ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ బాల సతీష్ ‘నెగటివ్’ అనే సినిమా తీశారు. ఈ నెగటివ్ ఫిల్మ్ చాయ్ బిస్కెట్ యూ ట్యూబ్ చానెల్‌లో ప్రసారం అవుతోంది. విక్రమ్ శివ, శ్వేతా వర్మ(బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్), దయానంద్ రెడ్డి ప్రధాన తారాణంగా రూపొందిన చిత్రం ఇది. ‘నెగటివ్’కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని బాల సతీష్ అన్నారు.
ఈ చిత్రం గురించి సతీష్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితులతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కోవిడ్ విషయంలో నెగటివ్ అనేది పాజిటివ్‌గా మారిపోయింది. అందుకే ‘నెగటివ్’ టైటిల్ పెట్టి ఈ ఫిల్మ్ తీశాను. బ్రెజిల్ ఇంటర్‌నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఓ నామినీగా ‘నెగటివ్’ ఎంపికైంది. ప్రెగ్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోషిస్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫైనలిస్టు జాబితాలో నా ‘నెగటివ్’ ఫిల్మ్ ఉంది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ సెమీ ఫైనలిస్టు లిస్టులో నిలిచింది. నా కథలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయగలగడమే నా బలమని నమ్ముతున్నాను. అందుకే సమకాలీన అంశాలనే నా కథాంశాలుగా ఎంచుకుంటుంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment