు ఓదార్పులు గంటల తరబడి కూర్చున్నా నిను ఆదరించేటి హోటళ్ళు బిడ్డల ఆకలి అడిగిన వెంటనే తీర్చే అమ్మల లోగిళ్ళు ప్రపంచమంతా పరిచయమయ్యే గ్రంథాలయమే ఈ హోటల్ బిల్ నేను కడతానంటే, నేనంటూ స్నేహితులు సరదాగా కొట్టుకుంటారు. అక్కడే అప్పు అడుగుతారు, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఓదారుస్తారు. ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల గురించి చర్చిస్తారు. పక్కన చాయ్ తాగుతుంటే వినపడిన ఆ మాటలు మనకు గుర్తుండిపోతాయి. అందుకే గ్రంథాలయంతో పోల్చాను. కాఫీబారు కలలో రాని కష్టజీవికిది తాజ్ మహల్ అధికారం దరిదాపులో లేని సామాన్యునికిది అసెంబ్లి హాల్ రాజు పేద ఉందా లేదా అడగదు మనను జాతి మతాల్ వచ్చే పోయే పాత్రలు ఎన్నో రంగస్థలమే ఈ హోటల్ పొట్టకూటికై పొద్దుమాపు గిర గిర గిర గిర తిరిగే ఈ నగరం గూటికి చేరిన పక్షిలాగ గుమిగూడుతదిక్కడ సాయంత్రం హోటల్ కాదిది ఒకటిగ వెలిసిన చర్చి మసీదు మందిరం కాఫీ డేలు, చాక్లెట్ రూమ్‌లు అవన్నీ సగటుజీవి తాహతుకు సంబంధించినవి కాదు. అదంతా పేజ్ 3 కల్చర్. అలాంటివాడికి ఈ హోటల్ అపురూపమైన తాజ్ మహల్. ఇరాని హోటళ్లల్లో మన కులమతాలు అడగరు. కాలినడకన, బైక్ మీద, కారులో.. హోటల్‌కి వచ్చే అందర్నీ ఆహ్వానిస్తారు. హోటల్ ఓ స్టేజి, ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కస్టమర్లు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్లందరూ ఆ స్టేజి మీద నాటకం వేసే పాత్రధారులే. ఓ రోజంతా హోటల్లో కూర్చుని గమనిస్తే, ప్రపంచమనే నాటకం మన కళ్ల ముందు కదలాడుతుంది. మార్నింగ్ ఓ టీ తాగి ఉద్యోగానికి వెళ్లిన వారు, గూటికి చేరిన పక్షుల్లాగా సాయంత్రం మళ్లీ వాలతారు. పల్లవిలో చెప్పిన విషయాన్ని చివర్లో ‘హోటల్ కాదిది చర్చి మసీదు మందిరం’ అని చివర్లో మళ్లీ చెప్పాను. జాబ్ శాటిస్ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని, జేబు శాటిస్ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని ఉంటాయి. నాకు జాబ్ శాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చిన పాటల్లో ‘సలాం నమస్తే..’ పాట అగ్రస్థానంలో ఉంటుంది. శ్రీహరి గారు తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ పాట వినిపించేవారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నగారు పాట విన్న తర్వాత.. ‘‘పల్లే పాట రాయడానికి నా పాటలను ఎలా రిఫరెన్స్‌గా తీసుకుంటారో ఇరాని హోటల్, చాయ్ గురించి రాయడానికి ఈ పాట రిఫరెన్స్‌గా తీసుకుంటారు’’ అని చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంటాయి. బతకడానికి రాసిన పాటలు చాలా ఉన్నాయి. రచయితగా నన్ను బతికించిన పాట ఇది. ఇంటర్వ్యూ: సత్య పులగం - కాసర్ల శ్యామ్, గీత రచయిత