anthem
-
రాష్ట్ర గీతంగా "జయ జయహేతెలంగాణ" ఆమోదం
-
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
పతకానికి విజయం దూరంలో...
బెల్గ్రేడ్ (సెర్బియా): భారత రెజ్లింగ్ రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన అంతిమ్... ప్రస్తుతం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక రేసులో నిలిచింది. సెమీఫైనల్లో అంతిమ్ 4–5 పాయింట్ల తేడాతో వనెసా కలాద్జిన్స్కాయా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో అంతిమ్ గెలిస్తే పతకంతోపాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా ఖరారవుతుంది. సాట్ల్విరా ఒర్షుష్ (హంగేరి), ఎమ్మా జోనా డెనిస్ మాల్‌్మగ్రెన్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో కాంస్య పతకం పోరులో అంతిమ్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో అంతిమ్ 3–2తో డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ ఒలివియా పారిష్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అంతిమ్ 10–0తో రొక్సానా మార్టా జసినా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–6తో నటాలియా మలిషెవా (రష్యా)పై గెలుపొందింది. భారత్‌కే చెందిన మనీషా (62 కేజీలు), ప్రియాంక (68 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో, జ్యోతి బెర్వాల్ (72 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) పతాకంపై, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్ రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. -
'జయహో ఇండియన్స్' ఆంథమ్ సాంగ్ వచ్చేసింది
మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేది నాయకులా? అమాయకులా? దేశమా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజ్ భీమ్‌రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ‘చిత్రం’ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్ భీమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘జయహో ఇండియన్స్..’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా యాజిన్ నిజార్ పాడారు. ‘‘ఇప్పటికే విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘జయహో ఇండియన్స్..’ ఆంథమ్కి కూడా స్పందన బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హైదరాబాద్‌కు ‘యాంథెమ్’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ రెండో అతిపెద్ద హెల్త్ కేర్ సేవల సంస్థ యాంథెమ్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. యాంథెమ్ ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల జారీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి రంగాల్లో అనుసరిస్తున్న వినూత్నమైన పాలసీలు, ఐటీ సేవల రంగాల్లో నగరం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని తమ కార్యాలయ ఏర్పాటుకు నగరాన్ని ఎంపిక చేశామని యాంథెమ్ పేర్కొంది. హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు శిక్షణ ఇవ్వండి: అత్తాపూర్ ఘటన నేపథ్యంలో పోలీసు సిబ్బందికి అప్రమత్తత, తక్షణ స్పందన అంశాల్లో తగిన శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. -
జాతీయ గీతానికి గౌరవమివ్వని టీచర్‌కు జరిమానా!
టోక్యో: జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చున్న ఉపాధ్యాయురాలి జీతంలో కోత విధించింది జపాన్ కోర్టు. 2013 జపాన్‌లో ఒక స్నాతకోత్సవంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చున్నందుకుగాను హిరాకో షింజూ అనే ఉపాధ్యాయురాలికి విద్యాధికారులు ఈ శిక్ష విధించారు. అధికారుల చర్యను సవాలు చేస్తూ షింజూ కోర్టుకెళ్లగా... జీతంలో కోత విధించడం సమర్థనీయమేనని ఒసాకా జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో నిలబడాలంటూ రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదని, అయితే ఇటువంటి చర్య పాఠశాల క్రమశిక్షణను ఉల్లఘించినట్లే అవుతుందని న్యాయమూర్తి హిరోయోకి నైటో అన్నారు. ఇదిలాఉండగా... జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో నిలబడాలంటూ ఎలాంటి నిబంధనలు లేవని జపాన్ సుప్రీంకోర్టు 2012లో తీర్పునిచ్చింది. అయినా టోక్యో జిల్లా కోర్టు గత సంవత్సరం దీనిపై టీచర్లకు జరిమానాలు విధించింది. దీనిపై జపాన్‌లో పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు, యాజమాన్యం మధ్య గొడవలు కూడా తలెత్తాయి. దీంతో జపాన్‌లో ప్రత్యేకంగా ఇందుకోసం ఓ చట్టం తీసుకొచ్చారు. జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ప్రైమరీ టీచర్లతోపాటు, యూనివర్సిటీ సిబ్బంది కూడా నిలబడాలని జపాన్ ప్రధాని షింజో అబే పార్లమెంటులో చట్టం తీసుకొచ్చారు. -
గుండె విజయగర్వంతో నిండిపోయే సమయం