
సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఎప్పటికపుడు వైరల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్‌లో ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఇక్కడ తను అనుకున్నంతగా సక్సస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చేసి తక్కువ సమయంలోనే క్లిక్ అయింది. అయితే తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో అవి తెగ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌పై పలు ఆరోపణలు చేసింది. అవి నిజమే అంటూ తాప్సీ కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
(ఇదీ చదవండి; Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది)
బాలీవుడ్‌లో ఒక సినిమా కోసం ఎవరిని తీసుకోవాలనేది కొంతమంది ప్రముఖ నటీనటులు డిసైడ్ చేస్తారని తాప్సీ చెప్పుకొచ్చింది. వారికి నచ్చకపోతే టాలెంట్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. ఒక్కోసారి క్యారెక్టర్‌కు సూట్ అయ్యేవాళ్లను కూడా తీసుకోరు. కానీ వారికి కావాల్సిన వ్యక్తులను మాత్రం తీసుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీ వాళ్లను కూడా రిఫర్ చేస్తారు. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అవకాశాల కోసం తిరగడం అనవసరం అని తాప్సీ తెలిపింది.
(ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు)
Comments
Please login to add a commentAdd a comment