యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్‌తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై ఆదిపురుష్ కథ రచయిత స్పందించారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న విమర్శలకు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా సమాధానమిచ్చారు.
(ఇది చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!)
మనోజ్ ముంతశిర్ మాట్లాడుతూ.. 'మేము తీసింది రామాయణం కాదు.. మేము రామాయణం నుంచి స్ఫూర్తి పొందాం. ఈ విషయాన్ని మేం డిస్‌క్లైమర్‌లో కూడా ప్రస్తావించాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం కూడా. దీని గురించి మరోసారి వివరణ ఇస్తున్నా. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు.' అని అన్నారు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్‌పై తాజాగా రచయిత ఇచ్చిన వివరణపై సినీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో!.
(ఇది చదవండి: నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో )
Comments
Please login to add a commentAdd a comment