చుట్టాలబ్బాయి రిస్క్ చేస్తున్నాడా..? | Aadi Risking With Chuttalabbai | Sakshi
Sakshi News home page

చుట్టాలబ్బాయి రిస్క్ చేస్తున్నాడా..?

Published Thu, Jul 21 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

చుట్టాలబ్బాయి రిస్క్ చేస్తున్నాడా..?

చుట్టాలబ్బాయి రిస్క్ చేస్తున్నాడా..?

డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది. ప్రేమకావాలి, లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆది, తరువాత వరుస ఫెయిల్యూర్స్తో వెనకపడ్డాడు. గత రెండేళ్లలో చేసిన ప్యార్ మే పడిపోయానే, రఫ్, గరం లాంటి సినిమాలు ఆది కెరీర్కు ఏమాత్రం కిక్ ఇవ్వలేదు. దీంతో తన ఆశలన్ని రాబోయే చుట్టాలబ్బాయి మీదే పెట్టుకున్నాడు.

భాయ్ లాంటి డిజాస్టర్ తరువాత వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఆది కెరీర్కు చుట్టాలబ్బాయి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్ డేట్ విషయంలో కూడా రిస్క్ చేస్తున్నాడీ యంగ్ హీరో. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న చుట్టాలబ్బాయిని ఆగస్టు 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

అయితే అదే రోజున మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్లో తెరకెక్కిన మనమంతాతో పాటు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ ఉండటంతో పాటు బిజినెస్ పరంగా కూడా చుట్టాలబ్బాయి కన్నా ఒకడుగు ముందే ఉన్నాయి. మరి ఈ కాంపిటీషన్లో చుట్టాలబ్బాయి పోటి పడి గెలుస్తాడా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement