కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. 2 సార్లు నెగెటివ్‌ | Alaya F Recovered From Covid 19 Reveals Two Times Negative | Sakshi
Sakshi News home page

Alaya F: కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. 2 సార్లు నెగెటివ్‌

Published Mon, Jan 3 2022 8:36 PM | Last Updated on Tue, Jan 4 2022 12:41 PM

Alaya F Recovered From Covid 19 Reveals Two Times Negative - Sakshi

Alaya F Recovered From Covid 19 Reveals Two Times Negative: భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికిని చాటుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్‌, కరీనా కపూర్‌, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే బీటౌన్‌లో ప్రముఖులు కరోనా చేతులకి చిక్కగా బాలీవుడ్‌ బ్యూటీ అలయ ఎఫ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 

అలయ తన ఇన్‌స్టా స్టోరీలో అందరికీ నమస్కారం. 'నేను ఒక వారం క్రితం కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. అప్పుడు నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. నా చుట్టూ ఉన్న వారిలో కూడా లేవు. కాకపోతే నేను చాలా చోట్లకు ఎక్కువగా ప్రయాణిస్తాను కాబట్టి కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌ అని తెలిసాక ఐసోలేట్‌ అయ్యాను. ఆరోగ్యం బాగా ఉందని నాకు అనిపించాక డిసెంబర్‌ 30, జనవరి 1న రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకున్నాను. రెండుసార్లు నెగెటివ్‌ అని వచ్చింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నేను సంప్రదింపులు జరుపుతున్నాను. మాస్క్‌ ధరించి సురక్షితంగా ఉండండి.' అని పేర్కొంది. 

బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా, పూజా బేడి కుమార్తె అయిన అలయ 2020 లో 'జవానీ జనేమాన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇదీ చదవండి:  ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్‌.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement