పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్‌గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.
‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్‌లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్‌లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.
ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.
స్వేచ్ఛ ఉంటుంది
‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్‌కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.
ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ
పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.
రీల్స్‌తో మొదలుపెట్టి...
వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్‌తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్‌గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల.
అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి.
(చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!)
Comments
Please login to add a commentAdd a comment