
‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘విశ్వదాభిరామ’. ఈ చిత్రానికి సురేష్ కాశీ, సురేంద్ర కమల్, అశోక్ చక్రం దర్శకత్వం వహించడం విశేషం. సోలో స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్(సురేంద్ర వంటి పులి) నిర్మించారు. దర్శకులు మాట్లాడుతూ –‘‘కొండవీటి కోట నేపథ్యంలో జరిగే డెత్ గేమ్ థ్రిల్లర్ ‘విశ్వదాభిరామ’.
ఇప్పటి వరకూ కామెడీ పాత్రల్లో అలరించిన ‘చిత్రం’ శీను ఈ చిత్రంలో తొలిసారి విలన్‌గా నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఇదొక సరికొత్త థ్రిల్ కలిగిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. భువన్ తేజ్, అనిల్, ఆనంద్, సహస్ర, రాజారెడ్డి, మానస నటించిన ఈ చిత్రానికి కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ.
Comments
Please login to add a commentAdd a comment