మాటలతో మెప్పించాడు..!
గతంలో సినిమా అంటే హీరో, విలన్, హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకులకు సినిమా మేకింగ్ మీద అవగాహన పెరిగింది. తెర మీదే కాదు. తెర వెనుక ఉన్న వారి గురించి కూడా తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. దాసరి లాంటి వారు దర్శకుడికి స్టార్ ఇమేజ్ తీసుకువస్తే.. పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి మాధవ్ బుర్రా వంటి వారు మాటల రచయితలను కూడా స్టార్ కేటగిరిలో చేర్చారు.
దీంతో ఎంతో మంది కళాకారులు మాటల రచయితలుగా సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు. అదే బాటలో షాలిని సినిమాతో మాటల రచయితగా ఆకట్టుకున్నారు బాలా సతీష్. చిన్న సినిమాగా విడుదలైన షాలిని చిత్రానికి తన గురువు భాషా శ్రీతో కలిసి మాటలు రాసిన సతీష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలా సతీష్.., పరుచూరి గోపాల కృష్ణ దగ్గర స్క్రీన్ ప్లే రైటింగ్ లోనూ శిక్షణ తీసుకున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నందికొండ వాగుల్లోనా సినిమాతో మరోసారి రచయితగా తన పెన్ను పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ యువ రచయిత.