negative
-
వృద్ధికి సానుకూలతలే ఎక్కువ
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు. 2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బలంగా ఆటో అమ్మకాలు డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్‌లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. దిద్దుబాటు కోసమే చర్యలు.. నాలుగు ఎన్బీఎఫ్సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్బీఎఫ్సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు. -
సోషల్ మీడియా అసాంఘిక శక్తులు బలి తీసుకున్న జీవితాలు
-
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీ! ధైర్యంగా ఫేస్ చేయకపోతే..!
సత్య తెలివైన విద్యార్థి. కానీ ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఐఐటీ సీట్ రాలేదు. ప్రస్తుతం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ మూడు నెలలుగా అతన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఎగ్జామ్ పేపర్ చేతిలోకి తీసుకోగానే ‘‘బాగా రాయలేనేమో’’ అనే ఆలోచన మనసులోకి దూరుతోంది. అంతే.. అప్పటివరకూ గుర్తున్నది కూడా మర్చిపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నాన్నకు చెప్పుకుని ఏడ్చాడు. వాణి ఒక అథ్లెట్. స్టేట్ లెవెల్లో బెస్ట్ రన్నర్‌గా నిలిచి, నేషనల్ మీట్‌కు ప్రిపేర్ అవుతోంది. కానీ రన్నింగ్ ట్రాక్ మీదకు వెళ్లగానే ‘‘నేను గెలవలేనేమో’’ అనే ఆలోచన మనసును హిట్ చేస్తోంది. అంతే.. వేగం తగ్గుతోంది. సెకన్ల వ్యవధిలో ఓడిపోతోంది. ట్రాక్ ఎక్కినప్పుడు ఆ ఆలోచన రాకుండా ఎంతో ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. నేషనల్ విన్నర్ కావాలన్న తన ఆశ నెరవేరుతుందో లేదోనని తీవ్రంగా బాధపడుతోంది. సత్య, వాణిల్లానే చాలామంది విద్యార్థులు, యువతులు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. అది ఐఐటీ, నీట్, ఎంసెట్, స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఏవైనా..! ఒక్క నెగటివ్ ఆలోచన వారిని.. గమ్యం నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు తీసుకువెళ్తుంది. ఆ ఒక్క నెగటివ్ ఆలోచన మూలాల్ని అర్థం చేసుకుని పరిష్కరించుకోగలిగితే.. గమ్యాన్ని చేరుకోగలరు, అనుకున్నది సాధించగలరు. లొంగకపోతే సాయం అవసరం... నెగటివ్ కామెంట్స్‌తో వేధించే రౌడీని, దాని గొంతును సరిచేయడం అందరికీ అంత సులువు కాదు. అలాంటప్పుడు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. వారు రకరకాల పద్ధతుల ద్వారా నెగటివ్ సెల్ఫ్ టాక్‌ను తగ్గించుకునేందుకు సహాయపడతారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అనేది వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించడంలో, సవాలు చేయడంలో సహాయపడుతుంది. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, మైండ్‌ఫుల్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ద్వారా ఆందోళన వల్ల శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆందోళనను రేకెత్తించే పరిస్థితులను క్రమక్రమంగా పరిచయం చేసే ఎక్స్పోజర్ థెరపీ భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సత్య విషయంలో మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్, వాణి విషయంలో తక్కువ దూరం పరుగెత్తడం వంటివి ప్రాక్టీస్ చేయాలి. వారు సాధించిన విజయాలను హైలైట్ చేయడం, పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టడం వారి విశ్వాసాన్ని పెంచుతుంది, వారి కృషిని కొనసాగించడానికి వారిని ప్రేరేపిస్తుంది. వారి ఆందోళన గురించి కుటుంబం, స్నేహితులు లేదా కోచెస్తో మాట్లాడమని ప్రోత్సహించడం అవసరమైన అవగాహనను, మానసిక మద్దతును అందిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. మనసులో అల్లరి చేస్తుంటుంది.. సత్య, వాణిల్లానే చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి అయినప్పుడు ఎక్కడ ఫెయిలవుతామోనని భయపడుతుంటారు. అది వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. దీనికి కారణం వారి మనసులోని రౌడీబేబీ (బులీ). చిన్నప్పుడు స్కూల్లో ఎలాగైతే ఎగతాళి చేస్తారో, ఏడిపిస్తారో (బులీయింగ్) అలాగే మనసులోని రౌడీ అల్లరి చేస్తుంటుంది. నువ్వు చేయలేవు, నువ్వు ఫెయిలవుతావు అంటూ అబద్ధాలు చెప్తుంటుంది. వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. దాంతో ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగెత్తుతాయి. చేతులకు చెమటలు పడతాయి. కొందరికి చేతులు వణుకుతాయి కూడా. ఆ భయాందోళనల్లో తమకు తెలిసినదాన్ని కూడా మర్చిపోతారు. తమ పర్ఫార్మెన్స్ను కాస్తంత మందగిస్తుంది. అది చాలు కదా లక్ష్యం చేజారడానికి. లోగొంతును సవరించుకోవాలి.. మనసులోని రౌడీ బేబీని అలా వదిలేయాల్సిన అవసరంలేదు. దానిపై పోరాటం చేయవచ్చు. అందుకు మొదట చేయాల్సింది బులీకి అసలు కారణాన్ని కనుక్కోవడం. దానికి బహూశా గత వైఫల్యాలు, పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి, జడ్జ్ చేస్తారనే భయం వంటివి కారణాలు కావచ్చు. ఆ తర్వాత రౌడీ బేబీతో మాట్లాడి మచ్చిక చేసుకోవాలి. కరకుగా ఉండే రౌడీ బేబీ గొంతును కాస్తంత సరళంగా లేదా సరదాగా మార్చేయండి. నా వంతు కృషి చేయగలను, నా తప్పుల నుంచి నేర్చుకుంటాను.. అని మనసులోని మాటలను మార్చండి. నిశ్శబ్దంగా ఉండటం, నిదానంగా శ్వాస తీసుకోవడం ద్వారా రౌడీని శాంతింపచేయండి. చిన్న చిన్న పరీక్షల్లో మనసులోని రౌడీని ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
2024 గ్లోబల్ బ్యాంకింగ్‌పై నెగటివ్ అవుట్‌లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు
రామాయణం ఆధారంగా ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' లో ప్రభాస్ , కృతి సనన్ జంటగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల ముందు ఎంత క్రేజ్ వచ్చిందో, ఉదయం ఆట ముగియగానే ఆ క్రేజ్ పోయే విధంగా.. సినిమా బాగోలేదని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో నెటిజన్స్ దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. అతను రావణాసురిడి పాత్ర మలచిన తీరుతో పాటు రామాయణం చూపెట్టే విధానం ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. (ఇదీ చదవండి: ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?) ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. కొందరు అయితే 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. 'అయోధ్య'లో సినిమా ప్రమోషన్ చేస్తున్న సమయంలో 'ఆదిపురుష్' వీడియో చూసి నెటిజన్స్ విమర్శించారు. విఎఫ్ఎక్స్తో పాటు రావణుడి పాత్ర కూడా బాగోలేదని కామెంట్ చేశారు. దీంతో ఈవెంట్ అయ్యాక ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్‌తో.. 'ఓం! కమ్ టు మై రూమ్' అన్నాడు. తాజాగా నెటిజన్లు అదే మాటను వైరల్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకి వచ్చిన వారు తాజాగా దర్శకుడుని తప్పుబడుతూ..'ఓం! కమ్ టు మై రూమ్' అని అంటున్నారు. (ఇదీ చదవండి: ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు) -
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
తమన్ మ్యూజిక్ బాగాలేదు.. వారికి స్ట్రాంగ్ కౌంటర్
బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగానే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టెల్లో సమాధానమిచ్చారు. తనను కామెంట్ చేసే వాళ్లందరూ చిన్నపిల్లలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఎప్పుడు సరదాగా, కూల్‌గా ఉండే తమన్ ఆగ్రహానికి కారణం ఏంటా అని పలువురు ఆరా తీస్తున్నారు. గిటారు వాయిస్తున్న ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ప్రియమైన నెగెటివిటీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీలాంటి చిన్నపిల్లలందరి కోసం ఈ వీడియో అంకితం' అంటూ పోస్ట్ చేశారు తమన్. కారణం అదేనా? సంగీత దర్శకుడు తమని ఇటీవలే ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, బాలకృష్ణ అఖండ చిత్రాలు సూపర్‌హిట్ కావడంలో తమన్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఫేమస్ అయింది. తమన్ ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తమన్ మ్యూజిక్ బాగలేదని.. ఏమాత్రం వినాలనిపించలేదని పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదే తమన్ ఆగ్రహానికి కారణమైంది. Rest In Peace Dear #Negativity !! To all the kids out there 🤣 pic.twitter.com/pjt7ThMCkn — thaman S (@MusicThaman) February 4, 2023 -
చైనా నుంచి వస్తే నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది. జనవరి ఒకటో తేదీ నుంచి దీనిని అమలుచేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. అక్కడి నుంచి బయల్దేరడానికి ముందే ఎయిర్‌సువిధ పోర్టల్‌లో సంబంధిత రిపోర్ట్‌ను అప్లోడ్ చేయాలి. ఆ ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్ బయల్దేరడానికి 72 గంటలముందు చేసినదై ఉండాలి. ఒక్కో అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడికొచ్చాక టెస్ట్చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో 268 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11 శాతంగా ఉంది. చైనా ప్రయాణికులపై అమెరికా సైతం.. 72 గంటల్లోపు సిద్ధమైన కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా సూచించింది. ఏ దేశ పౌరుడు, వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధంలేకుండా ప్రతిఒక్కరికీ జనవరి ఐదు నుంచి ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. ‘ ఆంక్షలు పెట్టినంతమాత్రాన చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలోకి ఆగదు. అయితే, చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు, చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తోంది’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డౌడీ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి సమాచారం సంగతి పక్కనబెట్టి సొంతంగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాట్ క్యాంపబెల్ హితవుపలికారు. -
కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్‌లో కొత్త వేవ్ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే.. -
నెగిటివ్ రోల్స్ కి సై అంటున్న స్టార్ హీరోస్
-
డ్రగ్స్ టెస్ట్.. ఫిన్లాండ్ ప్రధానికి భారీ ఊరట
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)కు భారీ ఊరట కలిగింది. స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆమె.. డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె డ్రగ్స్ టెస్ట్‌లకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19న ఆమె నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు అధికారులు. అయితే డ్రగ్స్ టెస్టుల్లో ఆమె ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని తేలిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మద్యం మాత్రం సేవించినట్లు స్వయంగా మారిన్ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 ఇదిలా ఉంటే.. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్న ఆమె వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులకు ముందుకు రావాలని ఆమెను డిమాండ్ చేశాయి. 2019లో 34 ఏళ్ల వయసులో సన్నా మారిన్ ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలోనూ అధికారిక భవనంలో పార్టీలు చేసుకుని ఆమె విమర్శలపాలయ్యారు కూడా. ఇదీ చదవండి: ఎట్టకేలకు.. శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
కమలతో కలిసే 2024లో పోటీ!
వాషింగ్టన్: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌తో కలిసే పోటీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. కమల పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. 2024లో తాను అధ్యక్ష పదవికి, కమల ఉపాధ్యక్ష పదవికి కలిసే పోటీ చేస్తామన్నారు. కమల పనితీరుపై ఇటీవల కాలంలో మీడియాలో నెగెటివ్ కథనాలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో డెమొక్రాట్ టికెట్‌పై పోటీచేస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పుడే ఏమీ చెప్పలేనని బుధవారం కమలా హారిస్ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో ఆమె మరోమారు బరిలోకి దిగకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బైడెన్ తాజా ధ్రువీకరణతో కమల బరిలో ఉంటుందని స్పష్టమైంది. 2024కు బైడెన్‌కు 81 సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులో ఆయన మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే బైడెన్, కమల మధ్య సంబంధాలు కూడా ఇటీవల కాలంలో కొంత మసకబారినట్లు వార్తలున్నాయి. తన సామర్ధ్యాన్ని పార్టీ పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని, క్లిష్ట విషయాల్లో తనను బలిపశువును చేస్తున్నారని కమల భావిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. కానీ బహిరంగంగా మాత్రం వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్‌తో పూర్తి స్ధాయి యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సాహసించకపోవచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే పుతిన్ తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించారు. అయితే ఏదో రూపంలో రష్యా ఉక్రయిన్పై చర్యలకు ఉపక్రమించవచ్చని ఆయన అంచనా వేశారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్..
ప్రముఖ హీరోయిన్ త్రిష ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో ‘ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022’ అంటూ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసింది. అయితే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష.. తాను మాత్రం సంతోషంగా లేనంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. అయితే ఇటీవల తనకు కరోనా వచ్చిన విషయాన్ని చెబుతూ పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తున్నానంటూ ట్వీట్.. ‘అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే కొన్ని క్షణాల ముందు ఈ మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకున్నాయి. నాకు ఆ వారం చాలా బాధ కలిగించింది. ప్రస్తుతానికి నేను కోలుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్తా ఆందోళనలో ఉన్నారు. వారందరికి తిపి కబురు చెప్పేందుకు సోషల్ మీడియాకు వచ్చిన త్రిష ‘నెగిటివ్’ అనే పదం చదివినప్పటికీ సంతోషంగా లేనంటూ.. కరోనానను జయించినట్లు చెప్పింది. తాజా టెస్ట్‌లో తనకు నెగిటివ్ వచ్చినట్లు త్రిష వెల్లడించింది. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ ఈ సందర్భంగా తనపై అభిమానులు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు త్వరగా కోలుకోవాలని తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి త్రిష కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో చివరిగా ‘నాయకి’లో కనిపించిన త్రిష ప్రస్తుతం తమిళంలో నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. అక్కడ లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేస్తూ అగ్ర నటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రాజెక్ట్‌తో పాటు మోహన్ లాల్‌తో ‘రామ్’, ‘రాంగి’ అనే మరో చిత్రంలో త్రిష నటిస్తోంది. Never been happier to read the word “negative” on a report🤪 Thank u all for your love and prayers❤️ Now I’m ready for you 2022🌟 pic.twitter.com/3Cbn9QAXi0 — Trish (@trishtrashers) January 12, 2022 -
బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్
ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ బాల సతీష్ ‘నెగటివ్’ అనే సినిమా తీశారు. ఈ నెగటివ్ ఫిల్మ్ చాయ్ బిస్కెట్ యూ ట్యూబ్ చానెల్లో ప్రసారం అవుతోంది. విక్రమ్ శివ, శ్వేతా వర్మ(బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్), దయానంద్ రెడ్డి ప్రధాన తారాణంగా రూపొందిన చిత్రం ఇది. ‘నెగటివ్’కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని బాల సతీష్ అన్నారు. ఈ చిత్రం గురించి సతీష్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితులతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కోవిడ్ విషయంలో నెగటివ్ అనేది పాజిటివ్‌గా మారిపోయింది. అందుకే ‘నెగటివ్’ టైటిల్ పెట్టి ఈ ఫిల్మ్ తీశాను. బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఓ నామినీగా ‘నెగటివ్’ ఎంపికైంది. ప్రెగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోషిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫైనలిస్టు జాబితాలో నా ‘నెగటివ్’ ఫిల్మ్ ఉంది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ సెమీ ఫైనలిస్టు లిస్టులో నిలిచింది. నా కథలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయగలగడమే నా బలమని నమ్ముతున్నాను. అందుకే సమకాలీన అంశాలనే నా కథాంశాలుగా ఎంచుకుంటుంటాను’’ అన్నారు. -
కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ హీరోయిన్.. 2 సార్లు నెగెటివ్
Alaya F Recovered From Covid 19 Reveals Two Times Negative: భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికిని చాటుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే బీటౌన్‌లో ప్రముఖులు కరోనా చేతులకి చిక్కగా బాలీవుడ్ బ్యూటీ అలయ ఎఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలయ తన ఇన్‌స్టా స్టోరీలో అందరికీ నమస్కారం. 'నేను ఒక వారం క్రితం కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అప్పుడు నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. నా చుట్టూ ఉన్న వారిలో కూడా లేవు. కాకపోతే నేను చాలా చోట్లకు ఎక్కువగా ప్రయాణిస్తాను కాబట్టి కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తెలిసాక ఐసోలేట్ అయ్యాను. ఆరోగ్యం బాగా ఉందని నాకు అనిపించాక డిసెంబర్ 30, జనవరి 1న రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకున్నాను. రెండుసార్లు నెగెటివ్ అని వచ్చింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నేను సంప్రదింపులు జరుపుతున్నాను. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండండి.' అని పేర్కొంది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా, పూజా బేడి కుమార్తె అయిన అలయ 2020 లో 'జవానీ జనేమాన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ -
బాల సతీష్ ‘నెగటివ్’ మూవీకి అవార్డుల వెల్లువ!
చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు... పోతుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే తమ మార్క్ ట్రెండ్ క్రియోట్ చేసి, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటి వారిలో యంగ్ డైరెక్టర్ బాల సతీష్ ఒకరు. షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా వెండితెరకు పరిచయమైన సతీష్.. అనేక తమిళ డబ్బింగ్ సినిమాలకు స్క్రిప్ట్ అసోసియేట్‌గా పనిచేశాడు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నెగటివ్’. విక్రమ్ శివ, ‘బిగ్‌బాస్’ ఫేమ్ శ్వేత వర్మ హీరో హీరోయిన్లుగా నటించగా, డైరెక్టర్ కమ్ యాక్టర్ దయానంద్ రెడ్డి ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ఫిలోమినా ఇన్ఫోటైన్మెంట్స్ బ్యానర్ మీద ఎఎమ్. రాజేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ విజయపథంలో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కలకారి ఫిల్మ్ ఫెస్టివల్, ది లిఫ్ట్-ఆఫ్ సెషన్స్ ఆన్లైన్ & ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిఫ్ట్-ఆఫ్ గ్లోబల్ నెట్వర్క్, ఫిలమ్ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది. వీటితో పాటు ఇప్పటికే.. ప్రాగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోసిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ మరియు బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడింది. అలాగే యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో సెమి ఫైనలిస్ట్‌గా నిలిచింది. -
తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్: విదేశాల నుంచి వచ్చిన 13 మందికి..
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చినా, అది ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. హైరిస్క్ దేశాల నుంచి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారందర్నీ చికిత్స కోసం టిమ్స్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణకు రిస్క్దేశాల నుంచి 1,805 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో 13 మందికి సాధారణ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఎవరికీ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు సోమవారంరాత్రి వారు ప్రత్యేక బులిటెన్ విడుదల చేశారు. సోమవారం ఆయా దేశాల నుంచి 535 మంది ప్రయాణికులు రాగా, అందరికీ కరోనా నెగెటివ్ అని తేలిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 195 కేసులు.. రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజులో 37,108 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 195 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6.77 లక్షలకు చేరుకుందన్నారు. తాజాగా ఒకరు చనిపోగా, మొత్తం కరోనాతో మరణించినవారి సంఖ్య 4 వేలకు చేరుకుందని వెల్లడించారు. ఒక రోజులో 171 మంది కోలుకోగా, మొత్తం 6.69 లక్షల మంది రికవరీ అయ్యారు. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుందని ఆయన తెలిపారు. ఒక్క రోజులో 4.30 లక్షల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని, రెండో డోస్ తీసుకోవాల్సినవారు ఇంకా 23.96 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం 65.09 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రసుత్తం కరోనాతో 1,261 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఓటర్లు, వీడియో వైరల్ -
తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్
కోల్‌సిటీ (రామగుండం): కరోనా సోకిన ఓ నిండు గర్భిణికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్మ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. గోదావరిఖనిలోనే ఉంటున్న ఆమె భర్త ప్రతినెలా ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండడడంతో బుధవారం ఆస్పత్రికి రాగా.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, దీనికి ముందుగా కరోనా టెస్ట్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు గురువారం కోవిడ్ నిబంధనల ప్రకారం గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, అనస్థీషియా డాక్టర్ అగర్‌బాబా పీపీఈ కిట్ ధరించి ఆపరేషన్ చేశారు. పుట్టిన ఆడశిశువుకూ కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. బాలింతను కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కళ్యాణి, అగర్‌బాబా, స్టాఫ్‌నర్సులు భవాని, లీలా, సిబ్బంది ఆశిష్, ఓదెలును ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ భీష్మ, కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా వైరస్ సోకిందేమోనని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నీరజ్‌కు పరీక్షలు చేయగా నెగటివ్ తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. హరియాణాకు చెందిన నీరజ్ చోప్రా జావెలన్ త్రోయర్‌లో స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు. స్వదేశానికి వచ్చిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. స్వరాష్ట్రం హరియాణా రూ.6 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఒలింపిక్స్‌లో సత్తా చాటిన తమ క్రీడాకారులను శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వాస్తవంగా నీరజ్ హాజరు కావాల్సింది. కానీ తీవ్ర జ్వరం కారణంగా ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాడు. వైద్యుల సూచనల మేరకు నీరజ్ ఇంట్లోనే ఉంటున్నాడని సమాచారం. శుక్రవారం 103 డిగ్రీల ఉష్ణోగ్రత నీరజ్‌కు ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో జ్వరం బారినపడ్డాడని అతడి సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు. జ్వరం కారణంగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు నీరజ్ చోప్రా దూరంగా ఉండనున్నాడు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
మృతిచెందిన వ్యక్తికి కరోనా నెగిటివ్ రిపోర్ట్
సాక్షి, రామగుండం(కరీంనగర్): అంతర్గాం మండలంలోని రాయదండికి చెందిన మూడు కుటుంబాల్లో 13 మంది కరోనా టెస్ట్ చేయించుకోకున్నా వారి సెల్ నంబర్లకు నెగెటివ్ రిపోర్ట్ అంటూ మెసేజ్‌లు రావడంతో అవాక్కయ్యారు. వీరిలో ఒకరు గతంలోనే మృతిచెందారు. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయదండికి చెందిన మచ్చ బాలయ్య గత అక్టోబర్ 3న అనారోగ్యంతో మృతిచెందాడు. అంతకుముందు అతనికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చింది. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి విషమించి, చనిపోయాడు. ఈ నేపథ్యంలో మృతుడితోపాటు అతని కుటుంబసభ్యులు శారద, సంజీవ్, విష్ణు, మరో రెండు కుటుంబాలకు చెందిన మచ్చ రామయ్య, రజిత మొత్తంగా 13 మందికి జూలై 28న బసంత్‌నగర్ పీహెచ్సీలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు, రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినట్లు వారి ఫోన్ నంబర్లకు మెస్సేజ్‌లు వచ్చాయి. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కరోనా టెస్ట్‌కు వెళ్లకపోగా పరీక్ష చేయించుకున్నట్లు మెస్సేజ్‌లు రావడం పట్ల మృతుడి కుమారుడు సంజీవ్ ‘సాక్షి’తో తన ఆవేదన వెలిబుచ్చాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన వంగల రమేష్, అతని భార్య వాణి గత ఏప్రిల్ 15న తన కోవిషీల్డ్ మొదటి డోస్ టీకా వేసుకున్నారు. ఆ సమయంలో ఒకే ఫోన్‌నంబర్ ఇచ్చారు. జూలై 26న రెండో డోస్ టీకా వేసుకునేందుకు వెళ్తే వాణి పేరు మాత్రమే ఆన్లైన్లో చూపిస్తోందని ఆమెకు మాత్రమే వ్యాక్సిన్ వేశారు. రమేష్‌కు వేయకుండా పంపించారు. అసలైన లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
ఏపీ, తెలంగాణ వారికి నెగెటివ్ రిపోర్టు అక్కర్లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి ఇకపై ఆర్టీ–పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ఇతరత్రా ప్రయాణ సాధానాల ద్వారా ఢిల్లీ వచ్చే వారికి ఎలాంటి నెగెటివ్ రోపోర్టు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మే 19న ఇచ్చిన ఉత్తర్వులు (ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి, 14 రోజుల క్వారంటైన్) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను పలు విమానయాన సంస్థలు తమతమ ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశాయి. రెండు నెలల తర్వాత రెస్టారెంట్లు దేశరాజధానిలో సుమారు రెండు నెలల తర్వాత రెస్టారెంట్లు తెరచుకున్నాయి. అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం 50 శాతం సామర్థ్యం, భౌతికదూరం పాటిస్తూ నిర్వాహకులు రెస్టారెంట్లు తెరిచారు. మరోవైపు, ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి. దేశరాజధానిలో గడిచిన 24 గంటల్లో 131 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 16 మంది మృతి చెందారు. 16 నుంచి తెరచుకోనున్న స్మారక కట్టడాలు ఈ నెల 16 నుంచి స్మారక కట్టడాలు, మ్యూజియంలు తెరవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అనుమతిసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజ్‌మహల్‌తో పాటు ఏఎస్ఐ సంరక్షణలో ఉన్న 3,693 చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, 50 మ్యూజియంలను బుధవారం నుంచి తెరువనున్నారు. సందర్శకులు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఏఎస్ఐ తెలిపింది. చదవండి: 8 గంటల ఫలితం.. దక్కిన ఓ ప్రాణం -
ప్రమాదకరం.. ‘ఫాల్స్ నెగిటివ్’.. అంటే ఏంటి?
సాక్షి, కాకినాడ: అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో తీరుగా ఉంటోంది. లక్షణాలున్నవారు, ఆరోగ్య పరిస్థితి దిగజారినవారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే కొంతమందికి నెగిటివ్‌గా.. ఎటువంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్‌గా ఫలితం వస్తోంది. ఇలాంటివి అరుదుగా ఎదురవుతున్నప్పటికీ ప్రమాదకరంగానే పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా పరీక్షల ఆధారంగా వైద్యం అందించాల్సిన కీలక సమయాల్లో ఇదొక సమస్యగా పరిణమిస్తోందని అంటున్నారు. కాకినాడ జీజీహెచ్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మూర్తి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో వీఆర్డీ ల్యాబ్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై డాక్టర్ మూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఫాల్స్ నెగిటివ్ అంటే.. కరోనా లక్షణాలున్నప్పటికీ పరీక్షలో రిపోర్ట్ నెగిటివ్‌గా వస్తే దాన్ని వైద్య పరిభాషలో ఫాల్స్ నెగిటివ్ అంటారు. పరీక్షలు చేసేవారికి సరైన శిక్షణ లేకపోవడం, సరైన స్వాబ్‌ను వాడకపోవడం, శాంపిల్ పరిమాణం తక్కువగా సేకరించడం, సేకరించాక సరిగా భద్రపర్చకపోవడం, శాంపిళ్లను సరైన రీతిలో పరీక్ష కేంద్రాలకు తరలించకపోవడం ఫాల్స్ నెగిటివ్‌కు కారణాలవుతున్నాయి. ఫాల్స్ పాజిటివ్ కంటే ఫాల్స్ నెగిటివ్ ప్రమాదకరం. ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్ వల్ల బాధితుడు వైద్యానికి దూరమవుతాడు. తద్వారా తన ఆరోగ్యాన్ని ప్రమాదకరస్థితిలోకి నెట్టుకోవడమే కాకుండా వైరస్ వ్యాప్తికి కూడా కారకుడవుతాడు. ఫాల్స్ పాజిటివ్ అంటే.. శాంపిల్స్ తారుమారైనా, వైరస్ తగ్గి 90 రోజులు గడవక ముందు మళ్లీ టెస్ట్ చేయించుకున్నా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. దీనివల్ల బాధితుడి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వ్యాధి లేకున్నా మందులు వేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి వైరస్ నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తోంది. వైరస్ మృతకణాలు సైతం పరీక్షల్లో కనిపించడం వల్ల పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. అందుకే ప్రభుత్వం రీ టెస్ట్‌ను సిఫార్సు చేయడం లేదు. మ్యుటేషన్ల వల్ల ఫలితాల్లో తేడా పరీక్షకు సేకరించిన నమూనాల్లో మ్యుటేషన్లు (వైరస్ పరివర్తన) చోటు చేసుకుంటే ఫలితాల్లో తేడాలు కనిపిస్తాయి. పరీక్షకు ముందు ఆహారం తీసుకున్నా.. ద్రవాలు తాగినా పరీక్ష ఫలితాల ఖచ్చితత్వం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఘన, ద్రవ ఆహారాలు శరీరంలో వివిధ క్రియలపై చూపే ప్రభావమే దీనికి కారణం. నిర్లక్ష్యం వద్దు.. అరుదైన సందర్భాల్లోనే ఫాల్స్ పాజిటివ్, నెగిటివ్‌లకు అవకాశం ఉంది. అయితే వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే మాత్రం నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో తిరిగి మరోమారు ఆర్టీపీసీఆర్ పరీక్షే చేయించుకోవాలి. అప్పటికీ నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే తప్పకుండా సీటీ స్కాన్ చేయించుకోవాలి. హై రిజల్యూషన్ సీటీ స్కాన్ టెస్ట్ (హెచ్ఆర్సీటీ) రేడియేషన్ కారణంగా అందరికీ సురక్షితం కాదు. గర్భిణులు సీటీ స్కాన్ చేయించుకోవాల్సి వస్తే ఉదరంపై అబ్డామిన్ షీట్ ఉంచుకోవాలి. -
నువ్వేమైనా అందగత్తెవా?!.. విపరీతమైన కామెంట్లు రావడంతో..
