Bala Satish
-
బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్
ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ బాల సతీష్ ‘నెగటివ్’ అనే సినిమా తీశారు. ఈ నెగటివ్ ఫిల్మ్ చాయ్ బిస్కెట్ యూ ట్యూబ్ చానెల్లో ప్రసారం అవుతోంది. విక్రమ్ శివ, శ్వేతా వర్మ(బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్), దయానంద్ రెడ్డి ప్రధాన తారాణంగా రూపొందిన చిత్రం ఇది. ‘నెగటివ్’కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని బాల సతీష్ అన్నారు. ఈ చిత్రం గురించి సతీష్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితులతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కోవిడ్ విషయంలో నెగటివ్ అనేది పాజిటివ్‌గా మారిపోయింది. అందుకే ‘నెగటివ్’ టైటిల్ పెట్టి ఈ ఫిల్మ్ తీశాను. బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఓ నామినీగా ‘నెగటివ్’ ఎంపికైంది. ప్రెగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోషిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫైనలిస్టు జాబితాలో నా ‘నెగటివ్’ ఫిల్మ్ ఉంది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ సెమీ ఫైనలిస్టు లిస్టులో నిలిచింది. నా కథలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయగలగడమే నా బలమని నమ్ముతున్నాను. అందుకే సమకాలీన అంశాలనే నా కథాంశాలుగా ఎంచుకుంటుంటాను’’ అన్నారు. -
బాల సతీష్ ‘నెగటివ్’ మూవీకి అవార్డుల వెల్లువ!
చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు... పోతుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే తమ మార్క్ ట్రెండ్ క్రియోట్ చేసి, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటి వారిలో యంగ్ డైరెక్టర్ బాల సతీష్ ఒకరు. షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా వెండితెరకు పరిచయమైన సతీష్.. అనేక తమిళ డబ్బింగ్ సినిమాలకు స్క్రిప్ట్ అసోసియేట్‌గా పనిచేశాడు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నెగటివ్’. విక్రమ్ శివ, ‘బిగ్‌బాస్’ ఫేమ్ శ్వేత వర్మ హీరో హీరోయిన్లుగా నటించగా, డైరెక్టర్ కమ్ యాక్టర్ దయానంద్ రెడ్డి ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ఫిలోమినా ఇన్ఫోటైన్మెంట్స్ బ్యానర్ మీద ఎఎమ్. రాజేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ విజయపథంలో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కలకారి ఫిల్మ్ ఫెస్టివల్, ది లిఫ్ట్-ఆఫ్ సెషన్స్ ఆన్లైన్ & ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిఫ్ట్-ఆఫ్ గ్లోబల్ నెట్వర్క్, ఫిలమ్ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది. వీటితో పాటు ఇప్పటికే.. ప్రాగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోసిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ మరియు బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడింది. అలాగే యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో సెమి ఫైనలిస్ట్‌గా నిలిచింది. -
మాటలతో మెప్పించాడు..!
గతంలో సినిమా అంటే హీరో, విలన్, హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకులకు సినిమా మేకింగ్ మీద అవగాహన పెరిగింది. తెర మీదే కాదు. తెర వెనుక ఉన్న వారి గురించి కూడా తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. దాసరి లాంటి వారు దర్శకుడికి స్టార్ ఇమేజ్ తీసుకువస్తే.. పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి మాధవ్ బుర్రా వంటి వారు మాటల రచయితలను కూడా స్టార్ కేటగిరిలో చేర్చారు. దీంతో ఎంతో మంది కళాకారులు మాటల రచయితలుగా సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు. అదే బాటలో షాలిని సినిమాతో మాటల రచయితగా ఆకట్టుకున్నారు బాలా సతీష్. చిన్న సినిమాగా విడుదలైన షాలిని చిత్రానికి తన గురువు భాషా శ్రీతో కలిసి మాటలు రాసిన సతీష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలా సతీష్.., పరుచూరి గోపాల కృష్ణ దగ్గర స్క్రీన్ ప్లే రైటింగ్ లోనూ శిక్షణ తీసుకున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నందికొండ వాగుల్లోనా సినిమాతో మరోసారి రచయితగా తన పెన్ను పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ యువ రచయిత.