dialogue writer
-
సినీ రచయిత కన్నుమూత.. విజయ్ సేతుపతి సినిమాతో..
తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మాటల రచయిత రాశితంగదురై (53) సోమవారం ఉదయం కన్ను మూశారు. వివరాలు.. ఆండిపట్టి సమీపంలోని కధిర్ నరసింగపురానికి చెందిన రాశితంగదురై చదువు పాఠశాల దశలోనే ఆగి పోయింది. అయితే కథలు, కవితలు రాయడంపై మక్కువ చూపిస్తూ రెండు వందలకు పైగా కథలు రాశారు. అలా సినీ రంగానికి మాటల రచయితగా పరిచయమయ్యారు. నటుడు విజయ్ సేతుపతి నిర్మించిన మేర్కు తొడర్చిమలై చిత్రానికి మాటలు రాయడంతో పాటు చిన్న పాత్రను సైతం పోషించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. తరువాత తేన్ అనే చిత్రానికి సంభాషణలు అందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు కేవీ, తాక్కల్, ఆధారం తదితర చిత్రాలకు రాశి తంగదురై మాటలను రాశారు. మరో నాలుగైదు చిత్రాలకు కమిట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య మురుగేశ్వరి, కుమారులు రాశి ప్రియన్, సుఖదేవ్ దిలీపన్ ఉన్నారు. రాశి తంగదురై మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఆ సినిమాలో ఛాన్స్ కోసం బికినీ ఫోటోలు పంపితే డైరెక్టర్ ఏం చేశాడంటే: కస్తూరి -
సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు
నంది అవార్డు గ్రహీత, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సత్యానంద్ తన సినీ ప్రస్థానం ప్రారంభించి 50 పూర్తయిన సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సేవలను కొనియాడుతూ ఫోటోలు పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్విటర్లో రాస్తూ..' ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా ఉంటూ.. ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్ గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీ విద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.' అని రాసుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) అంతే కాకుండా..' ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను. మోర్ పవర్ టూ యూ' అంటూ ప్రశంసలు కురిపించారు. ట్వీట్‌తో పవన్ కల్యాణ్, నాగబాబుతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన సత్యానంద్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది అగ్ర నటులతో పనిచేశారు. చిరంజీవి, శివాజీ గణేశన్, నందమూరి తారక రామారావు, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ సినిమాలకు సేవలందించారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి (1976), అర్ధాంగి (1977), అమెరికా అల్లుడు(1985), క్షణ క్షణం(1991), అన్నయ్య(2000) లాంటి మరెన్నో చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు. (ఇది చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే) అంతే కాకుండా మోసగాడు(1980), గూండా (1984), యముడికి మొగుడు (1988), పెళ్లాం ఊరెళ్లితే (2003), సుభాష్ చంద్రబోస్ (2005) చిత్రాలకు సత్యానంద్ స్క్రిప్ట్‌లు రాశారు. సముద్రం(1999), ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి(2004), నచ్చావులే (2008), రారండోయ్ వేడుక చూద్దాం(2017) చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2 — Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023 -
తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా' ) మనోజ్ ముంతశిర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. (ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి) View this post on Instagram A post shared by Manoj Muntashir Shukla (@manojmuntashir) -
‘ఆదిపురుష్’కు దెబ్బ మీద దెబ్బ.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు!
‘ఆదిపురుష్’ సినిమా మొదలెట్టినప్పుడు ఆ చిత్రానికి ఎంత హైప్ వచ్చిందో ప్రస్తుతం అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి వేషధారణ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇన్ని వివాదాల నడుమ ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక భక్తుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్’ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవైపు భారీగా కలెక్షన్లను రాబడుతున్నా అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడుతూ.. ‘హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వివాదాల నడుమ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆదిపురుష్ చిత్రానికి మరింత మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు. “बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” -@manojmuntashir तुम मूर्ख हो मनोज, मौन हो जाओ अभी भी समय है। pic.twitter.com/PSqLXpJ04q — BALA (@erbmjha) June 19, 2023 చదవండి: Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా? -
నాపై అసభ్యకరమైన పదాలు వాడారు: ఆదిపురుష్ రైటర్ భావోద్వేగం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిలిం 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇంకా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌పైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా డైలాగ్స్‌పై వస్తున్న విమర్శలపై ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా స్పందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తానని.. వారిని బాధపెట్టేలా ఉన్న డైలాగులను తొలగిస్తామని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్లో రాస్తూ.. 'ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని గౌరవించడం రామాయణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం. ఆదిపురుష్ కోసం చాలా డైలాగ్స్ రాశాను. కానీ కొన్నింటి దగ్గర సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. నేను సీత, రాముని కోసం రాసిన డైలాగ్స్‌కు ప్రశంసలు దక్కలేదు. నా సొంత సోదరులే సోషల్ మీడియాలో నాపై, నా తల్లిపై అసభ్యకరమైన పదాలు వాడారు. ప్రతి తల్లిని తన తల్లిగా భావించే శ్రీరాముడిని చూసిన సోదరులకు హఠాత్తుగా ఎందుకంత కోపం వచ్చింది. కానీ నాపై సనాతన ద్రోహి అనే ముద్ర వేసేందుకు మీరు ఎందుకు తొందరపడ్డారో తెలియడం లేదు. మేము సనాతన సేవ కోసమే ఆదిపురుష్‌ని సృష్టించాం. నా డైలాగ్స్‌కు నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను. కానీ ఇది మీ బాధను తగ్గించలేదు. కొన్ని డైలాగులు మిమ్మల్ని బాధపెట్టాయని గ్రహించిన నేను.. సినిమా నిర్మాత, దర్శకుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకున్నా. ఈ వారంలోనే అభ్యంతరకరంగా ఉన్న డైలాగ్స్‌లో మార్పులు చేస్తాం' అని పేర్కొన్నారు. रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना. सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है. आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं. उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान… — Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023 -
మేము తీసింది రామాయణం కాదు. . ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై ఆదిపురుష్ కథ రచయిత స్పందించారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న విమర్శలకు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా సమాధానమిచ్చారు. (ఇది చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!) మనోజ్ ముంతశిర్ మాట్లాడుతూ.. 'మేము తీసింది రామాయణం కాదు.. మేము రామాయణం నుంచి స్ఫూర్తి పొందాం. ఈ విషయాన్ని మేం డిస్‌క్లైమర్‌లో కూడా ప్రస్తావించాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం కూడా. దీని గురించి మరోసారి వివరణ ఇస్తున్నా. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు.' అని అన్నారు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్‌పై తాజాగా రచయిత ఇచ్చిన వివరణపై సినీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో!. (ఇది చదవండి: నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో ) -
అభిప్రాయభేదాలు ఉంటే మంచిదే!
‘‘డైలాగ్ రైటర్‌గా నాకు ప్రతి కొత్త సినిమా ఓ సవాలే. హీరో ప్రాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ డైలాగ్స్ రాయాలి. కేవలం స్టార్ ఇమేజ్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాయడం అనేది కరెక్ట్ కాదని నా భావన. నేను అలా రాయను’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► బాలకృష్ణగారితో నేను చేసిన నాలుగో సినిమా ‘వీరసింహారెడ్డి’. అలాగే ‘క్రాక్’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో నేను చేసిన రెండో సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథా చర్చల సమయం నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ కొత్త ప్రాయింట్ ఉంది. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు ఇలాంటి ఓ కొత్త పాయింట్ కలవడం అనేది చాలా అరుదు. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, బాలకృష్ణగారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో ‘వీరసింహారెడ్డి’ రూపొందింది. ► కథా చర్చల్లో భాగంగా అభిప్రాభేదాలు ఉండొచ్చు. అవి ఉన్నప్పుడే పని కరెక్ట్‌గా జరుగుతున్నట్లు అర్థం. అన్నీ కూడా సినిమా అవుట్‌పుట్ బాగా రావడం కోసమే. ఒకసారి కథను ఓకే చేశాక బాలకృష్ణగారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. సందర్భానుసారంగా కొన్ని డైలాగ్స్ ఇంప్రొవైజేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ సినిమా జర్నీలో భాగం. కన్విన్స్ చేయడం, కన్విన్స్ అవ్వడం.. ఈ రెండు లక్షణాలు ఉన్న గొప్ప దర్శకుడు గోపీచంద్ మలినేనిగారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతల వల్ల ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ► కొంతమంది రచయితలు ఇండస్ట్రీకి దర్శకులు కావాలని వచ్చి, రైటర్స్‌గా మొదలై, ఫైనల్‌గా దర్శకుడిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. నేను రచయితను కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్‌గా రాణిస్తున్నాను. ప్రస్తుతానికైతే డైరెక్షన్ ఆలోచన లేదు. ► 2017 సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణగారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకూ నేను పని చేశాను. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’కు నేను చేయక΄ోయినా అదీ నా సినిమాగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిగారికి నేనంటే అభిమానం. దర్శకుడు బాబీ నా మిత్రుడు. ఈ రెండు చిత్రాలూ సక్సెస్ అవ్వాలి. ► ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, హీరో రామ్‌చరణ్–దర్శకుడు శంకర్ కాంబినేషన్ సినిమా, అర్జున్ దర్శకత్వంలోని సినిమా, నిర్మాత కేఎస్ రామారావు సినిమాలు చేస్తున్నాను. -
ఆ డైరెక్టర్ ప్రతి సినిమాకు నేనే పని చేస్తా: డైలాగ్ రైటర్
మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం". సత్యదేవ్, తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించారు. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్బంగా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ► 11 ఏళ్ల క్రితం అలా మొదలైంది సినిమా చేశాను. ఆ తర్వాత చందమామ కథలు వంటి లవ్ స్టోరీ రాశాను. తరువాత ఫ్యామిలీ, విలేజ్, గోదావరి స్లాంగ్ వంటి సినిమాలు, పొలిటికల్.. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్ కథలతో చాలా సినిమాలకు రాశాను.అయితే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు రాసిన జానర్ మళ్ళీ రాయలేదు. ► నేను ఏ సినిమాకైనా కథ రాయాలి అంటే ఆ కథ నాకు ఇన్స్పిరేషన్ కలిగించాలి,అలాగే ఆ కథలో కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. చూసే అడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయినపుడే మనము సక్సెస్ అయినట్టు. ► గతంలో మనం చూసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రేమమ్ వంటి సినిమాలు 10 సంవత్సరాలకోసారి కూడా రావు. ఈ సినిమాలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. అతడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తనకు 90 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా చేయగలడు. ► ఈ మధ్య ప్రేక్షకులు రీమేక్ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. ఆర్థిస్టులు కూడా రీమేక్ సినిమాలను ఛాలెంజ్‌గా తీసుకొని పోటీపడి నటిస్తారు. ఎందుకంటే రీమేక్‌లో ఆర్థిస్టులు నటించిన దానికంటే ఇంకా బెటర్ గా చెయ్యాలని ట్రై చేస్తారు. అప్పుడు సినిమా బాగా వస్తుంది. ఆలా చేసిన ఈ సినిమా కూడా 90% ఒరిజినల్ ఉండేలా సినిమాను రెడీ చేశాము. ► చాలామంది పెద్ద నిర్మాతలు నన్ను డైరెక్షన్ చేయమని అడిగారు. కానీ నాకు డైరెక్షన్ చేయాలని థాట్ వచ్చినప్పుడే చేస్తాను. ► చిరంజీవి లాంటి స్టార్ వ్యక్తికి డైలాగ్స్ రాస్తున్నప్పుడు నాకు ఎక్కువ ప్రెజర్ ఉండదు కానీ ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను రాసిన డైలాగులు చిరంజీవి గారి నోట్లోనుంచి వస్తే ఎలా ఉంటుందనే ఎగ్జయిట్‌మెంట్‌తో రాస్తాను. ► నాకు జీవితంలో ఎటువంటి గోల్స్ లేవు. కానీ, మంచి సినిమాలకు కథలు రాయాలి, నేను వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకుంటాను. ► అందరూ ఈ టైటిల్ గురించి అడుగుతున్నారు. అయితే ఎండాకాలంలో ప్రేమికులకు లవ్ స్టోరీ బాగోదు, వానకాలం లవ్ అనేది పెళ్లైన వాళ్ళకు మాత్రమే బాగుంటుంది. శీతాకాలంలో లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. ► నెక్స్ట్ మరీచిక, అన్నీ మంచి శకునములే సినిమాలకు పని చేస్తున్నాను. అలాగే నందిని రెడ్డి చేసే ప్రతి సినిమాకు కూడా రాస్తున్నాను అని ముగించారు. చదవండి: క్రికెటర్‌తో లవ్‌లో నటి? ఈ మధ్య మాటలు కూడా బంద్ అయ్యాయట! దయచేసి తండ్రి మాట వినొద్దు, అలాగైతేనే బన్నీలా అవుతారు: బండ్ల గణేశ్ -
దర్శకుడిగా మారబోతున్న డైలాగ్ రైటర్
ఆర్ఎక్స్ 100 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియోలో వైరల్ అవుతుంటాయి. అజయ్ భూపతి కథ రచయితగా స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సయ్యద్ మాటల రచయితగా వ్యవహరించాడు. తొలి సినిమాతోనే తనదైన మాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్, ప్రశాంత్ వర్మ తీసిన “కల్కి” “జాంబిరెడ్డి” చిత్రాలకు మంచి డైలాగ్స్ అందించి తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ‘మహా సముద్రం’ సినిమాతో పాటు శ్రీహాన్ క్రియెషన్స్ లో ఒక వెబ్ ఫిల్మ్, సురేశ్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి మాటలు అందించారు. ఇలా తన ప్రతిభతో మంచి మంచి అవకాశాలతో రాణిస్తున్న ఈ యంగ్ డైలాగ్ రైటర్ ఇప్పుడు ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు కథ చెప్పటం, వారికి నచ్చటంతో సయ్యద్ కి ఈ అవకాశం వచ్చింది. ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. -
‘నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దని లెటర్ రాశాడు’
మహారథి... దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు... బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి వచ్చారు... ఎంతో పోరాటం చేసి సినీ రచయితగా నిలిచారు... రణభేరి, బందిపోటు, పెత్తందార్లు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు.. వంటి అనేక చిత్రాలకు పదునైన లయబద్ధమైన మాటలు రచించి కొత్త పంథాను సృష్టించారు.. క్రమశిక్షణ, నిజాయితీ, నిక్కచ్చితనం వల్ల సినీ పెద్దలకు దూరమయ్యారు.. తను కలలు కన్న అల్లూరి సీతారామరాజు కోసం అడవులకు వెళ్లారు... ఆదర్శ జీవితాన్ని గడిపారు.. పిల్లలకు అదే నేర్పారు.. అంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాలు ‘సాక్షి’కి వివరించారు మహారథి రెండవ కుమారుడు చిట్టిబాబుగా పరిచితులైన వరప్రసాద్.. నాన్న కృష్ణాజిల్లా పసుమర్రులో పుట్టారు. నాయనమ్మ పుణ్యవతి. తాతయ్య సత్యనారాయణ పసుమర్రు మునసబు. ఆయనకు రైస్ మిల్లులు ఉండేవి. నాన్నగారికి ఒక అక్క ధనలక్ష్మి, ఇద్దరు చెల్లెళ్లు.. జయప్రద, రామలక్ష్మి. తాతగారి రెండో భార్యకు ధనలక్ష్మి, మూడో భార్యకు నాన్నగారు, ఇద్దరు చెల్లెళ్లు పుట్టారు. ఆ రోజుల్లో వారసుడి కోసం తపించేవారు. లేకలేక పుట్టడంతో నాన్న ఎంతో అపురూపంగా పన్నెండు మంది దాసీల మధ్య పెరిగారు. పుట్టినప్పుడే జ్యోతిష్కుడు, ‘పిల్లాడు మహావిద్యావంతుడు అవుతాడు, కాని 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నదంతా హరించుకుపోతుంది’ అని చెప్పిన జాతకం నిజమైంది. నాన్నకు 12 సంవత్సరాలు వచ్చేసరికి తాతగారికి ఉన్న 300 ఎకరాల భూమి 16 ఎకరాల కు వచ్చేసింది. ‘పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మకు’ అని వాళ్ల నాయనమ్మ చెప్పిన మాటతో 16 ఎకరాలు అమ్మేసి, ఆ డబ్బుతో నిజామాబాద్ ధర్మారంలో వ్యవసాయం చేసి, అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి, సన్యాసం తీసుకుని వింధ్య పర్వతాలకు వెళ్లిపోయారట. నాన్న ఏమయ్యారో తెలియక మా నాయనమ్మ దిగులుపడిపోయిందట. అక్కడ స్వామీజీలు నాన్నతో, ‘నీకు సన్యాసి యోగం లేదు, తల్లి మనసు కష్టపెట్టకు, అమ్మ దగ్గరకు వెళ్లిపో’ అనటంతో వెనక్కు వచ్చి, కాకరాల సీతారామయ్యగారి అమ్మాయి కమలను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారట. ఎవరు చెప్పినా వినలేదు... నాన్నగారికి మేం నలుగురు సంతానం. సత్య కిశోర్ (సి. ఏ), ఉషారాణి (బి.ఏ.), వరప్రసాద్ (చిట్టిబాబు, నేను, బి. కాం.), రాజేంద్ర అనారోగ్యం కారణ ంగా మధ్యలోనే చదువు ఆపేసి, వ్యాపారం లోకి దిగారు. మా అందరి కంటె ముందు ఒక అమ్మాయి పుట్టింది. పేరు క్రాంతి. ఆ ప్రసవం అయ్యాక అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే రామలక్ష్మి అత్త పెంచింది. నాన్నకు జ్యోతిష్యం బాగా తెలుసు. ఆవిడకు సంతాన యోగం లేదని నాన్న చెప్పారు. అత్తయ్య ఆ బిడ్డను తనకు దత్తతు ఇవ్వమని అడిగితే, ‘శ్రావణ శుక్రవారం పుట్టిన బిడ్డను దత్తతు ఇవ్వద్దు’ అని చెప్పినా వినకుండా, అమ్మకు కూడా చెప్పకుండా అత్తయ్యకు దత్తతు ఇచ్చారు. సొంతవారే అవమానించారు... నాన్నగారి చెల్లెళ్లకు ఐశ్వర్యం వచ్చాక నాన్నను చాలాసార్లు అవమానించారు. ఒకసారి సినిమా హాలు దగ్గర క్రాంతి (దత్తు వెళ్లిన అక్క) నాన్న పలకరిస్తే అవమానించింది. క్రాంతి అక్క పెళ్లి పత్రికలో ‘అభినందనలతో అనే చోట మన పేర్లు వేయమనండి’ అని అమ్మ చెప్పటంతో అత్తయ్యను అడిగారట నాన్న. ఇదంతా ఆస్తికోసం చేస్తున్నారంటూ నాన్నను నిందిస్తూ, నిష్ఠూరంగా మాట్లాడారట. అయినా నాన్న ప్రేమనే చూపారు. నాన్న బోళా శంకరుడు. ప్రశంసిస్తే పొంగిపోతారు. క్రమశిక్షణ తప్పితే... నాన్నగారి వివాహం అయ్యాక హైదరాబాద్ డెక్కన్ రేడియోలో అనౌన్సర్‌గా చేరారు. ఆ తరవాత కృష్ణా పత్రిక, తెలుగుదేశం పత్రికలకు పనిచేశారు. అప్పట్లో బాదర్ పేరు మీద రాసేవారు. రజాకార్ ఉద్యమంలో హిట్ లిస్ట్‌లో ఉండేవారు. కొన్నాళ్ల తరవాత అక్కడ నుంచి చెన్నై వచ్చేశారు. అప్పటికే శతకాలు రాశారు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ‘వెల్త్ లాస్ట్ నథింగ్ లాస్ట్, హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్’ అని రాసిన బోర్డును ఇంటి గుమ్మం పైన పెట్టి, బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ప్రతిరోజూ తప్పనిసరిగా చదవమనే వారు. నియమాలు పాటించకపోతే గోడ కుర్చీలు, బెల్ట్ దెబ్బలు. మా స్కూల్‌కి రైల్వే గేట్ దాటి వెళ్లాలి. ఒకరోజు గేట్ ఎక్కి దూకి వెళ్లడం ట్యూషన్ మాస్టర్ చూసి, నాన్నకు చెప్పారు. నాకు ఆ రోజు బడిత పూజ. జీవితంలో మళ్లీ ఆ పని చేయలేదు. మాట తీసుకున్నారు.. మా ముగ్గురు అన్నదమ్ముల దగ్గర, ‘మేం కట్నానికి అమ్ముడు పోము’ అని మాట తీసుకున్నారు. నా వివాహం పెళ్లి చూపులు లేకుండా జరిగింది. నాన్నగారే వెళ్లి చూసి నిశ్చయం చేశారు. అమ్మాయితో, ‘మా అబ్బాయి చూడడు, వాడు కోరుకున్నట్లుగా ఉన్నావు నువ్వు, ఒక్క పైసా కట్నం, బంగారం ఏమీ వద్దు. నీ బట్టల సూట్‌కేసుతో మా ఇంట్లో అడుగు పెట్టు’ అన్నారు నాన్న. నాన్న చూసి వచ్చాక, ‘వృద్ధాప్యం వచ్చాక కూడా గ్లామర్ ఉండేలాంటి అమ్మాయిని చూశాను’ అని చమత్కరించారు. నా భార్య ఉషాలత వాళ్లది అతి సామాన్య కుటుంబం. పోరాడారు.. చెన్నై చేరిన కొత్తల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పనిచేశారు. రచయితగా ప్రవేశించటానికి పెద్ద పోరాటమే చేసి, గెలుపు సాధించారు. ‘బందిపోటు’ చిత్రంతో రచయితగా ప్రవేశం చేసి, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా ఒక లయలో డైలాగులు రాసి అంతవరకు ఉన్న ఒరవడి మార్చారు. ఈ విషయంలో ఒక జర్నలిస్టు నాన్నను విమర్శించారు. నాన్న కోపంగా, ‘నేను రైటర్ని, అవసరమైతే ఫైటర్ని కూడా అవుతాను, జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చారు. సీతారామరాజు లైఫ్ యాంబిషన్. ఆ సినిమా కోసం పరిశ్రమలోని పెద్దవాళ్లు విరోధులయ్యారు. అమ్మతో, ‘ఈ సినిమాను దీక్షతో ఒక యజ్ఞంలాగ, తపస్సులాగ చేయాలి. దీని వల్ల కీర్తి వస్తుంది. చాలా సినిమాలు తగ్గిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడతాం. ఏం చేయమంటావు?’ అని అడిగితే, ‘మీకు ఎటు విశ్వాసం ఉంటే అటే వెళ్లండి’ అని అమ్మ ఇచ్చిన మాటతో తెల్లవారు జాము. మూడు గంటలకు నాన్న చింతపల్లి అడవులకు వెళ్లిపోయారు. ఏకాగ్రతతో అనుకున్నది సాధించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రివ్యూ పెద్దల సమక్షంలో జరిగింది. దానికి పి. పుల్లయ్య గారు కూడా వచ్చారు. సినిమా పూర్తిగా చూసి, నాన్నను కౌగిలించుకుని, ‘సినిమా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆనందంగా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తన తపస్సు ఫలించినందుకు నాన్న పరమానందించారు. ‘నా పేరు నిలబడే సినిమాలే రాస్తాను. అదే నా కలం బలం’ అని ఎన్నో కథలు తిరస్కరిం చారు. ఫైవ్‌స్టార్ హోటల్, ప్లాట్‌ఫారమ్... రెండిటినీ సమానంగా చూసేవారు. నిజాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ఓపెన్‌గా ఖండించడంతో విరోధులు పెరిగారు. నాన్నను అందరూ మీసాలాయన అనేవారు. సామాన్య జీవితం... చాలా సాధారణంగా ఉండేవారు. మంచి డ్రెస్ వేసుకోమని అమ్మ చెబితే, ‘ఈ బట్టలు చూసి నన్ను మహారథి కాదంటారా’ అంటూ చిరిగిన వాటితోనే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. కారు, రిక్షా, ఆటో, బస్.. అన్ని ప్రయాణ సాధనాలలోనూ ప్రయాణించేవారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ గా భావించి, కంచంలో పెట్టినది తినేసేవారు. ఇంట్లో అందరికీ ఎవరి కంచం వారిది. ఒకసారి అన్నయ్యకు అల్యూమినియం ప్లేట్లో అన్నం పెట్టింది అమ్మ. ‘ఇందులో నేను తినను’ అని అన్నయ్య పేచీ పెట్టాడు. ఆ విషయం నాయనమ్మ నాన్నకు చెప్పింది. నాన్న ఆ రోజున చాలా కోపంగా, అంట్లు తోముకునే బూడిద పెట్టే పళ్లెం కడిగించి, అందులో వారం రోజుల పాటు అన్నం పెట్టమని చెప్పారు. అన్నయ్య తినలేకపోయాడు. ‘అన్నానికి విలువ ఇవ్వాలి. కంచానికి కాదు’ అని మందలించారు. ఒకసారి స్కూల్లో నేను పెన్ దొంగతనం చేశాను. ఎప్పట్లాగే మా నాయనమ్మ నాన్నకు విషయం చెప్పింది. నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటే, ‘చిట్టి పెద్ద అబద్ధాలకోరు’ అని అందరికీ వినపడేలా మూడు సార్లు అనిపించారు. అంతే ఇంకెన్నడూ ఎవ్వరి వస్తువూ ముట్టుకోలేదు. క్యారెక్టర్ బిల్డింగ్‌లో మైండ్ గేమ్ ఆడారని పెద్దయ్యాక తెలిసింది. ఆ బీజాలు మాలో నాటుకుపోయాయి. అందువల్ల కొంత కోల్పోతున్నాం. అందుకని రోజూ నాన్న ఫొటో చూస్తూ, ‘నాన్నా! మీరు మాకు మంచి చేశారో చెడు చేశారో తెలియట్లే్లదు’ అంటుంటాను. ఈ పేరు ఇలా వచ్చింది... వరంగల్ని త్రిపురనేని వంశీకులు పరిపాలించిన కాలంలో, మహారథి అనే ఒక రాజు పేరున నాణెం ముద్రించారు. అందుకని ఆ పేరు పెట్టుకోమని స్నేహితులు చెప్పటంతో నాన్న మహారథిగా మారారు. నాన్నగారి అసలు పేరు బాలగంగాధరరావు. అలా జరిగిపోయింది... 2011 డిసెంబరు 9 వ తేదీ నాన్నగారి సహస్ర చంద్రదర్శనం కార్యక్రమం అయ్యింది. ‘పిల్లవాడికి ఆశీర్వాదం ఇస్తాను, తీసుకురా’ అన్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను. డిసెంబరు 21న డిశ్చార్జ్ అయ్యాను. 2011, డిసెంబరు 23న నాన్న కన్నుమూశారు. ‘మూడు రోజుల తరవాత దహనం అవుతుంది. కాని నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దు’ అని రాసిన ఒక లెటర్ నాన్న దిండు కింద కనిపించింది. ఆయన అన్నట్లుగానే మూడు రోజుల దాకా వాహనం రాలేదు. ఆశ్చర్యంగా మూడు రోజులూ వాసన రాలేదు. అలా నాన్న తన జాతకం కూడా చెప్పారు. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
సినీ రంగంలో రాణిస్తున్న నెల్లిమర్ల అల్లుడు
సాక్షి, విజయనగరం (నెల్లిమర్ల): వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ మన ఊరి అల్లుడే. ఆ సినిమాకు డైలాగులు రాసిన మామిడాల తిరుపతి నెల్లిమర్ల పట్టణానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన తిరుపతి నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్న బొద్దాన శంకరరావు, మంగమ్మ దంపతుల కుమార్తె బొద్దాన రూపాదేవిని 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. తిరుపతి, రూపాదేవి దంపతులకు కైవల్య అనే పాప ఉంది. ప్రస్తుతం వారి కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. తిరుపతి 20 ఏళ్ల కిందట సినీ పరిశ్రమకు వెళ్లారు. 13 ఏళ్ల కిందట చిత్ర నిర్మాత దిల్‌రాజు టీమ్‌లో చేరారు. అప్పట్నుంచి ఆ టీమ్‌లో ప్రధాన టెక్నీషియన్‌గా కొనసాగుతున్నారు. 2011లో వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సినిమాకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2017లో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంటుగా, నాని నటించిన ‘ఎంసీఏ’కు డైలాగ్ రైటరుగా వ్యవహరించారు. తాజాగా శుక్రవారం విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్‌కు డైలాగులు రాశారు. సినీ పరిశ్రమలో తిరుపతికి మంచి భవిష్యత్ ఉందని నెల్లిమర్ల పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. ఆయన నెల్లిమర్ల అల్లుడు కావడంపై గర్వపడుతున్నారు. ఆయనకు ఫోన్లో అభినందనలు తెలుపుతున్నారు. -
ప్రముఖ నటుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్(81) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కెనడాలో తుదిశ్వాస విడిచారని ఖాదర్ ఖాన్ కుమారుడు సర్ఫరాజ్ వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ కెనడాలోనే ఉన్నందున అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ‘డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు మా తండ్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గత 16-17 వారాలుగా ఆస్పత్రిలో ఉన్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెనడాలోనే అంత్యక్రియలు జరుపుతామ’ని పీటీఐ వార్తా సంస్థతో సర్ఫరాజ్ చెప్పారు. ఖాదర్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమిత్‌బాబ్ బచ్చన్ సంతాపం ప్రకటించారు. తన అద్భుత నటనతో వెండి తెరకు మరింత మెరుగులు దిద్దారని మోదీ పేర్కొన్నారు. రచయితగా కూడా గొప్ప సినిమాలు అందించారని కొనియాడారు. ఖాదర్ ఖాన్ మరణ వార్త కలచివేసిందని అమితాబ్ అన్నారు. గొప్ప ప్రతిభావంతుడైన ఆయనను కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దో ఔర్ దో పాంచ్, ముకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, సుహాగ్, షహేన్షా సినిమా ఘన విజయం సాధించాయి. అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో జన్మించిన ఖాదర్ ఖాన్ 1973లో వచ్చిన ‘ధాగ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 250పైగా సినిమాలకు డైలాగులు రాశారు. మాటల రచయితగా ఆయన మొదటి సినిమా ‘జవానీ దివానీ’. హాస్య పాత్రలకు పేరుగాంచిన ఖాన్.. దర్శకుడు డేవిడ్ ధావన్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. అమితాబ్‌తో పాటు రాజేశ్ ఖన్నా, జితేంద్ర, ఫిరోజ్ ఖాన్, అనిల్ కపూర్, గోవిందా తదితర ప్రముఖ నటులతో ఆయన తెర పంచుకున్నారు. -
సీనియర్ మాటల రచయిత కన్నుమూత
తమిళసినిమా: ఎంజీఆర్ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్ రచయిత ఆర్కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. ఎంజీఆర్ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్, ముఖరాశి, రహస్యపోలీస్ 115, నినైత్తదై ముడిప్పవన్, నీతిక్కు తలైవణంగు, పల్లాండు వాళ్గ, నాడోడి, చిరిత్తు వాళవేండుం 16 చిత్రాలకు షణ్ముగం మాటలను రాశారు. అదేవిధంగా శివాజీగణేశన్ నటించిన పలు చిత్రాలకు సహాయదర్శకుడిగానూ పని చేశారు. షణ్ముగం గత కొన్ని వారాల క్రితం బాత్రూమ్లో జారి పడడంతో వెన్నెముక విరిగింది. అందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నా, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. షణ్ముగంకు భార్య దేవి, కూతుళ్లు సత్యవతి, సంతానలక్ష్మీ ,ఈశ్వరి, మహాలక్ష్మీ ఉన్నారు. షణ్ముగం అంత్యక్రియలు బుధవారం జరిగాయి. -
మాటలతో మెప్పించాడు..!
గతంలో సినిమా అంటే హీరో, విలన్, హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకులకు సినిమా మేకింగ్ మీద అవగాహన పెరిగింది. తెర మీదే కాదు. తెర వెనుక ఉన్న వారి గురించి కూడా తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. దాసరి లాంటి వారు దర్శకుడికి స్టార్ ఇమేజ్ తీసుకువస్తే.. పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి మాధవ్ బుర్రా వంటి వారు మాటల రచయితలను కూడా స్టార్ కేటగిరిలో చేర్చారు. దీంతో ఎంతో మంది కళాకారులు మాటల రచయితలుగా సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు. అదే బాటలో షాలిని సినిమాతో మాటల రచయితగా ఆకట్టుకున్నారు బాలా సతీష్. చిన్న సినిమాగా విడుదలైన షాలిని చిత్రానికి తన గురువు భాషా శ్రీతో కలిసి మాటలు రాసిన సతీష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలా సతీష్.., పరుచూరి గోపాల కృష్ణ దగ్గర స్క్రీన్ ప్లే రైటింగ్ లోనూ శిక్షణ తీసుకున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నందికొండ వాగుల్లోనా సినిమాతో మరోసారి రచయితగా తన పెన్ను పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ యువ రచయిత. -
బుర్రా సాయిమాధవ్‌తో సరదాగా కాసేపు
-
ఇది నా జీవితంలో అరుదైన సంఘటన!
‘‘హీరో ఇమేజ్ కంటే క్యారెక్టర్ ఇమేజ్ తక్కువయితే... హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయాలి. శాతకర్ణిలో అలాంటి డైలాగులు రాసే అవసరం రాలేదు’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 12న రిలీజవుతోంది. సాయిమాధవ్ చెప్పిన సంగతులు... ► ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత క్రిష్‌గారు శాతకర్ణిపై పరిశోధన ప్రారంభించారు. హిందీలో ‘గబ్బర్’, తర్వాత తెలుగులో ‘కంచె’ చేస్తూనే క్రిష్ రీసెర్చ్ కొనసాగించారు. ఆయన నాతో చెప్పిన తర్వాత నేనూ రీసెర్చ్ చేశా. తెనాలిలో ‘యజ్ఞశ్రీ శాతకర్ణి’కి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖల ద్వారా అప్పటి సంస్కృతి తెలిసింది. ► చిన్న చిన్న గణరాజ్యాలుగా ఉన్న భారతావనిని ఓ దేశంగా మార్చడానికి శాతకర్ణి ఎలాంటి యుద్ధం చేశాడనేది ఈ చిత్రకథ. శాతకర్ణికున్న బిరుదుల్లో ‘త్రిసముద్ర తోయపాన వాహన’ ఒకటి. ‘మూడు సముద్రాల్లోనూ నీళ్లు తాగిన గుర్రాలను అధిరోహించినవాడు’ అని అర్థం. ఓటమి ఎరుగని శాతకర్ణి విజయగాథ – ఈ చిత్రకథ. ► కథ సిద్ధమైన తర్వాత ‘బాలకృష్ణగారు తప్ప ఇంకెవరూ శాతకర్ణి పాత్రను చేయలేరేమో’ అనంటే... ‘ఆల్రెడీ నేను మాట్లాడాను. ఆయనే చేస్తున్నారు’ అన్నారు క్రిష్. చరిత్రలో జరిగింది చెబుతున్నాం. కథలో కల్పితాలు ఏం లేవు. ► తొలిసారి మొరాకో సెట్స్‌లో బాలకృష్ణగారికి డైలాగులు చెప్పడానికి వెళ్లినప్పుడు నాకు భయం వేసింది. 99 సినిమాల్లో మహానుభావులు రాసిన డైలాగులు చెప్పారాయన. నా డైలాగులు నచ్చుతాయో? లేదో? అనుకున్నా. ఆయన ఒక్క డైలాగ్ కూడా మార్చమనలేదు. శాతకర్ణి శక్తిమంతుడు కావడంలో మంచి డైలాగులు పడ్డాయి. ► ‘ఖైదీ నంబర్ 150’లో కొన్ని సీన్లకు డైలాగులు రాశా. చిన్నప్పట్నుంచీ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు చూస్తూ ఇక్కడి వరకూ వచ్చా! వాళ్లే నాకు స్ఫూర్తి. వాళ్ల ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచే చిత్రాలకు మాటలు రాయడం అదృష్టం. ఎవరూ కలలు కనే ధైర్యం కూడా చేయని అరుదైన సంఘటన నా జీవితంలో జరిగింది. సావిత్రి గారి జీవితకథతో నాగ అశ్విన్ తీయబోయే ‘మహానటి’కి, హీరో సందీప్‌కిషన్–మంజుల సినిమాకి మాటలు రాస్తున్నా. -
ఇద్దరూ ఇద్దరే
తెనాలి : విశాఖలో పుట్టిన ఓ చిన్న ఆలోచన ఓ మంచి సినిమాకు పురుడు పోసింది. క్లిష్టతరమైన జార్జియా దేశానికి ఆ సినిమా యూనిట్‌ను తీసుకెళ్లింది. షూటింగ్ పూర్తి చేసుకుని ‘కంచె’గా తెలుగు తెరపైకొచ్చింది. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. జాతీయ జ్యూరీని మెప్పించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం, పల్లెటూరిలో అమలిన ప్రేమకథను మిళితం చేసి రెండు పొరలుగా అల్లుకున్న కథ, జాతీయ గౌరవాన్ని పొందిన ఆలోచన దర్శకుడు క్రిష్‌ది. సినిమాలోని దృశ్యాలు, పదునైన సంభాషణలు జనం గుండెల్లోకి దూసుకెళ్లేలా రాసిన కలం సాయిమాధవ్ బుర్రాది. కంచె సినిమా విజయంలో కీలకమైన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లావాసులేనని చెప్పుకునే భాగ్యం మనది కృషి అంటే క్రిష్ ‘గమ్యం’తో తానేమిటో రుజువు చేసుకున్న దర్శకుడు క్రిష్. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, తర్వాత వచ్చిన ‘కంచె’ తన వైవిధ్యమైన శైలికి నిదర్శనాలు. స్వస్థలం వినుకొండ. పెరిగిందీ, చదువుకుందీ గుంటూరులోనే. నమ్మిన భావజాలాన్ని ప్రేక్షకులు మనసుల్లోకి ఎక్కించుకునేలా తీస్తున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో విశాఖలో కనిపించిన బాంబు శకలం ఆయనను ఆకర్షించింది. ఆరా తీస్తే అది రెండో ప్రపంచయుద్ధం నాటిదని తేలింది. గూగుల్‌లో జల్లెడ పట్టారు. మ్యూజియంలు చుట్టేశారు. మరోవైపు అందమైన ప్రేమకథకు రూపమిచ్చారు. యుద్ధం, ప్రేమ.. రెండు లేయర్లుగా అల్లుకున్న కథతో సినిమాకు ఉపక్రమించారు. తుపాకుల నుంచి దుస్తుల వరకూ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. రిటైర్డు మిటలరీ అధికారితో వారంరోజులు శిక్షణ ఇప్పించారు క్రిష్. సెల్యూట్ చేయడం, కమాండ్స్ ఇవ్వడం నేర్పించారు. హీరోయిన్గా ముద్దమందారంలాంటి ప్రగ్యా జైస్వాల్‌ను ఎన్నుకున్నారు. కంచెకు ఆయనే కలం కంచె సినిమా చూసిన ప్రేక్షకులు అందులోని సంభాషణలను వెంటనే మరిచిపోలేరు. ప్రేమ గురించి, కులమతాల కంచెల గురించి, దేశాల మధ్య యుద్ధంపై పాత్రల మధ్య వచ్చే మాటలు మనసును తాకుతాయి. ‘నేనంటే ఇష్టమా..?’, కాదండీ...ప్రేమ..!’, ‘రెండింటికీ తేడా ఏంటి?’, ‘గులాబి పువ్వు ఉందనుకోండి. దాన్ని కోస్తే ఇష్టం. నీళ్లు పోస్తే ప్రేమ’ అంటూ సాగిన సంభాషణలు కొత్త అనుభూతుల్లోకి తీసుకెళ్లాయి. కులాల గురించి చెప్పిన పదునైన మాటలూ అంతే. ఆ మాటలు సాయిమాధవ్ బుర్రా కలం నుంచి వచ్చిన వి. వర్ధమాన డైలాగ్ రైటర్లలో బాగా వినిపిస్తున్న పేరు అది. స్వస్థలం తెనాలి. బొల్లిముంత శివరామకృష్ణ శిష్యరికం, చిన్నతనం నుంచీ రంగస్థలంతో ఉన్న అనుబంధం కలిగిన సాయిమాధవ్ తన కలం పదునైందని నిరూపించుకొన్నాడు. క్రెడిట్ అంతా క్రిష్‌దే.. ప్రేమికులు విడిపోవడానికి కులం, డబ్బు వంటి అడ్డుగోడలు ఎప్పట్నుంచో ఉన్నవే. వీటిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కేవలం ప్రేమకే కాకుండా, మనిషి మనిషికి, దేశాలకు మధ్య ఎన్నో రకాల కంచెలున్నాయనే అంశాన్ని రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో కొత్తగా చెప్పడం అందరికీ కనెక్టయింది. తొలి కాపీ చూడగానే కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంద నుకున్నా. క్రిష్ గారితో చెప్పాను. అవార్డు రాగానే ఫోన్‌చేసి ‘నువ్వు అవార్డు వస్తుందన్నావుగా. వచ్చింది’ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మొత్తం క్రెడిట్ అంతా క్రిష్‌దే. మా వంతు కృషి ఉన్నా మమ్మల్ని చేయిపట్టుకుని నడిపించింది ఆయనే. - సాయిమాధవ్ బుర్రా,కంచె సినిమా మాటల రచయిత ప్రేమ+ప్రపంచ యుద్ధం పకడ్బందీ స్టోరీబోర్డుతో షూటింగ్‌ను 55 రోజుల్లో పూర్తిచేశారు క్రిష్. 30 రోజులు జార్జియా దేశంలో తీయడం మరో విశేషం. కేవలం 20 మంది యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని పాత్రలకు జర్మన్ దేశస్థులను తీసుకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో లోతైన భావజాలాన్ని, క్లిష్టమైన విషయాన్ని సగటు ప్రేక్షకులతో సహా అందరికీ అర్థమయ్యేలా తెరపై ఆవిష్కరించారు. దూపాటి హరిబాబు, సీత భావోద్వేగాలు, కులం చుట్టూ సాగిన సంభాషణలు, పాటల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం... అన్నీ అద్భుతంగా అమరాయి. అందుకే, అన్ని కంచెలను దాటి జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. అవార్డు వస్తుందని ఊహించా.. నేను తీసుకున్న పాయింట్‌పై భిన్నాభిప్రాయాలొచ్చాయి. నా ముందు కొందరు ధైర్యం చెప్పినా, మరికొందరు పరోక్షంగా విమర్శించకపోలేదు. అయినా ధైర్యంగా ముందుకెళ్లాను. నేను చెప్పగలిగింది చెప్పగలిగాను. కొత్తదనం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. తప్పకుండా అవార్డు వస్తుందని ఊహించాను. జాతీయ చలనచిత్ర జ్యూరీ నా అంచనాలను నిజం చేసింది. ధన్యవాదాలు. ఈ క్రెడిట్ నాతోపాటు పనిచేసిన చిత్ర యూనిట్ అందరికీ దక్కుతుంది. ఈ విజయంతో దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది. - క్రిష్, దర్శకుడు -
చిరంజీవి ప్రశంసలతో చెమటలు పట్టాయి..
‘ఏ కులమూ తక్కువ కాదురా కులమంటే పని.. కమతాన్ని నమ్ముకున్నోడు కమ్మోడయ్యాడు కాపు కాసేవాడు కాపోడయ్యాడు కుమ్మరోడి కుండ, చాకలోడి బండ కంసాలి సేత, సాలీల నేత... ఏదీ వాళ్లు బతకటానిక్కాదు అందరినీ బతికించటానికి... నువ్వెవరంటే ఏం చేస్తుంటావని...నీ నెత్తురేంటీ అని కాదు. అలా అడిగేవాడు అసలు మనిషే కాడు...’ కులాల సరిహద్దులు గీసుకుని కూపస్థ మండూకాల్లా జీవిస్తున్న దురహంకారులకు చెంపపెట్టులాంటి ఈ డైలాగ్ ‘కంచె’ థియేటర్లో పేలుతోంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ, ప్రగ్యాజైస్వాల్ జంటగా దసరాకు విడుదలైన సినిమా మూసచిత్రాలకు భిన్నంగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసింది. ఈ చిత్రానికి సంభాషణలు సాయిమాధవ్ బుర్రా. ఇదేరోజు విడుదలైన హారర్ కామెడీ సినిమా ‘రాజుగారి గది’ సినిమాకూ సంభాషణలు తనవే. కంచె విజయయాత్రలో భాగంగా బుధవారం హీరో హీరోయిన్లతోపాటు తెనాలి వచ్చిన సాయిమాధవ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే... నేను సంభాషణలు సమకూర్చిన సినిమాలు ఒక్కోటీ ఒక్కో జానర్ కావటం, ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందటం హ్యాపీగా ఉంది. ఇలాంటిరోజు రావాలనుకొన్నాను..వస్తుందనుకోలేదు. కృష్ణం వందే జగద్గురుమ్, గోపాల గోపాల, మళ్లీమళ్లీ ఇది రానిరోజు, దొంగాట, ఇప్పుడు కంచె, రాజుగారి గది సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేని కథలు, కంచె సినిమా కథను దర్శకుడు క్రిష్ ఎప్పుడైతే చెప్పారో? ఆ కథ వింటున్నపుడే అలౌకికమైన అనుభూతికి లోనయ్యాను. అర్థగంటసేపు మాటల్లేవు. కథ విన్నపుడు నేను ఎలాంటి ఫీలింగ్స్‌కు లోనయ్యానో, ఇప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకులు అదే ఫీల్‌తో బయటకొస్తున్నారు. అద్భుతమైన ప్రేమ, సభ్యత, సంస్కారం, గతం, మన ఉనికి...ఒక డైలాగ్ రైటర్‌గా నన్ను ప్రూవ్ చేసుకొనే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని, ఆ కాలయానంలో మనుష్యుల మధ్య ఉన్న అంతరాలను అనుసంధానం చేస్తూ ఒక చక్కని కథ, ఆ రెండూ నేపథ్యాలను సమాంతరంగా నడిపిస్తూ పొందికైన కథనం ‘కంచె’లో కుదిరాయి. నా డైలాగులంటారా? సోషల్ మీడియాలో జోరుగా సర్కులేట్ అవుతున్నాయి. క్లాస్, మాస్ ఆదరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించుకొని సినిమాలోని డైలాగులు ఆయన నోటివెంట చెబుతుంటే స్టన్నయిపోయాను. ఆయన ప్రశంసిస్తుంటే నాకు చెమటలు పట్టాయి. ఆయన్ను ట్రెండ్ సెట్టర్ అనేకంటే ఒక కల్ట్ సృష్టించారాయన. ఆయన సినిమాకు మాటలు రాసే అదృష్టం ఉండదేమోనన్న నిరాశలో ఉన్న నాకు, కంచెలోని పదునైన సంభాషణలు ఆయన చెబుతుండటం మధురమైన అనుభూతి. అలాగే ఎక్కడెక్కడ్నుంచో ప్రేక్షకులు ఫోను చేసి ఆర్ద్రతతో అభినందిస్తున్నారు. ఇంత గొప్ప కథ, కథనానికి ఏ రచయితయినా ప్రాణం పెట్టి రాస్తాడు. ఆ అవకాశం నాకు రావటానికి కారణం క్రిష్‌కు నాపై గల నమ్మకం. రొటీన్ ఫార్ములా సినిమాల కాలంలో ఇలాంటి సినిమా కెరీర్లో ఒకసారి రావటమే గొప్ప. తెనాలి నాకిచ్చిన జ్ఞానం నాకు ఉపయోగపడింది. ఇక్కడ్నుంచే ప్రపంచాన్ని తెలుసుకొన్నా. రచయితగా బతుకు, చావు రెండూ సినీపరిశ్రమలోనేనని ఏనాడో నిశ్చయించుకొన్నా. ఆ దారిలో నన్ను నడిపించింది తెనాలి. దర్శకుడు క్రిష్ లేకుంటే నేను లేను. తల్లి రుణం, ప్రేక్షకుల రుణం, తెనాలి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఈ గడ్డమీదనే మళ్లీ మళ్లీ జన్మించాలని నా ఆశ. ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం బ్యాక్‌గ్రౌండ్ ఉండటం నాకు ఉపయోగపడింది. చదివిన పుస్తకాలు, బొల్లిముంత శివరామకృష్ణ సాంగత్యం దోహదపడ్డాయి. చాలా ఏళ్లక్రితం కథ రాసి, ప్రఖ్యాత మాటల రచయిత బొల్లిముంత శివరామకృష్ణకు చూపించా. కథలాగ లేదుకానీ, రాస్తూ ఉండు ఎప్పటికయినా కథవుతుంది అన్నారాయన. ఆయన మాట పట్టుకొని రాసుకుంటూ వెళ్లా...ఇప్పుడు ఒక దారికొచ్చాను. ఆయన బాటలో ప్రస్తుతం అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నా. -
నా మాడ్యులేషన్ అందరికీ తెగ నచ్చేసింది
తోటపల్లి మధు ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నీ ఎంకమ్మా...’ అనే డైలాగ్ గుర్తుంది కదూ. అసలు మరచిపోతేనే కదా. ‘కలికాలం’లో గుండెను కరిగించే డైలాగులు, ‘అల్లరి అల్లుడు’లో కవ్వించే డైలాగులు, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’లో కరుణారసభరిత డైలాగులు... ఇలా ఏదైనా రాయగల దమ్మున్న డైలాగ్ రైటర్ తోటపల్లి మధు. ఒక మూమెంట్లో అయితే... ఆయన డైలాగులు రాస్తున్నాడంటే ఆ సినిమా సగం హిట్ కిందే లెక్కగా భావించేవారు. రచయితగా ఒక వైభవం చూసిన తోటపల్లి మధు సడన్‌గా సైలైంటైపోయి, లేటెస్ట్గా ‘సినిమా చూపిస్త మావా’తో నటుడిగా పెద్ద హిట్టు కొట్టారు. అప్పట్లో కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయన, ‘సినిమా చూపిస్త మావ’లో హీరో రాజ్‌తరుణ్ తండ్రి పాత్రలో గమ్మత్తై నటన కనబరిచారు. ‘‘రచయితగా ఎన్నెన్నో ప్రశంసలందుకున్నాను. కానీ నటుడిగా ఈ ఒక్క పాత్ర ఇస్తున్న కిక్ ఎప్పటికీ మరిచిపోలేను. దాసరి-చిరంజీవి లాంటి మహామహులు సైతం నా నటనను అభినందించారు. ముఖ్యంగా నా మాడ్యులేషన్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. నాకు చాలా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. నాకు సరైన టైమ్‌లో సరైన హిట్ వచ్చింది’’ అని తెగ సంబరపడిపోయారు తోటపల్లి మధు. సినిమాలు, పుస్తకాలే ప్రపంచంగా బతికే మధు, బయట సినిమా ఫంక్షన్స్‌లో పెద్దగా కనబడరు. ఆయనది థర్టీ ఇయర్స్ లాంగ్ కెరీర్. 19 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, 189 చిత్రాలకు రచన చేశారు. ‘‘ ‘మహారథి’ సినిమా తర్వాత మళ్లీ రచన వైపు దృష్టి పెట్టలేదు. ఇకపై నటుడిగా పూర్తి స్థాయిలో కొనసాగుదామని నిర్ణయించుకున్నా. కామెడీ, సెంటిమెంట్, విలనీ ఏదైనా చేయగలననే నమ్మకం ఉంది. రచయితగా నన్ను నెత్తిన పెట్టుకున్న ఈ పరిశ్రమే నటుడిగా కూడా నన్ను కొత్త అంతస్తుకు చేరుస్తుందని నమ్ముతున్నా’’ అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు తోటపల్లి మధు. -
మాటల రచయిత గణేష్ పాత్రో కన్నుమూత
-
ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో కన్నుమూత
చెన్నై : ప్రముఖ మాటల రచయిత, సాహితీకారుడు గణేష్ పాత్రో సోమవారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గణేష్ పాత్రో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. గణేష్ పాత్రో 1945 జూన్ 22న జన్మించారు. పలు తెలుగు, తమిళ చిత్రాలకు గణేష్ పాత్రో మాటలు రాశారు. 1965లో సినీ రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించారు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీ రంగానికొచ్చి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకు సంభాషణలు సమకూర్చారు. నాటక రచయితగా గణేష్ పాత్రోకి మంచి పేరుంది. తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. ఆయన మాటలు, సంభాషణలు అందించిన కొన్ని సినిమాల వివరాలు: *సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (సంభాషణలు, శ్రీకాంత్ అడ్డాల తో కలిసి) *నిర్ణయం (సంభాషణలు, పాటలు) *సీతారామయ్య గారి మనవరాలు *రుద్రవీణ *తలంబ్రాలు *ప్రేమించు పెళ్ళాడు *మయూరి *మనిషికో చరిత్ర *గుప్పెడు మనసు (సంభాషణలు) *ఇది కథ కాదు *మరో చరిత్ర *అత్తవారిల్లు -
'ముదుర్స్' గా పుట్టి 'మదర్స్' మాట వినని హర్ష
'మనుషుల్ని సృష్టించిన దేవుడే...' అంటూ అక్కినేని నాగేశ్వరరావు తన ఆఖరు సినిమా 'మనం' లో డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు తన్మయులై విన్నారు. 'బై బర్త్ ముదుర్సగా పుట్టిన వారు మదర్స్ మాటే వినరు, ఇంక అదర్స్ మాట ఎందుకు వింటారు' అంటూ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో నితిన్ గురించి చిలిపిగా పరిచయం చేస్తున్నా అలాగే విన్నారు. 'ఐలవ్ యు అంటే ఇలా ఇవ్వు' అని కొత్తగా రాసినా అబ్బా బాగుందే అనుకున్నారు. ఈ మాటల మాయ వెనుక ఉన్నది హర్షవర్ధన్. నటునిగా చాలాకాలంగా ప్రేక్షకులకు తెలిసినా రచయితగా ఇప్పుడు కొత్త అవతారంలో అందిరినీ అలరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టి విజయనగరంలో చదువుకున్న హర్షవర్ధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో సంభాషించారు. మీది విజయనగరమే కదా..? హర్ష: నేను పుట్టింది రాజాంలో. ఎల్కేజీ నుంచి నాల్గవ తరగతి వరకు విశాఖలో చదువుకున్నా. మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరం వరకు విజయనగరంలో చదువుకున్నా. అందుకే విజయనగరం తో బంధం వీడనంతంగా బలపడింది. చాలా వ రకు స్నేహితులు ఇక్కడి వారే. విజయనగరంలో మూడు రోజులుగా గడుపుతున్నారు. ఎలా ఉంది..? హర్ష: అమ్మతో అనుబంధాలు పంచుకున్నా. నా చిన్న నాటి మిత్రులందరినీ కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. వచ్చే నె ల 26, 27 తేదీల్లో మళ్లీ విజయనగరం వచ్చి ఆరెండు రోజులు పూర్తిగా నా చిన్ననాటి మిత్రులతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాం. సినీ రంగంలోకి ఎందుకు వెళ్లాలనిపించింది.? మీకు అందులో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? హర్ష: నాకు చిన్న తనం నుంచి సినిమా అంటే పి చ్చి. అందుకే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకునేవాడిని. డిగ్రీ పూర్తయిన తరువాత సినీరంగంలో ఎవరూ తెలియకున్నా స్నేహితుడి తో కలిసి ఎర్రబస్సెక్కినట్లు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయా.(నవ్వుతూ...) అక్కడ మీ జర్నీ సంగతులు..? హర్ష: అమ్మ, నాన్న కాస్త భయపడ్డారు. నేను మాత్రం పట్టుదలతో ఎలా అయినా రాణించాలనుకున్నా. అయితే సినిమా అంటే అలా ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదు. అసలు మీరు ఏమి అవుదామని అక్కడికి వెల్లారు..? హర్ష: నా పట్టుదల అంతా ఒక్కటే. మ్యూజిక్ డెరైక్టర్ కావాలని. అయితే అప్పట్లో నాకు కనీసం సంగీతం అంటే అవగాహన ఉంది తప్ప అంతకుమించి ఏమీ తెలియదు. అందరి లాగానే హైదరాబాద్ వెళ్లగానే అన్ని ఆఫీసులకు తిరిగాను. కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయితే నన్ను చూసిన వాళ్లంతా నీ కళ్లు, వాయిస్ బాగున్నాయి. యాక్టింగ్ చేయచ్చుగా అని అడిగారు. అయితే మీ తొలి ప్రయత్నం కెమేరా ముందున్న మాట.? హర్ష: ఏదో వచ్చిన తర్వాత నిరాశతో వెనక్కివెళ్లిపోకుండా ఎలా అయినా సినీ రంగంలో సిర్థపడాలనుకున్నా. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ముందుగా రుతురాగాలు సీరియల్లో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వందేమాతరం సీరియల్ ముందు టెలికాస్ట్ అయిందనుకోండి. మీరు తొలుతగా గుర్తింపు తెచ్చుకున్న సందర్బం..? హర్ష: అమృతం సీరియల్. ఆ సీరియల్ నాకు తొలి మెట్టు వంటిది. మీరు కథలు రాస్తుంటారా..? హర్ష: విశాఖ ఎక్స్‌ప్రెస్ సినిమాకు. అందులో హీరో నరేష్, రాజీవ్ కనకాల నటించారు. అందులో సగభాగమే నా పాత్ర ఉంది. మీరు చేసిన సినిమాల్లో ఇష్టమైనవి..? హర్ష: నటన పరంగా లీడర్. క్యారెక్టర్ పరంగా స్టాలిన్ సినిమాలో చేసిన పాత్ర. 55 రోజుల పాటు ఆ సినిమా షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవితో గడిపడటం ఎంతో అనుభూతినిచ్చింది. సెట్లో ఆయన నేను మాత్రమే ఉండేవారం. నేను పుట్టిన ఊరు, పెరిగి పెద్దయిన పరిస్థితులు అన్ని ఆయనకు వివరించా. మీకు బాగా గుర్తింపు వచ్చిన సందర్భం..? హర్ష: గుండె జారి గల్లంతయ్యిందే. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ని. అప్పటి వరకు నేను ఏ మాటలు, కథలు రాయాలన్నా సేఫ్‌జోన్‌లోనే ఉంటూ నా పని చేసేవాడ్ని. అయితే ఆ సినిమా నా సినీ జీవితంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో రిస్క్‌తో (డూ అర్ డై) అన్న చందంగా ఆ సినిమా చేశాం. చివరికి మంచి ఫలితం లభించింది. మీకు నచ్చిన తారలు..? హర్ష: అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఓ వైవిధ్యం ఉంటుంది. మీరు సినీరంగంలో రాణించేందుకు ఎవరైనా సహాయం చేశారా..? హర్ష: నాకు ప్రేక్షకులే వెన్నుదన్ను. మొదటిలో చిన్న చిన్న రోల్స్ (అంటే ఆ సీన్ ఎప్పుడు వచ్చి వెళ్లిపోయేదో తెలియనవి) కూడాచేశా. మీరు పుట్టి పెరిగిన ఊరిలో సన్మానం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది..? హర్ష: అసలు నాకు సన్మానాలంటేనే ఇష్టం ఉండదు. మొన్న రోటరీ వాళ్లు ఇచ్చింది పురస్కారం. ఆ విషయం ఇక్కడకు వచ్చేంత వరకు తెలియదు. సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగారు.. మీ అనుభూతి..? హర్ష: ఈ రంగంలో రాణించాలంటే అదృష్టం ఉండాలి. నా కన్నా బాగా నటించి గలిగే వారు, నటన అంటే ప్రాణం పెట్టేవారు, అందగాళ్లు చా లా మంది ఉన్నా వారికి అవకాశాలు దక్కని పరి స్థితి. అలా అని కాస్త యావరేజ్‌గా ఉన్నా నా కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారు లేకపోలేదు. మనం సినిమాకి మాటలు రాశారు. ఆ సినిమా గురించి కాస్త...? హర్ష: తప్పకుండా... నేను చిన్నపుడు మాయాబజార్ సినిమా చూశా. అప్పట్లో ఆడియో టేపులు ఉండేవి. మా ఇంట్లో ప్రతి రోజు అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన డైలాగులు వింటుండేవాడిని, ఒక రోజు ఇంట్లో వారి ముందే 90 నిమిషాలు పాటు అందులో డైలాగులు చెప్పేశా. అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సినిమాయే నాకు మాటలు నేర్పింది. ఆ సినిమాలో హీరో నటించిన ఏఎన్ఆర్ చివరి చిత్రానికి మాట లు రాయటం పూర్వజన్మ సుకృతం. నా కోసమే ఆయన అన్నాళ్లు జీవించి ఉన్నారేమో అనిపించింది. నేను సమకూర్చిన మాటలనే ఆయన పలికారు. ఎంతో అనందమనిపించింది. జీవితంలో మీ లక్ష్యాలు ..? హర్ష: సినిమా రంగంలో అయితే ఏమీ లేవు. ప్రస్తుతం జరుగుతున్నదంతా నాకు బోనస్. పర్సనల్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం కోటి మొక్కలు నాటాలని ఉంది. 1000 మంది అ నాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించాలని ఉంది. లేటెస్ట్గా మీరు మాటలు రాసిన సినిమా? హర్ష: వస్తుంది.. గురువారం ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి. -
డైలాగ్ రైటర్‌గా కమల్‌హాసన్
‘సకలకళావల్లభన్’ అనే బిరుదుకు సార్థకతను తెచ్చిన వ్యక్తి కమల్‌హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు.. ఆయన తరంలో కానీ, నేటి తరంలో కానీ ఎవరూ లేరన్నది నిజం. అభినయం పరంగానే కాకుండా, దర్శకునిగా, కథకునిగా, గాయకునిగా, నృత్యకారునిగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, నిర్మాతగా... పలు రంగాల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు కమల్. ప్రస్తుతం ఆయన ‘ఉత్తమవిలన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో.. దర్శకుడు లింగుస్వామితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కమల్ సంభాషణలు కూడా అందించడం విశేషం. తొలుత క్రేజీ మోహన్‌తో సంభాషణలు రాయించాలనుకున్నారాయన. అయితే.. కథ తనదే కాబట్టి తానే స్వయంగా సంభాషణలు రాస్తే బావుంటుందని కమల్ భావించడంతో కొంత విరామం తర్వాత ఆయన కలం చేతబట్టారట. ఓ సీనియర్ సూపర్‌స్టార్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ అభినయం ప్రేక్షకుల్ని తన్మయత్వానికి లోను చేస్తుందని చెన్నయ్ టాక్. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: గిబ్రన్. -
డైలాగ్ రైటర్‌గా కంగనా
‘‘నేను మైనపు ముద్దలాంటిదాన్ని. ఓ పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతాను’’ అని పలు సందర్భాల్లో కంగనా రనౌత్ పేర్కొన్నారు, హాట్ గాళ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కంగనా ‘తను వెడ్స్ మను’తో పక్కింటి అమ్మాయిలా ఉందని కూడా అనిపించుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘రజ్జో’లో బ్రహ్మాండంగా నటించారు. కేరక్టర్ ఇన్‌స్పయిర్ చేస్తే చాలు... ఏమైనా చేయడానికి వెనకాడరు కంగనా. ప్రస్తుతం ‘క్వీన్’లో తాను పోషిస్తున్న పాత్ర ఈ బ్యూటీ క్వీన్‌కి బాగా నచ్చింది. దాంతో ఆ పాత్రకు డైలాగులు తానే రాస్తే బాగుంటుందని భావించారామె! అంతేకాదు... ఆ పని చేసి చూపించారు కూడా! దీనిపై చిత్రదర్శకుడు వికాస్ బాల్ మాట్లాడుతూ - ‘‘ఇందులో కంగనా ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. బిడియం, అమాయకత్వం కలగలసిన పాత్ర ఇది. ఈ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుందో కంగనా బాగా అవగాహన చేసుకుంది. దాంతో డైలాగ్స్ రాసింది. తను రాసిన డైలాగ్స్ కథ మరింత మెరుగవడానికి దోహదపడ్డాయి’’ అని చెప్పారు. కేవలం నటనే కాకుండా సినిమాకి సంబంధించిన ఇతర శాఖలంటే కూడా కంగనాకి ఇష్టం. అందుకే, త్వరలో షూటింగ్స్ నుంచి ఓ చిన్న బ్రేక్ తీసుకుని విదేశాలకెళ్లి, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ కోర్స్ కూడా చేయాలనుకుంటున్నారు కంగనా. సో.. భవిష్యత్తులో కంగనా మెగాఫోన్ పట్టినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు మరి!.