దీపిక (పేరు మార్చడమైనది) ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమైన కూతురును బాగా చదివించాలన్నది తండ్రి ప్రసాద్(పేరుమార్చడమైనది) కల. అందుకు తగినట్టుగానే దీపిక బాగానే చదువుతుంది. ఫ్యాషన్ అంటే ఆసక్తి ఉండే దీపిక తన డ్రెస్సింగ్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. తన డ్రెస్సింగ్‌ను నలుగురూ మెచ్చుకోవాలన్న ఆలోచనతో రకరకాల మోడళ్లలో డ్రెస్సులు ధరించి, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. వచ్చిన లైక్స్, మెచ్చుకోలు కామెంట్స్ చూసుకొని మురిసిపోయేది. టిక్‌టాక్ వీడియోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది దీపిక. ఆరు నెలలు గడిచిపోయాయి. ఓ రోజు మెసేజ్‌లు చూసుకుంటున్న దీపిక ఉన్నట్టుండి ఫోన్ విసిరికొట్టింది. అది చూసిన తల్లి దీపికను మందలించింది. తల్లివైపు కోపంగా చూసి తన రూమ్‌కి వెళ్లిపోయింది దీపిక. ముంచుకొచ్చే కోపం రాత్రి భోజనానికి రమ్మని ఎంత చెప్పినా కూతురు బయటకు రాలేదు. ఈ మధ్య దీపిక చాలా ముభావంగా ఉంటోందని, ఏదడిగినా త్వరగా కోపం తెచ్చుకుంటుందని భర్తకు చెప్పింది. ‘ఆ వయసు అలాంటిది. అవేమీ పట్టించుకోకు. కొన్ని రోజులు పోయాక తనే తెలుసుకుంటుందిలే’ అన్నాడు ప్రసాద్. ‘అన్నింటికీ కూతురును ఇలాగే వెనకేసుకొస్తారు. అన్నం తినమన్నా అదేదో తిట్టులాగే వినపడుతోంది మీ కూతురుకి’ అంటూ తన అసహనాన్ని తెలియజేస్తూ గిన్నెలు సర్ది పడుకుంది. ఊహించని సంఘటన మరుసటి రోజు పది దాటుతున్నా దీపక రూమ్‌లోంచి ఎలాంటి అలికిడి లేదు. రాత్రి భోజనం కూడా చేయకుండా గది తలుపులు వేసుకొని పడుకుంది. ఇప్పటికీ లేవలేదు. ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. తల్లి ఎంత పిలుస్తున్నా కూతురు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి, దీపికను అదేపనిగా పిలిచాడు ప్రసాద్. అయినా ఎలాంటి అలికిడి లేదు. ఇంటి వెనకాల నుంచి వెళ్లి, కిటికీ డోర్ తీసి చూశాడు. కూతురు ఉరివేసుకొని కనపడటంతో ప్రసాద్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. ముంచేసిన కామెంట్స్ పోలీసులు దీపిక తల్లి తండ్రులనూ, ఇంటి చుట్టుపక్కల వారినీ విచారించారు. దీపిక ఆత్మహత్యకు కారణమేంటనేది తెలియలేదు. పోలీసులు దృష్టి దీపిక వాడుతున్న ఫోన్ మీద పడింది. పూర్తి డేటా తీసిన పోలీసులు దీపిక సోషల్ మీడియా పేజీలను కూడా చూశారు. దాంట్లో నెల రోజులుగా దీపిక పోస్టులకు అనుచితమైన కామెంట్స్ రావడం, దానికి దీపిక ఎదురు సమాధానాలు ఉండటం చూశారు. పాతికమందికి పైగానే దీపిక అప్లోడ్ చేసిన ఫొటోలకు ‘నువ్వో పెద్ద అందగత్తెవా!’ అని ఒకరు, ‘నీకంత సీన్ లేదు’ అంటూ ... ఎన్నో విపరీతార్థాలతో ఉన్న కామెంట్స్ ఉన్నాయి. కొన్నాళ్లుగా నెగిటివ్ కామెంట్స్‌కు తట్టుకోలేని దీపిక, వారికి ఘాటుగానే సమాధానాలు ఇచ్చేది. దీంతో దీపికను ఏడిపించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాళ్లు ఎవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలియని దీపిక ఈ నెగిటివ్ కామెంట్స్‌కి తనలో తనే కుమిలిపోతూ వచ్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే బాధపడతారని మౌనంగానే ఉండిపోయింది. మెసెంజర్ లో వచ్చే మెసేజ్‌లలో తప్పుడు కామెంట్స్ వచ్చేవి. వాటిని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతూ ఉండేది. రోజు రోజుకీ దీపికలో అసహనం, కోపం తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తనపైన వచ్చే విమర్శలను తట్టుకోలేక దిగులుగా ఉండేది. తండ్రి అడిగితే ‘ఒంట్లో బాగోలేదని’ చెప్పేది. తల్లి అడిగితే మాత్రం కోపంగా విరుచుకుపడేది. విపరీతమైన ఒత్తిడికి లోనైన దీపిక ఆత్మహత్యా యత్నం చేసింది. పూర్తిగా శోధించిన పోలీసులకు వాళ్ల కాలనీలోని అబ్బాయిలే ఆమెను టార్గెట్ చేశారని తెలిసింది. ఆత్మహత్యకు రెండవ ప్రధాన కారణం.. ఏ తల్లిదండ్రులకైనా వారి అతి పెద్ద పీడకల ఏంటంటే తమ పిల్లల మరణానికి సాక్ష్యం ఇవ్వడం. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం 2018లో 10,159 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే 2019కి ఆ సంఖ్య 3.4 శాతం పెరిగిందని తన నివేదికలో పొందుపరిచింది. ప్రతి రోజూ 381 టీనేజర్లు ఆత్మహత్య లు చోటుచేసుకుంటున్నట్టు, దీంట్లో పరీక్షల్లో ఫెయిలవడం ఇతరత్రా కారణాలు మొదటి కారణంగా ఉంటే, సోషల్ మీడియానే రెండవ ప్రధాన కారణంగా ఉంటోందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే 67 శాతం టీనేజర్ల జీవితాలు అధ్వానంగా ఉన్నట్టు, 73 శాతం మంది ఇతరులకు తమ రూపాన్ని చూపించుకునే ఫొటోలు పోస్ట్ చేయడం పట్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు, 60 శాతం జనాదరణ కోసం, 80 శాతం మంది సోషల్ మీడియా డ్రామా ద్వారా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు. పది నుండి 14 ఏళ్ల వయసు గల బాలికలలో ఆత్మహత్య శాతం మూడు రెట్లు పెరిగిందని, సోషల్‌మీడియా వాడకం రోజుకు 2–3 గంటలపాటు ఏకధాటిగా ఉపయోగించే టీనేజర్లలో బాధ, ఆత్మహత్య టెండెన్సీ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అమెరికా పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తమ నివేదికలో పొందుపరిచారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీనేజర్లు ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ చేయడం మేలు సోషల్ మీడియాలో అందరి మెప్పు పొందడం అనేది అసాధ్యం. వ్యతిరేక వ్యాఖ్యలు రావచ్చు అనే అవగాహన కూడా ఉండాలి. అలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కావాలని రెచ్చగొట్టే వాఖ్యలకు పాల్పడుతున్నవారి అకౌంట్‌ను బ్లాక్ చేయడం అనేది మేలైన, సులువైన ఆప్షన్. లేదంటే, పట్టించుకోకుండా వదిలేయవచ్చు. కామెంట్స్ డిలీట్ చేసే ఆప్షనూ ఉంటుంది. దీనిని ఉపయోగించుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకుండా నిరోధించవచ్చు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్టే వ్యతిరేక కామెంట్స్ పట్ల కూడా సరైన నిర్ణయం తీసుకునే సమర్థత మీ చేతుల్లోనే ఉంది. ఇతర వ్యక్తులు ఎలాగూ అగ్నికి ఆజ్యం పోయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి, వ్యతిరేక వ్యాఖ్యల çపట్ల మరింతగా ప్రోత్సహించేవారిని కూడా అకౌంట్లో లేని విధంగా నియంత్రించుకునే అధికారం మన చేతుల్లోనే ఉందని గ్రహించాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్ గైడెన్స్ అవసరం టీనేజర్స్‌లో ఒత్తిడి పెంచే వాటిలో సోషల్‌మీడియా వాడకం ప్రధానంగా ఉంటోంది. వీటిలో జరిగే రకరకాల నేరాలు ముఖ్యంగా అమ్మాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేరం జరిగేంత వరకు చూడకుండా తల్లిదండ్రులే ముందస్తు గైడెన్స్ ఇవ్వడం మంచిది. సోషల్‌మీడియా ప్రభావం గురించి టీనేజర్స్‌తో తల్లితండ్రులూ తరచూ సంభాషిస్తూ ఉండటం, వారి అకౌంట్స్‌ను గమనిస్తూ ఉంటే సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. దీపికా పాటిల్, స్పెషల్ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్ -
Karnataka: లాక్డౌన్ ముగిశాక ఎలా?
సాక్షి, బెంగళూరు: లాక్డౌన్ ముగిసిన తరువాత బెంగళూరుకు వచ్చేవారికి కోవిడ్ నెగిటివ్ రిపోర్టును తప్పనిసరి చేయాలని నిపుణులు సూచించారు. ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. ఆ తరువాత ఎత్తివేస్తే వెంటనే లక్షలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు, ఉద్యోగులు తిరిగివస్తారు. వారు కరోనా నెగిటివ్ రిపోర్టుతో వస్తేనే రాష్ట్రంలోకి అనుమతించాలని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కఠిన లాక్డౌన్ వచ్చాక బెంగళూరులో కరోనా కేసులు తగ్గగా, పల్లెల్లో పెరిగాయి. లాక్డౌన్ ముగిశాక పల్లెల నుంచి వలసల ప్రవాహం మొదలవుతుంది. దీని వల్ల తిరిగి బెంగళూరులో కరోనా భూతం పంజా విసురుతుందని తెలిపారు. కాబట్టి నెగిటివ్ నివేదికతో రావాలి, లేదా వచ్చినవారందరికీ పరీక్షలు జరిపి కోవిడ్ లేనివారినే అనుమతించాలని తెలిపారు. చదవండి: ఎస్సై అమానుషం.. దళితునితో మూత్రం తాగించి.. -
కరోనా తగ్గిపోయాక.. తర్వాత చేయాల్సిందేంటి..?
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోలా కరోనా సోకింది. ఐసోలేషన్‌లో ఉంటూ, జాగ్రత్తగా మందులు వాడుతూ.. కరోనా నుంచి బయటపడ్డారు.. మరి తర్వాత ఏమిటి? ఎప్పటిలాగానే ఉండొచ్చా? ఏమైనా మందులు వాడాల్సి ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), కేంద్ర వైద్యారోగ్య శాఖ తమ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చాయి. కోవిడ్ వచ్చి తగ్గాక ఏం చేయాలంటే.. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలా? ►కరోనా సోకి తగ్గిపోయినవారు కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాల్సిందే. ►కోవిడ్ సమయంలో శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వ్యక్తులను బట్టి ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కోవిడ్ తగ్గిన వారికి అప్పటికప్పుడే మళ్లీ సోకే అవకాశం లేకున్నా.. ఉమ్మడిగా వాడే వస్తువులు, బహిరంగ ప్రదేశాల్లోని ఉపరితలాలను తాకడం వంటి వాటి ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. కరోనా మళ్లీ సోకుతుందా? ►కోవిడ్ వచ్చి తగ్గిపోయినా మళ్లీ సోకే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఇటీవల 1,300 మందిపై చేసిన పరిశోధనలో.. 58 మందికి (4.5 శాతం) రెండోసారి కరోనా సోకినట్టు గుర్తించారు. ►రెండోసారి కరోనా సోకిన ఈ 58 మందిలో ఇద్దరికి అయితే.. 102వ రోజే (దాదాపు మూడు నెలలకే) మళ్లీ సోకినట్టు తేలింది. కోవిడ్ సోకి తగ్గగానే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ►కోవిడ్ నుంచి కోలుకున్నాక కనీసం నాలుగు నుంచి 8 వారాల వరకు వ్యాక్సిన్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ గతంలో పేర్కొంది. ఈ విరామం కనీసం 12 వారాలు (మూడు నెలలకు) ఉండాలని ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ►కరోనా సోకి తగ్గినవారిలో ఆరు నెలల వరకు వ్యాక్సిన్ అవసరం లేదని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే అందరిలోనూ ఇదే స్థాయిలో ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు. కోలుకున్నాక నీరసం, ఆయాసం ఉంటే ఎలా? ►ఆస్పత్రిలో చేరాల్సిన స్థాయిలో తీవ్రత లేకున్నా కూడా.. కోవిడ్ వచ్చి తగ్గిన కొందరు పేషెంట్లలో నిస్సత్తువ, ఆయాసం, శ్వాస ఇబ్బందులు, పలు న్యూరోలాజికల్ సమస్యలు ఉంటున్నాయి. ఇవి ఎంతకాలం కొనసాగుతాయన్నదే కీలకం. కొద్దిరోజుల్లో తగ్గిపోతే ఏ ఇబ్బందులూ ఉండవు. ►కోవిడ్ నుంచి కోలుకున్నాక కొన్ని లక్షణాల విషయంగా మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తీవ్ర స్థాయి జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు 95 శాతం కన్నా తగ్గిపోవడం, ఛాతీలో నొప్పి, గందరగోళ పడుతుండటం, కంటి చూపులో ఇబ్బందులు వంటివాటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుందా? ►కోవిడ్ వచ్చి తగ్గిపోయిన అందరికీ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) సోకే ప్రమాదం లేదు. మధుమేహం నియంత్రణలో లేకపోవడం, స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం కావడం, ఎక్కువ కాలం ఐసీయూ/ఆక్సిజన్ బెడ్‌పై ఉండటం, కేన్సర్, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, అవయవ మార్పిడి చేయించుకుని ఉండటం వంటివి ఉంటే మాత్రమే బ్లాక్ ఫంగస్ దాడికి అవకాశం ఎక్కువ. ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ పెట్టాలి? ►వీలైనంత వరకు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ►వైద్యుల సూచనల మేరకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుష్ మందులు వాడొచ్చు. ►వయసు/శరీర పరిస్థితికి తగినట్టుగా యోగా, మెడిటేషన్, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచిది. ►వీలైనంత వరకు రోజూ ఉదయం పూట నడక అవసరం. ►అన్ని పోషకాలు ఉండి, సులువుగా జీర్ణమయ్యే తాజా ఆహారం తీసుకోవాలి. ►తగిన స్థాయిలో విశ్రాంతి, నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ►దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలకు సంబంధించి డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడొచ్చు. -
KCR: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉంటున్న సీఎంకు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలోని బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ యాంటిజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింట్లోనూ ఆయనకు కరోనా నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులూ సాధారణంగా ఉన్నట్లు తేలింది. చదవండి: నేను సీఎం కావాలనుకోలేదు -
సీఎం కేసీఆర్ తాజా రిపోర్ట్‌లో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ప్రకటించారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌కు తాజాగా గురువారం యాంటిజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. వాటిల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నిన్నటి యాంటిజెన్ టెస్ట్ నివేదికలో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదికలో కచ్చితమైన ఫలితం రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని వైద్యుడు ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు, మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ఏప్రిల్ 19వ తేదీన కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నారు. చదవండి: నాగార్జున సాగర్ మళ్లీ టీఆర్ఎస్దే చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
డైరెక్టర్ అనిల్ రావిపూడికి కరోనా నెగెటివ్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈరోజు (ఏప్రిల్ 28 )న చేసిన టెస్టు రిపోర్టులో తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని, ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టును షేర్ చేస్తూ.. 'ఈ నెల 13న నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరికి పర్సనల్‌గా ఫోన్ చేసి కరోనా టెస్టు చేయించుకోవాలని కోరాను. వైద్యుల సూచనలు పాటిస్తూ నేను కూడా క్వారంటైన్ అయిపోయాను. ఈరోజు చేసిన టెస్టులో నెగిటివ్ అని వచ్చింది. చాలా బెటర్‌గా ఫీల్ అవుతున్నాను' అని పేర్కొన్నారు. ఇక ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని కోరారు. ఇక ప్రస్తుతం ఆయన ఎఫ్-3 సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం వాయిదా వేశారు. ప్రస్తుతం ఈయనకు నెగిటివ్ రావడంతో ఈ మూవీ త్వరలోనే మళ్లీ పట్టాలెక్కనుంది. #WearAMask #StayHome #StaySafe #GetVaccinated pic.twitter.com/pq5fu6lMpG — Anil Ravipudi (@AnilRavipudi) April 28, 2021 చదవండి : యాంకర్ అనసూయను అవమానించిన 'ఆహా'! Allu Arjun: అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్ -
శుభవార్త చెప్పిన సోనూసూద్
సాక్షి, ముంబై: కరోనా కాలంలో రియల్ హీరోగా అవతరించిన అపర దానకర్ణుడు, నటుడు సోనూసూద్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన ఆయనకు తాజా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో తమ హీరో త్వరగా కోలుకోవాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులు, ఫాలోవర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి పట్ల శరవేగంగా స్పందించే ఆపద్భాంధవుడు సురక్షితంగా ఉన్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్’’ ఉదయం లేచిన దగ్గర్నుంచీ, అర్ధరాత్రి నుండి మరుసటి ఉదయం వరకు ఈ 3 పదాలే తనకు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్నిసార్లు పాస్ అవుతున్నా, మరి కొన్నిసార్లు విఫలమవుతున్నా..అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవుడు అందరినీ చల్లగా చూడాలంటూ సోనూ ట్వీట్ చేశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు ఆగస్టు 15 న దేశభక్తిని చూపించే వారికి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయటానికి , దేశభక్తిని చూపించడానికి ఇంతకు మించిన సమయం లేదు స్పందించాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సోనూ సూద్, భయపడకండి..మరింత సేవ చేసేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందంటూ వ్యాఖ్యానించడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. చెప్పడమే కాదు చేసిన చూపిస్తున్నారు కూడా. సోనూ ట్విటర్ టైమ్‌లైన్‌ను పరిశీలిస్తే బాధితుల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు, చేస్తున్న సహాయ సహకారాలు అవగతమవుతాయి. (సోనూసూద్‌కు కరోనా పాజిటివ్) Tested: COVID-19 Negative. pic.twitter.com/wF61zXVJ6m — sonu sood (@SonuSood) April 23, 2021 Bless you sir. Stay safe. 🙏 https://t.co/evKg93iiRE — sonu sood (@SonuSood) April 23, 2021 15 अगस्त को देशभक्ति दिखाने वालों के लिए संदेश ; देश के लिए कुछ करने और देशभक्ति दिखाने का इससे ज़रूरी समय कभी नहीं आएगा 🇮🇳🙏 — sonu sood (@SonuSood) April 23, 2021 Oxygen, Remdesivir and Beds. Morning to mid night to next morning. Just these 3 words. Sometimes I pass n sometimes I fail. But I will keep trying. God bless you all. Iam with you ,🙏 — sonu sood (@SonuSood) April 22, 2021 -
కరోనా: హమ్మయ్య.. నెగెటివ్.. అనుకునేలోపే!
