
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ రెండో అతిపెద్ద హెల్త్ కేర్ సేవల సంస్థ యాంథెమ్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. యాంథెమ్ ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల జారీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి రంగాల్లో అనుసరిస్తున్న వినూత్నమైన పాలసీలు, ఐటీ సేవల రంగాల్లో నగరం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని తమ కార్యాలయ ఏర్పాటుకు నగరాన్ని ఎంపిక చేశామని యాంథెమ్ పేర్కొంది. హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
పోలీసులకు శిక్షణ ఇవ్వండి: అత్తాపూర్ ఘటన నేపథ్యంలో పోలీసు సిబ్బందికి అప్రమత్తత, తక్షణ స్పందన అంశాల్లో తగిన శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.