![Actress Trisha Tested Negative After Coronavirus Positive - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/12/trisha.jpg.webp?itok=11mCrQ5X)
ప్రముఖ హీరోయిన్ త్రిష ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో ‘ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022’ అంటూ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసింది. అయితే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష.. తాను మాత్రం సంతోషంగా లేనంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. అయితే ఇటీవల తనకు కరోనా వచ్చిన విషయాన్ని చెబుతూ పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
చదవండి: ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తున్నానంటూ ట్వీట్..
‘అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పే కొన్ని క్షణాల ముందు ఈ మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకున్నాయి. నాకు ఆ వారం చాలా బాధ కలిగించింది. ప్రస్తుతానికి నేను కోలుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్తా ఆందోళనలో ఉన్నారు. వారందరికి తిపి కబురు చెప్పేందుకు సోషల్ మీడియాకు వచ్చిన త్రిష ‘నెగిటివ్’ అనే పదం చదివినప్పటికీ సంతోషంగా లేనంటూ.. కరోనానను జయించినట్లు చెప్పింది. తాజా టెస్ట్‌లో తనకు నెగిటివ్ వచ్చినట్లు త్రిష వెల్లడించింది.
చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్
ఈ సందర్భంగా తనపై అభిమానులు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు త్వరగా కోలుకోవాలని తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి త్రిష కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో చివరిగా ‘నాయకి’లో కనిపించిన త్రిష ప్రస్తుతం తమిళంలో నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. అక్కడ లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేస్తూ అగ్ర నటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రాజెక్ట్‌తో పాటు మోహన్ లాల్‌తో ‘రామ్’, ‘రాంగి’ అనే మరో చిత్రంలో త్రిష నటిస్తోంది.
Never been happier to read the word “negative” on a report🤪
— Trish (@trishtrashers) January 12, 2022
Thank u all for your love and prayers❤️
Now I’m ready for you 2022🌟 pic.twitter.com/3Cbn9QAXi0
Comments
Please login to add a commentAdd a comment