హమ్మయ్య.. టెస్ట్ చేయించుకున్నాం.. నెగెటివ్ వచ్చింది ఇక టెన్షన్ లేదు అనుకునే లోపే లక్షణాలు మొదలవుతున్నాయి.. ఇదేంటి మొన్నే టెస్ట్ చేయించుకున్నాం కదా.. ఇంటి నుంచి కనీసం బయట అడుగు పెట్టలేదు అనుకుంటున్నారు. కానీ నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మారుతోంది పీహెచ్సీ సెంటర్లలోనే అని తర్వాత తెలుసుకుంటున్నారు. టెస్టులు చేయించుకునేందుకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా ఉండటంతో అందరికీ ఇబ్బంది తప్పడం లేదు. సాక్షి, బంజారాహిల్స్: మాస్క్ ధరించడం ఎంత ముఖ్య మో.. భౌతికదూరం పాటించడం కూడా అంతే ముఖ్యం.. కానీ జనాలకు అవేవీ పట్టడం లేదు.. ఆస్పత్రికి వచ్చాం కదా.. సేఫ్‌గా వెళ్తాం అనే ధీమాతో.. అతి తెలివితో ఒకే దగ్గర గుంపులుగా గుమిగూడుతున్నారు. వీరిని కట్టడి చేసే యంత్రాంగం పూర్తిగా కరువైంది. అటు పోలీసులు పట్టించుకోకపోగా, ఇటు జీహెచ్ఎంసీ పర్యవేక్షణ కరువై ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద భయాంకరమైన వాతావరణం నెలకొంటోంది. ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకే అన్ని అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని వైద్యులు, సిబ్బంది మొత్తుకుంటున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. పాజిటివ్ కేసులతో బాధపడుతున్న వారిని ఆనుకొనే నెగిటివ్ ఉన్న వ్యక్తులు కూడా రాసుకు పూసుకు తిరుగుతున్నారు. ఎటువంటి రోగం లేని వారు కూడా కరోనా అంటించుకోవాల్సి వస్తోంది. ఒకటి రెండు రోజులు పోలీసులు గస్తీలో ఉన్నప్పటికీ ఈ జనాలను చూసే వారే జంకుతూ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని షౌకత్నగర్ ఆరోగ్య కేంద్రం ఇలా చెప్పుకుంటూ దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఇప్పుడు కరోనా పాజిటివ్ స్పాట్లుగా మారుతున్నాయి. బంజారాహిల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గుంపులుగా జనం చదవండి: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ కరువవుతున్న టెస్టింగ్ కిట్లు.. కరోనా పరీక్షలకు బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని బంజారాహిల్స్ ఆరోగ్య కేంద్రానికి నిత్యం 300 మందికిపైగా వస్తున్నారు. అయితే టెస్టులు చేసే కిట్లు మాత్రం కరువయ్యాయి. సరిపడా కిట్లు లేకపోవడంతో చాలా మందిని వెనక్కి పంపించేస్తున్నారు. గురువారం సుమారుగా 300 కిట్లు అవసరం కాగా కేవలం సంబంధిత అధికారులు వంద మాత్రమే సరఫరా చేశారు. 106 మందికి పరీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నారు. మరో వైపు ఇక్కడ టెస్టింగ్ చేసే సిబ్బంది కొరత కూడా ఉంది. ఇద్దరు సిబ్బంది నాలుగైదు గంటలకుపైగా పీపీఈ కిట్ వేసుకొని విధులు నిర్వహించడం కష్టంగా మారుతోంది. బంజారాహిల్స్ ఆస్పత్రిలో 52 పాజిటివ్ కేసులు.. బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ఆరో గ్య కేంద్రంలో గురువారం 106 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రికార్డు స్థాయిలో 52 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. ఆస్పత్రి చరిత్రలోనే ఇది అత్యధిక సంఖ్య. బంజారాహిల్స్ రోడ్ నెం.8లోని ఓ టెంట్ హౌజ్‌లో పనిచేస్తున్న 20 మంది బీహార్ కార్మికులకు టెస్టులు చేస్తే 18 మందికి పాజిటివ్‌గా తేలింది.ఇదే రోడ్డులో గురువారం ఒక్క రోజే 35 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. ఇక ఫిలింనగర్ ఆరోగ్య కేంద్రంలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని షౌకత్నగర్ ఆరోగ్య కేంద్రంలో 87 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌గా తేలింది. -
ఇలా చేస్తే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు!
ముంబై: తమ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రొటోకాల్ ప్రకారం...వాంఖడే వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే తమ అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను తాము చూడాలనుకునే మ్యాచ్‌కు 48 గంటలలోపు చేయించుకోవాల్సి ఉంటుందని అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఎంసీఏ కార్యదర్శి సంజయ్ నాయక్ స్పష్టం చేశారు. అందులో నెగెటివ్ అని వస్తేనే మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి అడుగుపెట్టనిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలని సంజయ్ తెలిపారు. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లకు వాంఖడే ఆతిథ్యమివ్వనుంది. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న తెలిసిందే. కొన్ని రోజుల క్రితం స్టేడియం సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ( చదవండి: మరోసారి తన విలువేంటో చూపించిన రైనా ) -
సూర్యకి నెగటివ్
తమిళ హీరో సూర్య కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకి నెగటివ్ వచ్చింది. ఇటీవల తాను కోవిడ్ బారిన పడిన ట్టు సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా కోవిడ్‌కి సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఆయనకు తాజాగా నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సూర్య సన్నిహితుడు రాజశేఖర్ పాండి యన్ తెలిపారు. ‘సూర్య అన్నకు నెగటివ్ వచ్చింది. అందరి ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్. ఈ నెలాఖరు నుంచి సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట సూర్య. పాండిరాజ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారాయన. -
మనోళ్లు మైదానంలోకి...
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభ విఘ్నాన్ని అధిగమించారు. నిబంధనల ప్రకారం నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో క్రికెటర్లంతా నెగెటివ్‌గా తేలారు. ఆరు రోజులుగా ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. సోమవారంతో ఇది ముగిసింది. ఈ ఆరు రోజుల కాలంలో ఒక్కో ఆటగాడికి మూడుసార్లు చొప్పున కరోనా టెస్టులు జరిపారు. అన్నింటిలోనూ నెగెటివ్ ఫలితం రావడంతో ఎలాంటి సమస్య లేకుండా టెస్టు సిరీస్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు మూడు రోజుల పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు సాధన చేసేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కొందరు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగి అవుట్డోర్ సాధనకు ఉపక్రమించారని బీసీసీఐ వెల్లడించగా... నేడు ఆటగాళ్లంతా నెట్స్‌లోకి వస్తారని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన బెన్ స్టోక్స్, ఆర్చర్, బర్న్స్ క్వారంటైన్ పూర్తి చేసుకొని గత రెండు రోజులుగా సాధన చేస్తూనే ఉన్నారు. ఈ నెల 5 నుంచి తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు చెన్నైలో జరగనుండగా... తర్వాతి రెండు టెస్టులకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన అద్భుత విజయంతో టీమిండియా అమితోత్సాహంతో బరిలోకి దిగుతుండగా... శ్రీలంకపై 2–0తో గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది. -
హమ్మయ్య! అందరికీ నెగెటివ్
మెల్బోర్న్: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్’ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్ దాటి బయటకొచ్చి రెస్టారెంట్ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్‌గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. 25 శాతం మంది వీక్షకులకే ప్రవేశం సిడ్నీలో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా మూడో టెస్టుకు వచ్చే వీక్షకుల సంఖ్యను 25 శాతానికి కుదించారు. ఈ మైదానం మొత్తం సామర్థ్యం 38 వేల సీట్లు. దీంతో పదివేల లోపే ప్రేక్షకుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో టెస్టు కోసం ఇది వరకే జారీ చేసిన టికెట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసి అంతా కొత్తగా అంటే సీటుకు, సీటుకు మధ్య భౌతిక దూరం వుండేలా తిరిగి జారీ చేస్తారు. దీనిపై సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ మాట్లాడుతూ ‘న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని ప్రజారోగ్యం దృష్ట్యా మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మూడో టెస్టు సజావుగా, సురక్షితంగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రేక్షకుల సంఖ్యను కుదిస్తాం’ అని అన్నారు. ఎలా‘గబ్బా’! భారత ఆటగాళ్ల రెస్టారెంట్ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈనెల 15 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపైనే సందిగ్ధత పూర్తిగా తొలగలేదు. కాస్త అయోమయం ఉన్నప్పటికీ బీసీసీఐ సోమవారం చేసిన ప్రకటన సీఏకు ఊరటనిచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే నిబంధనలు పాటిస్తేనే బ్రిస్బేన్‌కు రావాలని లేదంటే అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్ బేట్స్ వ్యాఖ్యలపై బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
రకూల్
‘ఎలా ఉన్నారు?’ అంటే ‘వెరీ కూల్’ అన్నట్లుగా సమాధానం చెబుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నెగటివ్ అయ్యారు కదా.. అందుకే కూల్ అన్నమాట. అసలు విషయంలోకి వస్తే.. ఈ నెల 22న తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన రకుల్‌ప్రీత్ సింగ్ మంగళవారం మళ్లీ పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని తెలియజేశారు. ‘‘ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. 2021ని ఆరోగ్యంతో ప్రారంభిస్తాను. అందరూ మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి, ముందు జాగ్రత్త కోసం తగిన జాగ్రత్తలు తీసుకోండి’’ అన్నారు రకుల్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా, ‘ఇండియన్ 2’, ఓ తమిళ సినిమా, హిందీలో ‘మేడే’తో పాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. -
అభిమానులకు రకుల్ గుడ్‌న్యూస్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులకు మంగళవారం గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్నట్లు, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. ‘కోవిడ్ నెగిటివ్‌గా పరీక్షించానని చెప్పడానికి ఆనందంగా ఉంది. నేను పూర్తిగా బాగున్నాను. నాపై చూపించిన మీ ప్రేమకు ధన్యవాదాలు. మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథంతో 2021ను ప్రారంభించడానికి ఇక ఆలస్యం చేయలేను’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కు ధరించి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చదవండి: రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్ Thankyou for all the love ❤️ pic.twitter.com/XwhHtMubKf — Rakul Singh (@Rakulpreet) December 29, 2020 కాగా గతవార (డిసెంబర్ 22)న రకుల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లానిట్లు తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, దయచేసి ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోగలరని కోరారు. అందరు జాగ్రత్తగా ఉండాలని ట్విటర్ వేదికగా రకుల్ విజ్ఞప్తి చేశారు. కాగా, రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. -
నెగటివోచ్!
