చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు... పోతుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే తమ మార్క్ ట్రెండ్ క్రియోట్ చేసి, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటి వారిలో యంగ్ డైరెక్టర్ బాల సతీష్ ఒకరు. షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా వెండితెరకు పరిచయమైన సతీష్.. అనేక తమిళ డబ్బింగ్ సినిమాలకు స్క్రిప్ట్ అసోసియేట్‌గా పనిచేశాడు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నెగటివ్’. విక్రమ్ శివ, ‘బిగ్‌బాస్’ ఫేమ్ శ్వేత వర్మ హీరో హీరోయిన్లుగా నటించగా, డైరెక్టర్ కమ్ యాక్టర్ దయానంద్ రెడ్డి ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. ఫిలోమినా ఇన్ఫోటైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఎఎమ్. రాజేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ విజయపథంలో దూసుకెళ్తుంది.
తాజాగా ఈ చిత్రం అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కలకారి ఫిల్మ్ ఫెస్టివల్, ది లిఫ్ట్-ఆఫ్ సెషన్స్ ఆన్‌లైన్ & ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిఫ్ట్-ఆఫ్ గ్లోబల్ నెట్‌వర్క్, ఫిలమ్ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. వీటితో పాటు ఇప్పటికే.. ప్రాగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోసిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ మరియు బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. అలాగే యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో సెమి ఫైనలిస్ట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment