దక్షిణాది చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ గ్లోబల్ నటిగా ప్రియాంక చోప్రా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కావడంతో పాటు పలు విమర్శలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..)
అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రియాంక హాజరయింది. అక్కడ ఒక అంతర్జాతీయ మీడియాకు చెందిన యాంకర్ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలంటూ కోరింది. దీంతో తముడుకోకుండా వెంటనే భారతీయ సినిమాలన్ని ‘హిప్స్ అండ్ బి**బిస్’ గురించే ఉంటాయి. ఒక రకంగా వాటిని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తే చాలు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అయితే, అది పాత వీడియో అయినప్పటికీ ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్' విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్ అయింది.
ప్రియాంక తీరుపై సోషల్ మీడియాలో ఒకరు ఇలా రియాక్ట్ అయ్యారు 'భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం చాలా బాధించిందని తెలుపుతూ అమెను ఇండియన్ సినిమాల్లో బ్యాన్ చేయాలి.' అని కోరాడు. మరోక వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను అమెరికన్‌ని.. ఆమెకు అమెరికన్‌ల నుంచి ప్రజాదరణ లేదు.. నిక్ జోనస్ భార్య అని చెప్పడం తప్ప ప్రియాంక గురించి ఎవరూ ఇక్కడ మాట్లాడటం నేను వినలేదు.' అని తెలిపాడు.
(ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..)
Comments
Please login to add a commentAdd a comment