కథానాయిక కృతీ సనన్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా నెగటివ్ వచ్చిందని స్వయంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఓ హిందీ సినిమా చిత్రీకరణలో భాగంగా చండీఘర్ వెళ్లారామె. అప్పుడే కోవిడ్ బారినపడ్డారు. ‘‘కోవిడ్ నెగటివ్ వచ్చిందనే వార్త షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు సహాయపడ్డ వైద్యులకు ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు కృతీ సనన్. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ చిత్రీ కరణలో పాల్గొంటారామె. -
కరోనాకి భయపడాలి
నటుడు శరత్‌కుమార్ ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయనకు నెగిటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నాన్నను మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కరోనా అనేది ఎంత ప్రమాదమో కుటుంబంలో ఎవరికైనా పాజిటవ్ అని నిర్ధారణ అయినప్పుడే తెలుస్తుంది. అది ఎంత ఘోరమైన వైరస్సో తెలిసింది. అందుకే కరోనాకి భయపడాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన తండ్రికి వైద్యం చేసిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారామె. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 141 కోట్లు వెనక్కి
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ ఈటీఎఫ్(ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్)ల నుంచి ఇన్వెస్టర్లు గత నెలలో రూ.141 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. పుత్తడి ధరలు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులంటున్నారు. వరుసగా ఏడు నెలల నికర పెట్టుబడుల అనంతరం గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఈ నవంబర్లోనే పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కాగా గత ఏడాది ఇదే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.8 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయని ఆంఫీ వెల్లడించింది. (శాంసంగ్ మేకిన్ ఇండియా ఉత్పత్తులు) అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఈ ఏడాది జనవరిలో నికర పెట్టుబడులు రూ.202 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ.1,483 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మాత్రం రూ.195 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ వరుసగా ఏడు నెలల పాటు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు కొనసాగాయి. ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు, జూన్‌లో రూ.494 కోట్లు, జూలైలో రూ.921 కోట్లు, ఆగస్టులో రూ.908 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.597 కోట్లు, అక్టోబర్‌లో రూ.384 కోట్ల నికర పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ సంవత్సరం మంచి రాబడులు ఇచ్చిన అసెట్‌గా గోల్డ్ ఈటీఎఫ్‌లు నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ కాలానికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మొత్తం రూ.6,200 కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి. ఈ నవంబర్‌లో రూ.141 కోట్లు నికర పెట్టుబడుల ఉపసంహరణ జరగడంతో నవంబర్ చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు రూ.13,240 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ ఆస్తులు రూ.13,969 కోట్లుగా ఉన్నాయి. పుత్తడి... వ్యూహాత్మక ఆస్తి! కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తలు వస్తుండటం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి రానుండటం, స్టాక్ మార్కెట్లు జోరుగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో బంగారం ధరల విషయమై అనిశ్చితి నెలకొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్నింగ్‌స్టార్ ఇండియా ఎనలిస్ట్ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. అందుకని ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో పుత్తడి...వ్యూహాత్మక ఆస్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పుత్తడి సురక్షిత మదుపు సాధనంగా ఇన్వెస్టర్లను ఆదుకుంటుందని వివరించారు. పుత్తడి ఒక ప్రభావవంతమైన వైవిధ్యీకరణ ఆస్తి అని పేర్కొన్నారు. -
చిరంజీవికి కరోనా రాలేదు
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిజంగా పండగ లాంటే వార్త. తనకు కరోనా సోకలేదని చిరంజీవి స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. ఫాల్టీ ఆర్టీ పీసీఆర్ కిట్ వల్ల తనకు పొరపాటున కోవిడ్-19 నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా, కాలం తనతో ఆడేసుకున్నాయంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. (కరోనాతో సినీ రచయిత కన్నుమూత) ఆచార్య సినిమా షూటింగ్‌కి వెళ్లడం కోసం కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలినట్లు చిరంజీవి ట్విటర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్షణాలు ఏమీ లేకపోయినా పాజిటివ్ వచ్చిందని ఆయన అప్పుడు పేర్కొన్నారు. అయితే, ఇది నిజం కాదని తాజాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిరు స్వయంగా తెలిపారు. ‘పాజిటివ్ అనేసరికి మందులు తీసుకోవడం ప్రారంభించాను. రెండు రోజుల తర్వాత నాకే అనుమానం వచ్చి, అపోలో ఆస్పత్రికి వెళ్లాను. సీటీ స్కాన్ చేసి అంతా బానే ఉందన్నారు. ఆ తర్వాత ఇంకో ల్యాబ్‌లో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా నెగిటివ్ అనే చూపించింది. మొదట నేను ఎక్కడైతే టెస్ట్ చేయించుకున్నానో అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్టు వచ్చిన కిట్‌లో తప్పు ఉండి ఉంటుందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరు చూపిన ప్రేమాభిమానాలకు, పూజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. దీంతో బిగ్ బాస్ సీజన్-4 యాంకర్ నాగార్జునతోపాటు, ప్రముఖ యాంకర్ సుమ తదితరులంతా ఊపిరి పీల్చుకోవచ్చన్నమాట. A group of doctors did three different tests and concluded that I am Covid negative & that the earlier result was due to a faulty RT PCR kit. My heartfelt thanks for the concern, love shown by all of you during this time. Humbled ! 🙏❤️ pic.twitter.com/v8dwFvzznw — Chiranjeevi Konidela (@KChiruTweets) November 12, 2020 -
కోలుకున్న రొనాల్డో
ట్యూరిన్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల ఈ దిగ్గజ స్ట్రయికర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్యూరిన్‌లోని సొంతింట్లో చికిత్స తీసుకుంటూ ఐసోలేషన్‌కే పరిమితమయ్యాడు. 19 రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువెంటస్ క్లబ్ సంతోషం వెలిబుచ్చింది. ‘రొనాల్డో కులుకున్నాడు. ఇక అతని ఐసోలేషన్ ముగిసింది. తాజా స్వాబ్ టెస్టులో నెగెటివ్ రిపోర్టు వచ్చింది’ జట్టు వర్గాలు తెలిపాయి. కోవిడ్ సోకడంతో యువెంటస్ క్లబ్ తరఫున గత మూడు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. సిరీ ‘ఎ’లో క్రొటోన్, వెరోనా జట్లతో, చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనాతో జరిగిన మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. నేడు యువెంటస్... స్పెజియా క్లబ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో లేదంటే బుధవారం ఫెరెంక్వారోస్తో జరిగే మ్యాచ్‌లోనైనా అతను బరిలోకి దిగే అవకాశలున్నాయి. -
మీ ప్రేమను తిరిగి ఇస్తా!
కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ తమన్నా నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నార్మల్ లైఫ్‌లోకి వస్తానా అనిపించింది. ఈ టైమ్‌లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వస్తాను. నా మీద మీరు (అభిమానులను ఉద్దేశించి) చూపించిన ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను. ఫుల్ స్టామినాతో మీ ముందుకొస్తాను’’ అని పేర్కొన్నారు తమన్నా. వీడియోలో ఈ బ్యూటీ తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటూ కనిపించారు. -
నేను నెగటివ్
కోవిడ్ నిబంధనలతో షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. షూటింగ్లో పాల్గొనే ముందు కరోనా టెస్ట్‌లు చేయించుకుని చిత్రీకరణలో జాయిన్ అవుతున్నారు స్టార్స్. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఈ టెస్ట్ నన్ను చాలా భయపెట్టింది అంటున్నారు. కరోనా టెస్ట్ చేయించుకున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు పాయల్. ‘‘కరోనా టెస్ట్ అంటే చాలా భయమేసింది. ముఖ్యంగా ఆ ముక్కులో నుంచి స్వాబ్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఫలితాల్లో నెగటివ్ అని వచ్చింది. షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరం పాటించండి’’ అని అన్నారు పాయల్ రాజ్‌పుత్. -
పడ్డారండి పనిలో మరి...
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి. ‘బ్యాక్ టు వర్క్’ అంటూ ఆయన చేస్తున్న సినిమాల గురించి ఓ ట్వీట్ చేశారు. ‘‘ప్రస్తుతం నేను రెండు సినిమాలకు సంగీతం సమకూర్చే పనిలో ఉన్నాను. ఒకటి దర్శకుడు క్రిష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా. మరొకటి దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్నది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి’’ అన్నారు. అన్నట్లు.. కీరవాణి అందించిన హిట్ సాంగ్స్‌లో ‘పడ్డానండి ప్రేమలో మరి..’ ఒకటి. ఇప్పుడు ఆయన ‘బ్యాక్ టు వర్క్’ అంటున్నారు కాబట్టి ‘పడ్డారండి పనిలో మరి..’ అనొచ్చు. -
మంత్రి ఈటల పేషీలో ఏడుగురికి కరోనా
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇద్దరు డ్రైవ ర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లు ఉన్నట్లు మంత్రి ఈటల రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో తనకూ గురువారమే కరోనా నిర్ధారణ పరీక్ష చేశారని, ఆ పరీ క్షలో నెగెటివ్ వచ్చిందన్నారు. రెండ్రోజుల త ర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఆయన తెలిపారు. ఏడుగురికి కరోనా పా జిటివ్ రావడంతో మంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. దీంతో బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అయితే తనకు నెగెటివ్ వచ్చి నందున శనివారం బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వస్తానని ఈటల తెలిపారు. -
కరోనా: ఆ టెస్ట్‌లో నెగిటివ్ వస్తే నమ్మలేం
న్యూఢిల్లీ: ప్రపంచంపై కరోనా కరాళ నృత్యం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఊసరవెల్లి మాదిరి వైరస్ తన పరిమాణాన్ని మార్చుకుంటూ.. శక్తివంతంగా మారుతూ ప్రపంచానికి సవాలు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా పరీక్షల విషయంలో నేటికి ఎన్నో అపోహలు. ఈ నేపథ్యంలో కేంద్రం గురువారం కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటి జెన్ టెస్టులో పాజిటివ్ వస్తే... వైరస్ సోకినట్లు అర్థం. అయితే ఈ టెస్టులో ఒకవేళ నెగిటివ్ వస్తే నమ్మలేమని కేంద్రం అభిప్రాయపడింది. లక్షణాలు ఉండి.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే.. ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. ఈ టెస్టులో గనక నెగిటివ్ అని వస్తే.. అప్పుడు కరోనా లేనట్టే అని తెలిపింది. ఇంతకు ఈ టెస్టులు ఏంటో.. వాటి వివరాలు చూడండి.. (చదవండి: కరోనా పాజిటివ్.. తప్పుడు రిపోర్ట్ అనుకుంటా) #IndiaFightsCorona Health Ministry urges States/UTs to Mandatorily retest all Symptomatic Negative Cases of Rapid Antigen Tests through RT-PCR.https://t.co/jIqbBmdshV@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @DDNewslive @airnewsalerts @ICMRDELHI @mygovindia — Ministry of Health (@MoHFW_INDIA) September 10, 2020 ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ కరోనా నిర్ధారణ కోసం చేసే ఈ పరీక్షలో ఖర్చు తక్కువ.. ఫలితం కూడా అర్థగంటలోపే వస్తుంది. దీనిలో వైరస్‌పై స్పందించేందుకు సదరు వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు తయారయ్యాయ లేదా అనే విషయం ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఒక వేళ యాంటీబాడీలు ఉత్పత్తి అయితే పాజిటివ్.. లేదంటే నెగిటివ్‌గా ఫలితాలను నిర్ధారిస్తారు. సాధారణంగా ఈ పరీక్షలను ఎక్కువగా కరోనా హాట్‌స్పాట్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అయితే కొన్నిసార్లు కరోనా సోకినప్పటికి యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోతే.. నెగిటివ్‌గా వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ రావడం జరిగిందన్నారు వైద్యులు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) అనేది ల్యాబ్‌లో ఆర్ఎన్ఏను డీఎన్ఏగా మార్చే ప్రక్రియ. యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్‌ను కనుగొని దానికి శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇందుకోసం రోగి శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. వీటి ఫలితాలు రావడానికి 12-24 గంటల సమయం పడుతుంది. ఖరీదైనది కూడా. -
బాక్సర్ సరితాదేవి ‘నెగెటివ్’
న్యూఢిల్లీ: ప్రపంచ, ఆసియా మాజీ చాంపియన్, భారత మేటి బాక్సర్ లైష్రామ్ సరితా దేవి కోవిడ్–19 నుంచి బయట పడింది. తాజా పరీక్షలో తనకు నెగెటివ్ ఫలితం వచ్చినట్లు ఆమె వెల్లడించింది. అయితే ఏడేళ్ల తన కుమారుని ఆరోగ్య భద్రత దృష్ట్యా మరో 10 రోజుల పాటు ఇంటికి దూరంగా క్వారంటైన్లో ఉండనున్నట్లు పేర్కొంది. 38 ఏళ్ల సరితా దేవి, ఆమె భర్త తోయిబా సింగ్ ఆగస్టు 17న కరోనా పాజిటివ్‌గా తేలారు. చికిత్స అనంతరం సోమవారం కోవిడ్ సెంటర్ నుంచి డిశ్చార్జి అయినట్లు ఆమె తెలిపింది. ‘నాకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా బయటపడ్డాయి. కాస్త జలుబు చేసింది అంతే. అయితే నెగెటివ్‌గా తేలడంతో ఆసుపత్రి నుంచి సోమవారమే బయటకొచ్చా. కానీ మరికొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి ఉంటే నా ఏడేళ్ల కుమారుడు వెంటనే వచ్చి నన్ను హత్తుకుని ఉండేవాడు. అతని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం మాకిష్టం లేదు. అందుకే నా అకాడమీలోని హాస్టల్ గదిలో మరో పది రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటిస్తా’ అని సరితా వివరించింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకో సింగ్ తర్వాత వైరస్ బారిన పడిన రెండో బాక్సర్ సరిత కావడం గమనార్హం. -
కొంపముంచుతున్న నెగెటివ్
ఓ పార్టీ ఎమ్మెల్యే ఇటీవల అనుమానంతో కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ లక్షణాలుండటంతో అనుమానమొచ్చి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. రామారావు (పేరు మార్చాం) పార్టీ నేతగా తరచూ ప్రజల వద్దకు వెళ్తుంటాడు. ఎందుకైనా మంచిదని యాంటిజెన్ టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. కానీ గొంతులో గరగర ఉండటంతో మళ్లీ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. దాంట్లో పాజిటివ్ వచ్చింది. సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ఉన్న సమస్యే ఇది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే 99.3% నుంచి 100% ఓకే. నెగెటివ్ వస్తే 50.6% నుంచి 84% మాత్రమే కరెక్ట్ అని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టంచేసింది. మిగిలిన నెగెటివ్‌లన్నీ నెగెటివ్‌లుగా గుర్తించలేమంది. యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ కచ్చితత్వమే అసలు సమస్య. అందువల్ల యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి ఏమాత్రం లక్షణాలున్నా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పక చేసుకోవాలని ఐసీఎంఆర్ చెబుతోంది. అంతేకాదు లక్షణాల్లేకుండా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా, ఆ తర్వాత లక్షణాలు కనిపిస్తే అప్పుడు మళ్లీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కానీ రాష్ట్రంలో చాలామంది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ రాగానే కులాసాగా తిరిగేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితే వైరస్ సామాజిక వ్యాప్తికి దారితీస్తోంది. 70 శాతం యాంటిజెన్ టెస్టులే ఇప్పటివరకు రాష్ట్రంలో 16.67 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,38,395 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొదట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆపై ప్రైవేట్‌లోనూ ఆర్టీ–పీసీఆర్ పరీక్షల ద్వారానే కరోనా నిర్ధారణ జరిగింది. అయితే, ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో భాగంగా శ్వాబ్ నమూనాలు తీయడం, వాటిని భద్రంగా లేబొరేటరీలకు పంపడం ప్రహసనంగా మారింది. చివరకు టెస్ట్ ఫలితం రావడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు పడుతోంది. ఫలితం వచ్చేలోగా బాధితుల్లో వైరస్ ముదిరిపోయి పరిస్థితి తలకిందులయ్యేది. దీంతో రెండు నెలలుగా రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. శ్వాబ్ తీసిన వెంటనే అక్కడికక్కడే పరీక్ష జరగడం, పావుగంట నుంచి అరగంటలోనే ఫలితం రావడంతో బాధితులకు ఊరటనిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చేసిన మొత్తం పరీక్షల్లో 70 శాతం, రోజువారీ పరీక్షల్లో 90 శాతం యాంటిజెన్ పరీక్షలేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారికి తక్షణ చికిత్సకు ఈ టెస్టులు వీలు కల్పించాయి. నెగెటివ్ వచ్చి లక్షణాలున్నవారిపై నిర్లక్ష్యం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 చోట్ల యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి లేకున్నా ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులు కూడా యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నాయి. అయితే నెగెటివ్ వచ్చినా లక్షణాలుంటే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలన్న ఐసీఎంఆర్ నిబంధనను పలుచోట్ల కాలరాస్తున్నారు. కిందిస్థాయిలో వైద్యారోగ్య యంత్రాంగం కూడా ఇది మర్చిపోయింది. బాధితులు కూడా లక్షణాలున్నా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆనందపడిపోతున్నారు. ఇదే కొంపముంచుతోంది. కొందరిలో వైరస్ తీవ్రం కావడంతో పాటు వారి కుటుంబసభ్యులకూ సోకుతోంది. ఉన్నతస్థాయిలోని వ్యక్తులు కూడా యాంటిజెన్ టెస్టుల నెగెటివ్ రిపోర్ట్‌ను పూర్తిగా నమ్మేస్తున్నారు. ఉదాహరణకు ఒక మీటింగ్ ఏర్పాటుకు ముందు అందరికీ యాంటిజెన్ టెస్టులు చేసి నెగెటివ్ వచ్చిన వారందరినీ హాలులోకి అనుమతించారనుకోండి. అలా నెగెటివ్ వచ్చిన వారిలో లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే, వారి వల్ల ఆ మీటింగ్‌లో ఉన్న ఇతరులకూ వైరస్ సోకుతుంది. ఇలా వైరస్ సామాజిక వ్యాప్తికి విస్తరిస్తుందని ఒక వైద్య నిపుణుడు వివరించారు. -
హమ్మయ్య... మా వాళ్లకు నెగెటివ్
న్యూఢిల్లీ: యూఏఈ వెళ్లగానే కరోనా మహమ్మరి ఉచ్చులో విలవిలలాడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఊరటనిచ్చే ఫలితాలొచ్చాయి. కరోనా బారిన పడిన క్రికెటర్లు దీపక్ చహర్, రుతురాజ్ గైక్వాడ్ సహా 13 మందికి తాజా కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చెన్నై సీఈఓ కా శీ విశ్వనాథన్ మంగళవారం వెల్లడించారు. ‘ఔను... వాళ్లందరికీ ఇప్పుడు నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారీ చేసే పరీక్షలో కూడా నెగెటివ్ నిర్ధారణ కావాల్సి వుంటుంది. రెండో దఫా కోవిడ్ పరీక్షల్ని గురువారం చేస్తారు. అందులోనూ బయటపడితే 4వ తేదీ నుంచి నెట్ ప్రాక్టీస్ చేస్తారు’ అని ఆయన చెప్పారు. 20 వేలకుపైగా టెస్టులు... రూ. 10 కోట్ల ఖర్చు! సుమారు రెండు నెలల పాటు యూఏఈలో జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం 20 వేల పైచిలుకు పరీక్షల కోసం బీసీసీఐ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. అక్కడికి బయల్దేరడానికి ముందు చేయించిన పరీక్షలకైతే ఆయా ఫ్రాంచైజీలే భరించాయి. కానీ యూఏఈ చేరాక ఈ బాధ్యత బీసీసీఐది. దీంతో గత నెల 20 నుంచి టెస్టుల కోసం ఆర్టీ–పీసీఆర్ కిట్లు వినియోగిస్తోంది. దీనిపై బోర్డుకు చెందిన ఐపీఎల్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘టెస్టుల కోసం యూఏఈకి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్‌తో ఒప్పందం చేసుకున్నాం. 20 వేలకు పైగా టెస్టులు చేయాల్సిరావచ్చు. ఒక్కో టెస్టు కోసం 200 దిర్హమ్ (రూ.3978) ఖర్చు పెడుతున్నాం’ అని అన్నారు. -
అదే మన బలం
నటి జెనీలియా ఇటీవలే కరోనా బారిన పడ్డారట. కరోనాను జయించారట కూడా. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా చికిత్స సమయంలో రోజులు ఎలా గడిచాయనే విషయం గురించి జెనీలియా మాట్లాడుతూ – ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా సోకింది. దేవుడి దయ వల్ల›ఇవాళే (శుక్రవారం) కరోనా నెగటివ్ అని తేలింది. నాకు లభించిన ఆశ్వీర్వాదాల వల్ల, ప్రేమాభిమానాల వల్లే కరోనా నుంచి త్వరగా కోలుకోగలిగాను. మరో రకంగా చూస్తే ఈ 21రోజులు చాలా కష్టంగా గడిచాయి. పర్సనల్‌గా చాలెంజింగ్‌గా అనిపించిన సమయం ఇది. సినిమాలు చూస్తూ, స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒంటరితనం అనే దెయ్యం దరి చేరకుండా ఉండటం చాలా కష్టం. మళ్లీ నా కుటుంబ సభ్యులు, నా పిల్లలకు దగ్గర కావడం సంతోషంగా ఉంది. మనల్ని ప్రేమించేవాళ్ల చుట్టూ సమయం గడపాలి. అదే మన బలంగా మారుతుంది. అనారోగ్యంగా అనిపిస్తే దయచేసి టెస్ట్ చేయించుకోండి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. ఫిట్‌గా ఉండండి. ఈ రాక్షస వైరస్‌తో మనం పోరాడగలిగే విధానం ఇదే’’ అన్నారు. -
సిక్కి రెడ్డికి ‘నెగెటివ్’
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డికి, బ్యాడ్మింటన్ బృందం ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్‌కు ఊరట లభించింది. ఈనెల 7న గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైన సందర్భంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిబంధనల ప్రకారం శిబిరంతో సంబంధమున్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా పాజిటివ్ రాగా... ఇతరులకు నెగెటివ్ వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన సిక్కి రెడ్డి, కిరణ్‌లో కరోనా లక్షణాలు లేకపోవడంతో శుక్రవారం మళ్లీ స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో శిబిరంతో సంబంధమున్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈసారి సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా ‘నెగెటివ్’ ఫలితం వచ్చింది. -
24 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 64,553 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,007 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 48,040 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 26.88 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 71.17 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.95 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 1,007 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 413 మంది మరణించారు. ఆగస్టు 13 వరకు 2,76,94,416 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం రికార్డు స్థాయిలో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు 10 లక్షల పరీక్షలు చేయడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. మొత్తం 1,433 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. దేశంలో ప్రతి మిలియన్ మందికి రోజుకు 603 మందికి పరీక్షలు జరుగుతుండగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 2,822 మందికి పరీక్షలు చేస్తున్నారు. కోలుకున్న అమిత్‌షా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈనెల 2న ఆయనకు కరోనా పాజిటివ్ రాగా గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిపిన పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘దేవుడికి ధన్యవాదాలు. నేను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నా కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండబోతున్నాను’అని షా వెల్లడించారు. లవ్ అగర్వాల్‌కు కరోనా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌కు కరోనా సోకింది. శుక్రవారం ఈ విషయం ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిపై ఆయన కేంద్రం తరఫున ఏప్రిల్, మే నెలల్లో ప్రతి రోజూ మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌కు వెళుతున్నాను. త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని ఆశిస్తున్నాను’అని లవ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. -
ధోనికి నెగెటివ్
రాంచీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చేసిన కోవిడ్–19 పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఐపీఎల్ తాజా నిబంధనల్లో భాగంగా అతనికి పరీక్ష చేశారు. ఇక్కడి గురునానక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు నగర శివార్లలో ఉన్న ధోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి అతని శాంపిల్స్ సేకరించారు. గురువారం రాత్రికి ఫలితాలు వచ్చాయి. ధోనితో పాటే చెన్నై జట్టులోని సభ్యుడైన మోనూ కుమార్ కూడా కరోనా పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో నెగెటివ్‌గా రావడంతో ధోని నేడు చెన్నైకి వెళ్లి శిక్షణా శిబిరంలో పాల్గొంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే యూఏఈ విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు లేకుండా... ఈ నెల 22న సూపర్ కింగ్స్ టీమ్ యూఏఈకి బయల్దేరనుంది. అయితే ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులెవరినీ తీసుకు వెళ్లరాదని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ‘ప్రస్తుతం టీమ్ సభ్యులు, సహాయక సిబ్బంది మినహా ఎవరూ రారు. లీగ్ సాగుతున్న కొద్దీ మున్ముందు ఏదైనా దశలో దీనిపై పునరాలోచిస్తాం. అవకాశాన్ని బట్టి అప్పుడు కుటుంబ సభ్యులను అనుమతించే విషయం పరిశీలిస్తాం’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. నాయర్ కోలుకున్నాడు కర్ణాటక బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరుణ్ నాయర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. గత నెలలో కోవిడ్–19 బారిన పడిన అతను 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందాడు. చికిత్స అనంతరం ఈ నెల 8న అతనికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా ‘నెగెటివ్’గా తేలాడు. దాంతో నాయర్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ ఫలితంతో అతను యూఏఈ వెళ్లేందుకు అవకాశం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోని ఇతర ఆటగాళ్లలాగే కరుణ్ కూడా మళ్లీ మూడు సార్లు కరోనా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కరుణ్ నాయర్... మూడేళ్ల క్రితం చివరి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
రాజమౌళికి నెగటివ్
ప్రముఖ దర్శకుడు యస్.యస్. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో జూలై 29 నుంచి హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘‘రెండు వారాల హోమ్ క్వారంటైన్ పూర్తయింది. ఈ సందర్భంగా నాకు, నా కుటుంబ సభ్యులకు బుధవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. రెండు వారాల క్వారంటైన్ అనంతరం మాలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదు’’ అని రాజమౌళి పేర్కొన్నారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు తగినంత రోగనిరోధక శక్తి అభివృద్ధికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపారు. -
రాజమౌళికి.. ఆయన ఫ్యామిలీకి కరోనా నెగిటివ్.. కానీ!
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన దర్శక ధీరుడు యస్.యస్ రాజమౌళి.. ఆయన కుటుంబ సభ్యులు కరోనాను జయించారు. ఇటీవల తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినట్లు ఆయనే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్వారంటైన్ ఉన్న ఆయనకు, కుటుంబ సభ్యులకు ఇవాళ(బుధవారం) నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ‘రెండు వారాల క్వారంటైన్ అనంతరం మాలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. తాజాగా నిర్వహించిన పరీక్షలో నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ వచ్చింది’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: రాజమౌళి ఫ్యామిలీకి కరోనా) అయితే ప్లాస్మా దానం కోసం.. తగినంత రోగనిరోధక శక్తి అభివృద్ధికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచించినట్లు ఆయన తెలిపాడు. రెండు వారాల క్రితం తనకు తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయం ఆయనే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘నాకు మా కుటుంబ సభ్యులకు తెలికపాటి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అది తగ్గినప్పటికీ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ తెలింది’’ అంటూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. Completed 2 weeks of quarantine! No symptoms. Tested just for the sake of it... It is negative for all of us... Doctor said we need to wait 3 weeks from now to see if we've developed enough antibodies for plasma donation! — rajamouli ss (@ssrajamouli) August 12, 2020 -
నేను మాటంటే మాటే
‘‘నేను ఏదైనా మాట అంటే ఆ మాట మీద ఉంటాను’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. కరోనా పాజిటివ్‌తో అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్సానంతరం నెగటివ్ రావడంతో అమితాబ్, ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ మాత్రం ఆస్పత్రిలో ఉండిపోయారు. శనివారం రిపోర్ట్‌లో ఆయనకు కూడా నెగటివ్ వచ్చింది. ‘‘ఫ్రెండ్స్.. నేను మీకు ముందే చెప్పాను కదా. కరోనాపై విజయం సాధిస్తానని. నేను మాటంటే మాటే. మీరు (అభిమానులు, శ్రేయోభిలాషులు) చేసిన ప్రార్థనల వల్లే నేను, మా ఫ్యామిలీ కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డాం. మాకు సేవ చేసిన నానావతి ఆస్పత్రి డాక్టర్లకు, అక్కడి నర్సింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అన్నారు అభిషేక్. షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ చిత్రంలోని ‘యూహీ చలా చల్రాహి...’ పాటను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విన్నారట. ‘‘ఆ పాట నాకు స్ఫూర్తినిచ్చింది. ఎంతో నమ్మకం కలిగించింది’’ అని కూడా అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. -
కరోనాను జయించిన అభిషేక్
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని తాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అభిషేక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్! ఈ రోజు మధ్యాహ్నం చేసిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. నేను కరోనాను జయిస్తానని చెప్పినట్టుగానే జయించాను. ఇది మీ ప్రార్థనలతోనే సాధ్యమైంది’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్) ‘‘నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. అంతేగాక నానావతి ఆస్పత్రి డాక్టర్లకు, నర్సులకు నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ అభిషేక్ ట్వీట్ చేశారు. అభిషేక్, అమితాబ్‌లు ఒకేసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరి అనంతరం అభిషేక్ భార్య, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, కూతురు ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. మొదట ఐశ్వర్య, ఆరాధ్య ఆ తర్వాత బిగ్‌బీ కూడా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్‌బీ) -
కరోనా నుంచి కోలుకున్న బిగ్ బి
కరోనా నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షలో కోవిడ్ నెగటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు అమితాబ్. ఈ విషయాన్ని అభిషేక్ తన ట్విట్టర్లో తెలిపారు. ‘నాన్నగారు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇక నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. ఆయనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. నేను ఇంకా కోవిడ్ పాజిటివ్‌గానే ఉన్నాను. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కరోనాను జయించి ఆరోగ్యంగా బయటకు వస్తాను’’ అని అన్నారు అభిషేక్. అమితాబ్ మాట్లాడుతూ –’’ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశాను. దేవుడి దయ, నా ఆప్త మిత్రులు, స్నేహితులు, అభిమానుల ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆసుపత్రిలో వైద్య బృందం సహకారం వల్ల త్వరగా కోలుకోగలిగాను’’ అన్నారు. -
నెగెటివా.. నమ్మలేం!
అతని పేరు జానకీరాం.. హైదరాబాద్‌లో ఉంటారు. ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. జ్వరం, దగ్గు ఉండటంతో ఇటీవల సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడు. అరగంటలో అతనికి నెగెటివ్ అని తేలింది. ఎంతో సంబరపడ్డాడు. అయితే తర్వాత రెండ్రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో ప్రముఖ డయాగ్నస్టిక్ సెంటర్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. అందులో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన జానకీరాం ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌పై గొడవకు దిగాడు. తనకు అక్కడ నెగెటివ్ వస్తే ఇక్కడ ఎందుకు పాజిటివ్ వచ్చిందని తగాదా పెట్టుకున్నాడు. ఇక మరో వ్యక్తి రమేశ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు. అతనికి 102 డిగ్రీల జ్వరం, పొడి దగ్గు ఉండటంతో తక్షణమే డాక్టర్‌ను సంప్రదించగా మెడిసిన్ ఇచ్చారు. అయితే ఒక స్నేహితుడి సలహా మేరకు రమేశ్ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకున్నాడు. నెగెటివ్ అని తేలింది. కానీ అతనికి మాత్రం జ్వరం, పొడి దగ్గు, నీరసం ఉన్నాయి. తనకు నెగిటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులతో కలసిమెలిసి ఉంటున్నాడు. లక్షణాలున్నాయి కదా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోమని చెబితే, తనకు నెగెటివ్ వచ్చింది కదా అని ధీమాగా ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: ఇవీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా నిర్ధారణ పరీక్షలతో గందరగోళం తలెత్తుతోంది. ఇందులో నెగెటివ్ వచ్చినా.. బాధితుడికి కరోనా లేదని ధ్రువీకరించలేని పరిస్థితులుం డటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు ల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే నిర్ధారణ చేస్తారు. అయితే నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 70 శాతంలోపేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. నెగెటివ్ వచ్చిన వారందరికీ తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయాల్సిందేనని నెల క్రితం ప్రకటించిన ఐసీఎంఆర్.. దాదాపు పది రోజుల క్రితం దానికి కీలక సవరణ చేసింది. ‘యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలని, వారికి ఎలాంటి లక్షణాలు లేకుంటేనే దాన్ని నెగెటివ్‌గానే పరిగణించాలని’స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా మార్గదర్శకాలున్నా యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చి, లక్షణాలున్నవారు దర్జాగా బయట తిరుగుతున్నారు. వారి ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో వచ్చే నెగెటివ్ ఫలితాలపై నీలినీడలు అలుముకున్నాయి. 90 శాతం యాంటిజెన్ టెస్టులే... రాష్ట్రంలో మొదట్లో ఆర్టీ–పీసీఆర్ ద్వారానే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు వీటిని నిర్వహిస్తున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో నిర్వహించే ఫలితాల కోసం రెండు, మూడ్రోజుల నుంచి వారం పది రోజుల వరకు నిరీక్షించాల్సి రావడంతో కరోనా వైరస్ తీవ్రత పెరిగి సీరియస్‌గా మారుతుండేది. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకునేందుకే బాధితులు ఎగబడుతున్నారు. ఈ పరీక్ష చేసిన అర గంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రభుత్వం కూడా వీటిని విరివిగా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,100 చోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు పైస్థాయి వరకు ఈ టెస్టులు జరుగుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏకంగా 7 లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించింది. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి మరింత అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 4.16 లక్షల టెస్టులు చేస్తే, అందులో దాదాపు 2 లక్షలు యాంటిజెన్ టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ కూడా ఈ 15 నుంచి 20 రోజుల మధ్య చేసినవేనని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న టెస్టుల్లో 90 శాతం యాంటిజెన్ టెస్టులేనని ఆయన పేర్కొన్నారు. ఆర్టీ–పీసీఆర్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం.. రాష్ట్రంలో కరోనాకు సంబంధించి విరివిగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. మొబైల్ ల్యాబ్‌ల ద్వారా కూడా చేస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ.. నెగిటివ్ వచ్చి లక్షణాలున్న వారికి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలన్న నిబంధనను కింది స్థాయిలో పట్టించుకోవడం లేదు. పైగా దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి లక్షణాలున్నా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవడంలేదు. దీంతో చాలామంది లక్షణాలున్నవారు వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలంటున్నారు. దీనివల్ల కూడా బాధితులు వెనక్కు తగ్గుతున్నారు. -
అది నకిలీ వార్త
‘‘కరోనా పరీక్షల్లో నాకు నెగటివ్ వచ్చిందనే వార్తల్లో నిజం లేదు’’ అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలు కరోనా బారిన పడి, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమితాబ్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని, కోవిడ్ 19 నుంచి ఆయన కోలుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా సంతోషించారు. దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ– ‘‘తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చిందనే వార్త తప్పు.. ఇది బాధ్యతారాహిత్యంతో కూడుకున్న ప్రచారం.. నకిలీ వార్త.. పూర్తిగా అబద్ధం’’ అని ట్వీట్ చేశారు. -
ఆ వార్తలో నిజం లేదు: అమితాబ్ బచ్చన్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందన్న వార్తను ఆయన ఖండించారు. ఇంకా తాను ముంబైలోని నానావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు ట్విటర్లో తెలిపారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న బిగ్‌బీ, తాజా టెస్ట్ రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చినట్లు మీడియాలో వైరల్ అయింది. ఇటువంటి వార్తలు ప్రసారం చేయడం మీడియాకు తగదని హితవు పలికారు. ఇంకా తాను కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నట్లు అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. మీడియాలో ప్రసారమవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని, బాధ్యతారాహిత్యంగా వార్తను ప్రసారం చేయడం సరికాదని ఆయన మీడియాకు సూచించారు. అయితే తమ నటుడు కరోనా నుంచి కోలుకొని ఆయన ఆరోగ్యం కుదటపడాలని అభిమానులు పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. -
ఆర్చర్‌కు నెగెటివ్
మాంచెస్టర్: ‘బయో సెక్యూర్’ నిబంధనలను ఉల్లంఘించి వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టుతో కలిశాడు. మంగళవారం అతడికి నిర్వహించిన రెండో కరోనా టెస్టులోనూ నెగెటివ్ అని తేలడంతో జట్టుతో కలిసేందుకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది. -
కరోనానుంచి కోలుకున్న అఫ్రిది
కరాచీ: కోవిడ్–19 బారినపడిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో ‘నెగెటివ్’గా నిర్ధారణ అయినట్లు అతను వెల్లడించాడు. గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్‌గా తేలాడు. ‘నేను, నా భార్య, అమ్మాయిలు కూడా కోవిడ్–19నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. -
జొకోవిచ్ ‘నెగిటివ్’
బెల్గ్రేడ్: ఇటీవలే కరోనా బారిన పడిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కోలుకున్నాడు. జొకోవిచ్‌తో పాటు అతని భార్య జెలీనా కూడా తాజా పరీక్షల్లో ‘నెగెటివ్’గా తేలారు. ఈ విషయాన్ని అతని మీడియా బృందం గురువారం ప్రకటించింది. ‘బెల్గ్రేడ్లో వీరిద్దరికీ పీసీఆర్ పరీక్ష నిర్వహించగా కోవిడ్–19 ఫలితం నెగెటివ్‌గా వచ్చింది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్ టోర్నీలు నిర్వహించి జొకో విమర్శలపాలయ్యాడు. సరైన జాగ్రత్త చర్యలు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా జొకోవిచ్ ఆధ్వర్యంలో సెర్బియా, క్రొయేషియాలలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న పలువురు క్రీడాకారులు కోవిడ్–19 బారిన పడ్డారు. కరోనా వచ్చినట్లు నిర్ధారణ కావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన జొకోవిచ్ జంట పది రోజుల తర్వాత నిర్వహించిన తాజా పరీక్షల్లో నెగెటివ్‌గా బయటపడ్డారు. -
ఆ ఆరుగురికి నెగెటివ్
లాహోర్: పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్‌తో సహా మొత్తం ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం ప్రకటించింది. దాంతో హఫీజ్, ఫఖర్ జమాన్, వహాబ్ రియాజ్, మొహమ్మద్ హస్నైన్, మొహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్లకు ఇంగ్లండ్ వెళ్లేందుకు పీసీబీ పచ్చ జెండా ఊపింది. త్వరలోనే వీరంతా ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన మిగతా పాక్ జట్టుతో కలుస్తారని పీసీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే స్పిన్నర్ కాశిఫ్ భట్టి, పేసర్లు హరీస్ రవూఫ్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు బ్యాట్స్‌మన్ హైదర్ అలీకి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని స్వీయ నిర్బంధంలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు పీసీబీ పేర్కొంది. -
కరోనా రోగి ఆత్మహత్య : కానీ అంతలోనే
సాక్షి, పట్నా : కరోనా వైరస్ సోకిన వ్యక్తి (38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగి బీహార్‌లోని ప్రభుత్వ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఆవేశం అనర్ధానికి మూలం అన్నట్టుగా.. చనిపోయిన కొద్ది క్షణాలకే అతనికి నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతని బంధువుల తీరని విషాదంలో మునిగిపోయారు. కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ సంజీవ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం బాధిత వ్యక్తి జూన్ 15 న కరోనా అనుమానిత లక్షణాలతో పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరాడు. అనంతరం కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు వ్యాధి నయం కాదనుకున్నాడో, ఏమో కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని డాక్టర్ కుమార్ వెల్లడించారు. బీహార్‌లో కరోనా బారిన పడ్డ రోగి ఆత్మహత్యకు పాల్పడిన మొదటి ఘటన ఇది అని తెలిపారు. కాగా సోమవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చిందని చెప్పారు. -
‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!
వాషింగ్టన్: కరోనా వైరస్ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించాక మూడు రోజులకు పరీక్షలు చేయడం మేలని అధ్యయనం సూచించింది. అధ్యయనంలో భాగంగా తాము 1330 మంది రోగుల నమూనాలను విశ్లేషించామని, ఆసుపత్రిలో చేరిన రోగులతోపాటు పలు వర్గాల వారు ఇందులో ఉన్నారని లారెన్ కౌసిర్కా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ ఫలితాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన సమయం ఆధారంగా తాము పరీక్షల ఫలితం నెగటివ్ వచ్చేందుకు ఉన్న అవకాశాలను లెక్కించామని తెలిపారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతుల్లోని ద్రవాల నమూనాలు సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నదీ నమోదు చేస్తారని ఈ సమాచారం ద్వారా తాము వైరస్ సోకిన తరువాత నాలుగు రోజులకు పరీక్షలు చేస్తే 67 శాతం నెగటివ్ ఫలితాలు రావచ్చునని అంచనా వేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ వైరస్ ఉన్నట్లుగానే భావించి చికిత్స అందించాలని సూచించారు. కరోనా పరీక్షల్లోని ఈ లోటును రోగులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. జూలైలో మోడెర్నా కోవిడ్ టీకా పరీక్షలు కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను జూలైలో భారీగా ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడనున్నట్లు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా ప్రకటించాయి. జూలైలో 30 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి చూస్తామని, ఇందుకు అవసరమైన డోసులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచామని తెలిపాయి. పెద్దల్లో ఎలా పనిచేస్తుందో చూడటమే కీలకమైన ఈ ప్రయోగ ఉద్దేశం. మార్చిలో 45 మంది వలంటీర్లపై ప్రారంభ ప్రయోగం ఫలితాలు అందాల్సి ఉంది. -
మరో పదివేల కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మరింత విజృంభిస్తోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ సగటున 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 2.6 లక్షల కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొన్ని ఆంక్షల మధ్య మాల్స్, ప్రార్థనా మందిరాలు ప్రారంభించడంతో రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయనే ఆందోళనలున్నాయి. దేశంలో కొత్తగా ఒకే రోజు 9,987 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 2,66,598కి చేరుకుంది. మరోవైపు మృతుల సంఖ్య పెరిగింది. గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ సగటున 250 మంది వరకు మరణిస్తున్నారు. ఒకే రోజు మరో 266 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. ఈ మధ్య కాలంలో హరియాణా, జమ్మూకశ్మీర్, అస్సాం, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక కేసుల రికవరీ శాతం నిలకడగా కొనసాగుతోంది. 48.47 శాతం రికవరీ రేటుగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. కేజ్రీవాల్ గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతూ ఆదివారం నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని నిర్ధారణ అయిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇప్పుడే కేజ్రివాల్‌కు జ్వరం తగ్గుతోందని, ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీలో జూలై 31కి 5.5 లక్షల కేసులు! ఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని కేంద్రానికి చెందిన అధికారులు అంచనా వేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. జూలై ఆఖరినాటికి 80 వేల పడకలు అవసరం పడతాయని∙చెప్పారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత సిసోడియా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సామూహిక వ్యాప్తి లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంచనాకొచ్చినట్టు తెలిపారు. జూన్ 30 నాటికి లక్ష కేసులు నమోదవుతాయని, కేసులు రెట్టింపయ్యే తీరుని చూస్తే జూలై 31 నాటికి 5.5లక్షలకేసులు నమోదయ్యే చాన్సుందన్నారు. రానున్న రోజులలో 12–13 రోజులకు కేసుల డబ్లింగ్ జరిగితే పడకలకు కొరత ఏర్పడుతుందని, ఢిల్లీవాసులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. జ్యోతిరాదిత్య, మాధవిరాజెలకు పాజిటివ్ బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజె సింధియాలకు కరోనా వైరస్ సోకింది. దక్షిణ ఢిల్లీ సాకేత్ ప్రాంతంలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వారిద్దరికీ చికిత్స చేస్తున్నారు. ఇటీవల జ్యోతిరాదిత్యకు కోవిడ్ లక్షణాలు బయటపడడంతో సోమవారం మాక్స్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న జ్యోతిరాదిత్యకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జ్యోతిరాదిత్య తల్లి మాధవి రాజె సింధియాకు లక్షణాలేవీ లేకపోయినా ఆమెకు పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చింది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ‘మాతాజీ, జ్యోతిరాదిత్య అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని చౌహాన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. -
పరీక్షలకే పరీక్ష!
ముంబై/వాషింగ్టన్: ఆమె పేరు వందన షా. ముంబైలో ప్రముఖ న్యాయవాది. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండడంతో ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెని క్వారంటైన్ చేశారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం పరీక్షలు చేస్తే ఆమెకి నెగిటివ్ అని తేలింది. ఈ మధ్యలో ఆమె అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముంబ్రాలో నివసించే సమీర్ ఖాన్ అనే వ్యక్తి వేరే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. అదే రోజు థానె మునిసిపల్ కార్పొరేషన్ పరీక్షలో (టీఎంసీ) నెగిటివ్ వచ్చింది. ఈ సమస్య కేవలం వీరిద్దరిదే కాదు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్స్‌లో ఇదే పరిస్థితి. నోయిడాలో ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కూడా ఇలా ఫాల్స్ పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇలా 19 మంది కోవిడ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. అక్కడ పరీక్షలు చేస్తే వారికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారినందరినీ శనివారమే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. అమెరికాలో ఫాల్స్ నెగిటివ్ సమస్య దక్షిణకొరియా, రష్యా వంటి దేశాల్లో ఫాల్స్ పాజిటివ్ ఫలితాలు వస్తే, అగ్రరాజ్యం అమెరికాలో దానికి విరుద్ధంగా ఫాల్స్ నెగిటివ్ వస్తున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకి ఉంటుంది కానీ, పరీక్షల్లో బయటపడదు. నెగిటివ్ వచ్చింది కదాని హాయిగా తిరిగేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి మరికొందరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఇలా 15% మందికి ఫాల్స్ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. సమస్యలివీ.. ► కోవిడ్–19 ఫాల్స్ పాజిటివ్ రావడం వల్ల ప్రభుత్వాలపై భారం పడుతోంది. వారిని క్వారంటైన్ చేయడం, వారు ఎవరెవరినీ కలిశారో వెతికి పట్టుకోవడం, మళ్లీ వారికి పరీక్షలు ఇదంతా ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపుతోంది. ► మహారాష్ట్ర ప్రైవేటు ల్యాబ్స్‌లో ఫాల్స్ పాజిటివ్ వస్తూ ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువై పో యి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నిజమైన రోగులకు చికిత్స ఆలస్యం కూడా అవుతోంది. ► కరోనాపై చాలా భయాందోళనలు నెలకొన్నా యి. ఫాల్స్ పాజిటివ్ రావడం వల్ల సున్నిత మనస్కులు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ► ఫాల్స్ నెగిటివ్ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ప్రపంచదేశాల్లో సగటున 29% వరకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. వారిలో వైరస్ ఉంటుంది కానీ లేదని నిర్ధారణ కావడంతో క్వారంటైన్ చేయరు. దీంతో వాళ్ల ద్వారా చాలా మందికి సంక్రమిస్తోంది. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడానికి ఫాల్స్ నెగిటివ్ కూడా కారణమే. ► ఏ లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. తప్పుడు ఫలితం ఏదైనా ప్రభుత్వంపైనా, ప్రజలపైనా భారాన్ని మోపుతోంది. అందుకే అవసరమైతేనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కారణాలివీ.. ► కరోనా అనుమానితుడి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు అత్యంత జాగ్రత్తగా పంపించాలి. అలా పంపే క్రమంలో ఆ బాటిల్ విరిగినా, ఇతర శాంపిల్స్‌తో కలిసిపోయినా, కలుషితమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ► కరోనా కిట్స్‌లో లోపాలు కూడా తప్పుడు ఫలితాలకు కారణమవుతున్నాయి. రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ ఫలితాల్లో తేడా 15–20% ఉంటోంది. ఇది చాలా ఎక్కువని వైద్య నిపుణుల భావన. ► మానవ తప్పిదం కూడా మరో కారణమే. పరీక్షలు చేసినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా లేకపోయినా, వారిలో నైపుణ్యం కొరవడినా ఫలితాలు తప్పుగా వెలువడే అవకాశాలున్నాయి. ► శాంపిల్స్ తీసుకునే సమయం కూడా ఒక్కోసారి ఫలితాల్ని గందరగోళంలో పడేస్తుంది. వైరస్ మన శరీరంలో ప్రవేశించిన వెంటనే పరీక్షలు చేస్తే 50శాతం మందికి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి పరీక్ష చేస్తే పాజిటివ్ వస్తుంది. శస్త్రచికిత్స కోసమో, మరేదైనా బాధతోనో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేవారికి విధిగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తూ ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేస్తే నెగిటివ్ వస్తోంది. దీంతో అసలైన రోగులకు చికిత్స ఆలస్యమవుతోంది. వ్యాధిలేని వారు కూడా ఆస్పత్రిలో చేరడం వారికి కూడా ప్రమాదమే –విజయ్ సింఘాల్, థానే మున్సిపల్ కమిషనర్ -
అందరికీ నెగటివ్... ఆల్ హ్యాపీ
కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని తెలిపారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్. ఇటీవల బోనీకపూర్ ఇంటి సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో బోనీ అండ్ ఫ్యామిలీ 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఈ క్వారంటైన్ పీరియడ్ ముగిసిందని తెలిపారు బోనీకపూర్. ‘‘మా 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తయింది. కరోనా బారిన పడి, ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఇంటి సిబ్బందిలో ఉన్న ముగ్గురికి కూడా ఇప్పుడు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. అలాగే నేను, నా కుమార్తెలు (జాన్వీకపూర్, ఖుషీకపూర్) పరీక్ష చేయించుకుంటే నెగటివ్ వచ్చింది. ఇతర సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికీ నెగటివ్ వచ్చింది. ఆల్ హ్యాపీ. ఇక మా డైలీ లైఫ్‌ను ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే కరోనా సోకి క్వారంటైన్లో ఉన్నవారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలి. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న డాక్టర్స్, ఇతర హెల్త్‌కేర్ వర్కర్స్, ముంబై పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు బోనీకపూర్. -
కరోనా నుంచి బయటపడ్డ కనికా కపూర్
-
కోవిడ్: వారిలో 89 మందికి నెగిటివ్
సాక్షి, కాకినాడ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్–19’ మహమ్మారి జిల్లా అధికారుల పర్యవేక్షణ, వైద్యుల కృషి ఫలితంగా జిల్లాలో క్రమేపీ తన ఉనికిని కోల్పోతోంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడ వైరస్ అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడం, నమూనాలు సేకరించడం పాజిటివ్‌గా తేలితే వారిని ప్రత్యేక ఐసొలేషన్ గదిలో పెట్టి వైద్యం చేయడం సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన లండన్ యువకుడికి తొలిసారిగా జిల్లాలో పాజిటివ్ కేసుగా నమోదవడంతో యంత్రాంగంలో మరింత స్ఫూర్తిని నింపింది. (ప్రధాన మంత్రి విరాళాలు కొల్లగొట్టడానికి.. ) ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 89 మందికి నెగిటివ్ మతపరమైన ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో కాంటాక్టయిన 163 మందిని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీలోని నిజామొద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో కలిసిన వారుగా వైద్యులు వీరిని నిర్ధారించారు. వీరిలో 89 మందికి నెగిటివ్ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఇంకా నలుగురు మాత్రమే క్వారంటైన్లో ఉన్నారు. వీరికి కూడా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యలు స్పష్టం చేస్తున్నారు. బొమ్మూరు క్వారంటైన్లో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నవారితోపాటు, మూడు రోజుల కిందట కరోనా నెగిటివ్ వచ్చిన వారికి చేతిపై స్టాంప్ వేసి హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సరిత తెలిపారు.(పోర్టబుల్ వెంటిలేటర్) ప్రత్యేక పర్యవేక్షణ కరోనా నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కోవిడ్–19 వైరస్ అనుమానిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కలి్పంచారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 5000 ఐసోలేషన్ పడకలు, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 15,000 సామర్థ్యం కలిగిన క్వారంటైన్లను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిపై సర్వే జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి డేటా స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన జాబితాలతోపాటు వలంటీర్లు, ఆశ, ఏఎన్ఎంల సర్వేలలో గుర్తించిన ప్రకారం 3,441 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరిలో ఢిల్లీ నిజామొద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన వారు 33 మందిగా గుర్తించారు. వీరిని క్వారంటైన్లకు తరలించారు. రోజుకు సగటున 90 నమూనాల పరీశీలన జిల్లాలో ప్రతి రోజూ సగటును ‘కోవిడ్–19’ అనుమానితులకు సంబంధించిన 90 నమూనాలు సేకరిస్తున్నారు. అందులో 70 వరకు నెగిటివ్‌గా నిర్ధారణవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం వరకు 267 నమూనాలు పరీక్షించగా..9 పాజిటివ్ (శుక్రవారం ఒకరు డిశ్చార్జి), 23 ఫలితాలు తేలాల్సి ఉంది. అంటే 10 శాతానికి తక్కువే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి -
కరోనా వైరస్: వారంతా సేఫ్
సాక్షి, తిరుపతి: దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన వారు.. వారికి తెలియకనే కరోనాను మోసుకొచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 46 మంది ఢిల్లీలో గత నెలలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొనేందుకు వెళ్లారు. వారంతా ఇటీవలే జిల్లాకు చేరుకున్నారు. అయితే వారికి కరోనా సోకింది అనే విషయం తెలియక యథావిధిగా జన సంచారంలో కలిసిపోయి తిరిగారు. తెలంగాణలో రెండు రోజుల క్రితం జరిగిన మరణాలతో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకిందని తెలుసుకుని అధికార యంత్రాంగంతో పాటు ఆ మతస్తులు షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించారు. (యువకులపై పంజా) వారి రక్త నమూనాలను పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. పలమనేరుకు చెందిన ఇద్దరు, గంగవరానికి చెందిన ఒకరు, శ్రీకాళహస్తి, ఏర్పేడుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఒకేసారి ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మరి కొందరు జిల్లాకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన క్వారంటైన్లో ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో మరి కొందరి వైద్య పరీక్షల నివేదిక రావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. (టిక్‌టాక్ భారీ విరాళం) వారంతా సేఫ్ ఢిల్లీ నుంచి వచ్చిన వారు మినహా... విదేశాల నుంచి వచ్చిన స్థానికులంతా సేఫ్ జోన్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు ఇటీవల లండన్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అతనికి పాజిటివ్ నమోదు కావడంతో అతన్ని తిరుపతిలోని పాత ప్రసూతి ఆస్పత్రిలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వారి బంధువులందరిని శ్రీపద్మావతి నిలయంలో ఉంచారు. వారందరికీ నెగటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే. అయినా వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరిని హోం క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.(మద్యం..మంట) -
ఇండోనేషియన్ల సహాయకులకు కరోనా నెగెటివ్
సాక్షి, కరీంనగర్: ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన పది మంది మత ప్రచారకుల బృందానికి సాయం చేసిన ఇద్దరికి కరోనా నెగెటివ్ వచ్చిందని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఇండోనేషియా బృందంతో రామగుండం ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేయించిన వ్యక్తి, ఇండోనేషియా బృందంతో కలిసి ఎస్–9 బోగీలో ప్రయాణించి రామగుండంలో దిగిన మరో వ్యక్తిని తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కూడా కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు వారిని ఇళ్లకు పంపించారు. ఈనెల 16న కరోనా లక్షణాలున్న ఇండోనేషియా బృందాన్ని కరీంనగర్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారితో ప్రయాణించి రామగుండంలో దిగిన వ్యక్తి ఆటోలో ఇంటికి వెళ్లాడు. దీంతో ఆటో డ్రైవర్‌తోపాటు, ప్రార్థనలు చేయించిన వ్యక్తిని అనుమానితులుగా ఈనెల 17 నుంచి సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. రెండు దఫాలుగా వారికి పరీక్షలు చేసి కరోనా సోకలేదని నిర్ధారించారు. -
అన్ని నెగటివ్‌గా నిర్ధారణ
-
ట్రంప్‌కి కరోనా నెగెటివ్
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ ఉధృతరూపం దాలుస్తున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వైద్య పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైట్ హౌస్ ఊపిరి పీల్చుకుంది. ఫ్లోరిడాలో గత వారం ట్రంప్‌ని కలుసుకున్న బ్రెజిల్ కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోకు కరోనా సోకడంతో ట్రంప్‌కి కూడా ఈ మహమ్మారి సోకుతుందా అన్న సందేహాలు చుట్టుముట్టాయి. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సియాన్ కోన్లీ ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అమెరికా మరిన్ని చర్యలు చేపట్టింది. బ్రిటన్, ఐర్లాండ్ ప్రయాణాలపై నిషేధం విధించింది. ఇప్పటికే అగ్రరాజ్యంలో 2,100 కేసులు నమోదు కాగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ట్రంప్‌నకు కరోనా టెస్ట్ : రిపోర్ట్‌లో తేలిందిదే..
వాషింగ్టన్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ సోకినట్టు తేలిన బ్రెజిల్ ప్రతినిధి బృందం తన ఫ్లోరిడా రిసార్ట్‌కు వచ్చిన సందర్భంలో వారితో ట్రంప్ సన్నిహితంగా మెలగడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ట్రంప్‌నకు నిర్వహించిన టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అధ్యక్షుడి వైద్యులు సీన్ కోన్లీ తెలిపారు. బ్రెజిల్ బృందంతో డిన్నర్లో పాల్గొన్న వారం రోజుల అనంతరం ట్రంప్‌నకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ఆయన చెప్పారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ అమెరికాలో ఇప్పటికే 51 మంది మరణించగా దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండగా..స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. చదవండి : కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ -
ఫెర్గూసన్‌కు కరోనా లేదు...
సిడ్నీ: న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్‌కు కరోనా లేదని తేలింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలి వన్డే అనంతరం తనకు గొంతు నొప్పి ఉందని ఫెర్గూసన్ చెప్పడంతో అతడికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో కరోనా లేదని తేలడంతో అతడు న్యూజిలాండ్ వెళ్లడానికి మార్గం సుగమం అయింది. -
రిచర్డ్సన్కు కరోనా లేదు
కరోనా అనుమానంతో కివీస్‌తో తొలి వన్డేకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్కు ప్రమాదం ఏమీ లేదని తేలింది. ఉదయం అతనికి జరిపిన పరీక్షల్లో ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చింది. తొలి వన్డేకు ముందు రిచర్డ్సన్ గొంతు నొప్పితో బాధపడ్డాడు. అతడిని పరిశీలించి వైద్య బృందం సూచన మేరకు జట్టు నుంచి తప్పించి విడిగా ఉంచారు. ఇటీవలే అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో సందేహం పెరిగింది. దాంతో మ్యాచ్‌లో ఆడనివ్వకుండా వైద్య పరీక్షలకు పంపారు.