భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా' )
మనోజ్ ముంతశిర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు.
(ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి)
Comments
Please login to add a commentAdd a comment