
సాక్షి, నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించి చంద్రబాబు నాయుడు కుంటిసాకుగా ఢిల్లీకి పారిపోయి ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి తప్పదని ఈవీఎంలపై చంద్రబాబు దమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. ఐటీ టెక్నాలజీకి కేరాష్ అడ్రస్ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక శక్తిగా మారబోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment