టాలీవుడ్ దర్శకుడు వీరభద్రం చౌదరి, ఆహనా పెళ్ళంట, పూలరంగడు సినిమాలతో పరిచయం అయ్యాడు. అవి రెండూ ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని అందుకున్నాయి. అలా సక్సస్‌ఫుల్‌గా వీరభద్రం జర్నీ కొనసాగుతున్న సమయంలో అక్కినేని నాగార్జున 'భాయ్' సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వయంగా నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పైనే నిర్మించాడు. తర్వాత హీరో ఆదితో 'చుట్టాలబ్బాయి' సినిమాకు ప్లాన్ చేసినా.. అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
(ఇదీ చదవండి: ప్రియుడితో నిర్మాత కూతురి పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరభద్రం తన కెరియర్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. 'నాగార్జునతో తీసిన 'భాయ్' సినిమా మొదట కామెడీ నేపథ్యంలో తీయాలని కథ రాసుకున్నాను. కానీ పెద్ద హీరో అనేసరికి స్క్రిప్ట్‌లో మార్పులు చెయాల్సి వచ్చింది. దీంతో ఎక్కడో మిస్ ఫైర్ అయింది. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో నాకు కోలుకోలేని దెబ్బ పడింది. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని ఒక్కసారిగా కిందకు తోసేస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఒక రకంగా నేను ఇలాంటి స్థితికి వచ్చానంటే నాగార్జున సినిమానే కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను' అని వీరభద్రం చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో నిర్మాతగా ఉన్న నాగార్జునకు భారీగానే నష్టాలు వచ్చాయి. ఒక సినిమా ప్లాప్ అయినా.. హిట్ అయినా పూర్తి బాధ్యత దర్శకుడిదే అని వీరభద్రం తెలిపాడు.
(ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!)
Comments
Please login to add a commentAdd a comment