నంది అవార్డు గ్రహీత, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సత్యానంద్ తన సినీ ప్రస్థానం ప్రారంభించి 50 పూర్తయిన సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సేవలను కొనియాడుతూ ఫోటోలు పంచుకున్నారు.
మెగాస్టార్ తన ట్విటర్‌లో రాస్తూ..' ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా ఉంటూ.. ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్ గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీ విద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.' అని రాసుకొచ్చారు.
(ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?)
అంతే కాకుండా..' ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను. మోర్ పవర్ టూ యూ' అంటూ ప్రశంసలు కురిపించారు. ట్వీట్‌తో పవన్ కల్యాణ్, నాగబాబుతో దిగిన ఫోటోను షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన సత్యానంద్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది అగ్ర నటులతో పనిచేశారు. చిరంజీవి, శివాజీ గణేశన్, నందమూరి తారక రామారావు, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ సినిమాలకు సేవలందించారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి (1976), అర్ధాంగి (1977), అమెరికా అల్లుడు(1985), క్షణ క్షణం(1991), అన్నయ్య(2000) లాంటి మరెన్నో చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు.
(ఇది చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే)
అంతే కాకుండా మోసగాడు(1980), గూండా (1984), యముడికి మొగుడు (1988), పెళ్లాం ఊరెళ్లితే (2003), సుభాష్ చంద్రబోస్ (2005) చిత్రాలకు సత్యానంద్ స్క్రిప్ట్‌లు రాశారు. సముద్రం(1999), ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి(2004), నచ్చావులే (2008), రారండోయ్ వేడుక చూద్దాం(2017) చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు.
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023
స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2
Comments
Please login to add a commentAdd a comment