
రామాయణం ఆధారంగా ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' లో ప్రభాస్ , కృతి సనన్ జంటగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల ముందు ఎంత క్రేజ్ వచ్చిందో, ఉదయం ఆట ముగియగానే ఆ క్రేజ్ పోయే విధంగా.. సినిమా బాగోలేదని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో నెటిజన్స్ దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. అతను రావణాసురిడి పాత్ర మలచిన తీరుతో పాటు రామాయణం చూపెట్టే విధానం ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
(ఇదీ చదవండి: ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?)
ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. కొందరు అయితే 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది.
'అయోధ్య'లో సినిమా ప్రమోషన్ చేస్తున్న సమయంలో 'ఆదిపురుష్' వీడియో చూసి నెటిజన్స్ విమర్శించారు. విఎఫ్ఎక్స్‌తో పాటు రావణుడి పాత్ర కూడా బాగోలేదని కామెంట్ చేశారు. దీంతో ఈవెంట్ అయ్యాక ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్‌తో.. 'ఓం! కమ్ టు మై రూమ్' అన్నాడు. తాజాగా నెటిజన్లు అదే మాటను వైరల్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకి వచ్చిన వారు తాజాగా దర్శకుడుని తప్పుబడుతూ..'ఓం! కమ్ టు మై రూమ్' అని అంటున్నారు.
(ఇదీ చదవండి: ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు)
Comments
Please login to add a commentAdd a comment