సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్ | sai kumar turns as a producer for his sons movie garam | Sakshi
Sakshi News home page

సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్

Published Sun, Nov 15 2015 10:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్

సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్

నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా అలరించిన సాయి కుమార్, ఇప్పుడు తన కుమారుడి కోసం కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న తనయుడు ఆదిని ప్రమోట్ చేయటం కోసం నిర్మాతగా మారాడు ఈ సీనియర్ నటుడు.

ప్రస్తుతం ఆది హీరోగా 'గరం' సినిమాను నిర్మిస్తున్నాడు సాయికుమార్. ఈ సినిమాకు నిర్మాతగా సాయికుమార్ భార్య సురేఖ వ్యవహరిస్తున్నారు. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆది కెరీర్కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయికుమార్.

రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా బడా డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నటుడిగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్, నిర్మాతగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement