
ఆర్‌ఎక్స్ 100 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియోలో వైరల్ అవుతుంటాయి. అజయ్ భూపతి కథ రచయితగా స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సయ్యద్ మాటల రచయితగా వ్యవహరించాడు. తొలి సినిమాతోనే తనదైన మాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్, ప్రశాంత్ వర్మ తీసిన “కల్కి” “జాంబిరెడ్డి” చిత్రాలకు మంచి డైలాగ్స్ అందించి తన సత్తా చాటుకున్నాడు.
ప్రస్తుతం సయ్యద్ ‘మహా సముద్రం’ సినిమాతో పాటు శ్రీహాన్ క్రియెషన్స్ లో ఒక వెబ్ ఫిల్మ్, సురేశ్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి మాటలు అందించారు. ఇలా తన ప్రతిభతో మంచి మంచి అవకాశాలతో రాణిస్తున్న ఈ యంగ్ డైలాగ్ రైటర్ ఇప్పుడు ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు కథ చెప్పటం, వారికి నచ్చటంతో సయ్యద్ కి ఈ అవకాశం వచ్చింది. ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment