Satyanand
-
గతంలో గురువుకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. ఇంటికి వెళ్లి మరీ..
స్టార్ హీరో ప్రభాస్ స్టయిలే వేరు. సినిమాల ఎంపికలోనే కాదు ఆతిథ్యంలోనూ అదే తీరు ప్రదర్శిస్తుంటాడు డార్లింగ్ హీరో! తనకు నచ్చినవాళ్ల కోసం ఇంట్లో వంట చేయించి మరీ విందు ఇస్తాడు. ఒక్కోసారి సెట్లోకి అందరికీ సరిపడా ఆహారం తీసుకుచ్చి మరీ ఆప్యాయంగా వడ్డిస్తుంటాడు. అప్పుడప్పుడూ బహుమతులు పంపిస్తూ సర్ప్రైజ్ చేస్తుంటాడు కూడా! తన తోటివారిపై అంత ప్రేమ చూపిస్తుంటాడీ బాహుబలి. గురువు బర్త్‌డే అంటే ఆమాత్రం ఉంటది తనకు నటనలో ఓనమాలు నేర్పిన గురువు సత్యానంద్‌కు అప్పట్లో ఖరీదైన బహుమతిచ్చాడు ప్రభాస్. సత్యానంద్ పుట్టినరోజు పురస్కరించుకుని తన ఇంటికి వెళ్లి మరీ గిఫ్ట్ ఇచ్చాడు. బంగారు వాచ్‌ను గురువు చేతికి తొడిగి మరీ సంతోషించాడు. 'ఇది నిజమైన బంగారం, పొరపాటున ఎక్కడ పడితే అక్కడ పడేయకండి' అని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. సలార్‌తో ముందుకు రానున్న ప్రభాస్ గత కొంతకాలంగా ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ప్రభాస్ ఈ నెలలో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన సలార్: సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. Dino #Prabhas chose gold watch for GuruSatyanand Garu as a gift.While picking among multi colors he didnt forget 2 consult gurus son 2 decide on his favorite white colour& didnt miss teasing him saying not 2 throwaway chains during adjustment as they r pure gold❤️#PrabhasGirlsFC pic.twitter.com/Z63TDyMn3D — PrabhasGirlsFC (@PrabhasGirlsFC) December 5, 2023 చదవండి: ఆవేశంతో కాల్పులు.. ప్రముఖ నటుడు అరెస్ట్.. -
సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు
నంది అవార్డు గ్రహీత, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సత్యానంద్ తన సినీ ప్రస్థానం ప్రారంభించి 50 పూర్తయిన సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సేవలను కొనియాడుతూ ఫోటోలు పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్విటర్లో రాస్తూ..' ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా ఉంటూ.. ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్ గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీ విద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.' అని రాసుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) అంతే కాకుండా..' ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను. మోర్ పవర్ టూ యూ' అంటూ ప్రశంసలు కురిపించారు. ట్వీట్‌తో పవన్ కల్యాణ్, నాగబాబుతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన సత్యానంద్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది అగ్ర నటులతో పనిచేశారు. చిరంజీవి, శివాజీ గణేశన్, నందమూరి తారక రామారావు, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ సినిమాలకు సేవలందించారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి (1976), అర్ధాంగి (1977), అమెరికా అల్లుడు(1985), క్షణ క్షణం(1991), అన్నయ్య(2000) లాంటి మరెన్నో చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు. (ఇది చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే) అంతే కాకుండా మోసగాడు(1980), గూండా (1984), యముడికి మొగుడు (1988), పెళ్లాం ఊరెళ్లితే (2003), సుభాష్ చంద్రబోస్ (2005) చిత్రాలకు సత్యానంద్ స్క్రిప్ట్‌లు రాశారు. సముద్రం(1999), ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి(2004), నచ్చావులే (2008), రారండోయ్ వేడుక చూద్దాం(2017) చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2 — Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023 -
‘కొండవీటి సింహం’ @ 40 ఇయర్స్
ఫ్యాషన్... సినిమా... ఈ రెండు రంగాల్లో కాలాన్ని బట్టి ట్రెండ్ మారిపోవడం సహజం. అలా ట్రెండ్ మార్చినవీ, మార్చిన ట్రెండ్‌లో వచ్చినవీ సంచలన విజయం సాధిస్తాయి. తెలుగు వాణిజ్య సినిమాకు ‘అడవి రాముడు’ ఓ ట్రెండ్‌సెట్టర్. అక్కడ నుంచి ‘వేటగాడు’ (1979) దాకా వరుసగా ఆరు పాటలు, 3 ఫైట్ల ఆ కమర్షియల్ ధోరణిదే రాజ్యం. ఆ వైఖరిని మార్చింది – కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ (1980). ఆ సంగీతభరిత కళాత్మక చిత్రం తరువాత ‘గజదొంగ’ లాంటి కమర్షియల్ సినిమాలకు మునుపటి జోరు తగ్గింది. దాంతో, మాస్ హీరోల వాణిజ్య సినిమా పాత పద్ధతి మార్చుకోవాల్సి వచ్చింది. కొత్త దారి తొక్కి, తనను తాను పునరావిష్కరించుకొనే పనిలో పడింది. ఆ మథనంలో నుంచి వచ్చినదే – మెలోడ్రామా నిండిన పెద్ద వయసు హీరో పాత్రల ట్రెండ్. తండ్రీ కొడుకుల పాత్రలు అంతఃసంఘర్షణ పడే స్టార్ హీరో డ్యుయల్ రోల్ ఫార్ములా. ఎన్టీఆర్ – దాసరి ‘సర్దార్ పాపారాయుడు’ నుంచి తెలుగు తెరపై ఇది బాక్సాఫీస్ విజయసూత్రమైంది. పాపారాయుడు సంచలన విజయం తరువాత ఎన్టీఆర్ చేసిన అలాంటి మరో తండ్రీ కొడుకుల డ్యుయల్ రోల్ బాక్సాఫీస్ హిట్ – ‘కొండవీటి సింహం’. 1981 అక్టోబర్ 7న రిలీజైన ఈ బాక్సాఫీస్ హిట్‌కు నేటితో 40 ఏళ్ళు. శివాజీ అడ్డుపడ్డ తమిళ ‘తంగపతకం’తోనే... బాక్సాఫీస్ హిట్ ‘కొండవీటి సింహం’ కథకు మూలం శివాజీగణేశన్ నటించిన తమిళ ‘తంగపతకం’ (1974 జూన్ 1). అదే పేరుతో వచ్చిన ఓ తమిళ నాటకం ఆ సినిమాకు ఆధారం. తమిళనాట సూపర్ హిట్టయిన ఆ కర్తవ్యదీక్షా పరుడైన పోలీసు అధికారి సెంటిమెంటల్ కథాచిత్రం తెలుగు రైట్స్ నటుడు అల్లు రామలింగయ్య కొన్నారు. అప్పటికే ఆయన ‘బంట్రోతు భార్య’ (1974), ‘దేవుడే దిగివస్తే’ (1975)తో చిత్ర నిర్మాతగానూ ఎదిగారు. తెలుగులో ఎన్టీఆర్‌తో ఈ రీమేక్ నిర్మించాలని అల్లు రామలింగయ్య అనుకున్నారు. నిజానికి, శివాజీ గణేశన్ కెరీర్ బెస్ట్ సినిమాలు అనేకం తెలుగులో ఎన్టీఆరే చేశారు. ‘కలసి ఉంటే కలదు సుఖం’ (తమిళ ‘భాగ పిరివినై’), ‘గుడిగంటలు’ (‘ఆలయమణి’), ‘రక్తసంబంధం’ (‘పాశమలర్’), ‘ఆత్మబంధువు’ (‘పడిక్కాదమేదై’) – ఇలా అనేకం అలా సూపర్ హిట్ రీమేక్స్ అయ్యాయి. కానీ, ఎందుకనో ఈసారి శివాజీగణేశన్‌కు మనస్కరించలేదు. ‘తంగపతకం’ తనకే మిగిలిపోవాలని అనుకున్నట్టున్నారు. అందుకే, ఆ చిత్రాన్ని శివాజీయే సమర్పిస్తూ, అల్లుతో ‘బంగారు పతకం’ (1976) పేరిట తెలుగులో డబ్బింగ్ చేయించారు. ఆ డబ్బింగ్ చిత్రం కూడా హిట్టే. కానీ, అలా మిస్సయిన ఆ సెంటిమెంట్ కథలోని అంశాలే సరిగ్గా మరో ఏడేళ్ళకు ‘కొండవీటి సింహం’కి పునాది అయ్యాయి. ‘వేటగాడు’ హిట్ తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా కోసం రోజా మూవీస్ అధినేత ఎం. అర్జునరాజు రెండేళ్ళు నిరీక్షించారు. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ ఓకే కాగానే, దర్శక, రచయితలతో ఆ పాత తమిళ హిట్ మళ్ళీ చర్చకు వచ్చింది. రైట్స్ సమస్య వచ్చే ‘తంగపతకం’ రీమేక్‌లా కాకుండా, అదే కథను వేరే పద్ధతిలోకి మార్చారు. మాస్, సెంటిమెంట్ రెండూ పండేలా రచయిత సత్యానంద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘కొండవీటి సింహం’ కథను తీర్చిదిద్దారు. శివాజీ కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటైన ఆ పోలీసు కథ, ఆ పాత్ర, అదే క్యారెక్టరైజేషన్ తెలుగులో మళ్ళీ ఎన్టీఆరే చేశారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల చరిత్ర సృష్టించారు. (చదవండి: Prabhas: ప్రభాస్‌కు అబద్ధం ఎందుకు చెప్పావు? నటుడికి యంగ్ హీరో క్వశ్చన్) చిరంజీవిని అనుకొని మోహన్‌బాబుతో...ఎన్టీఆర్ ‘వేటగాడు’ హిందీ రీమేక్ ‘నిషానా’ రజతోత్సవం జరిపిన రోజునే, 1981 మే 21న మద్రాసు ప్రసాద్ స్టూడియోలో‘కొండవీటి సింహం’ షూటింగ్ ప్రారంభమైంది. తమిళ కథకు భిన్నంగా తెలుగులో సిన్సియర్ పోలీసాఫీసర్ తండ్రికి ఇద్దరు కొడుకులు. ఒకడు మంచివాడు, రెండోవాడు చెడ్డవాడు. తండ్రి, మంచి కొడుకు పాత్రల్లో హీరో ద్విపాత్రాభినయం. అదీ ప్రధానమైన మార్పు. ఎస్పీ రంజిత్ కుమార్‌గా, కొడుకు రాముగా ఎన్టీఆర్ జీవం పోశారు. ఇక, తండ్రికి తలవంపులు తెచ్చే చెడ్డ కొడుకుగా మోహన్‌బాబు నటనకు మంచి పేరొచ్చింది. నిజానికి, ఈ చెడ్డ కొడుకు పాత్రకు దర్శక, నిర్మాతలు మొదట అనుకున్న నటుడు – నేటి మెగా హీరో చిరంజీవి. పాటలు, డ్యాన్సులు, విలన్ తరహా పాత్రలతో పేరు తెచ్చుకుంటున్న చిరంజీవి పేరుతో సహా తారాగణం వివరాల పత్రికా ప్రకటన కూడా చేశారు. స్క్రిప్టులో హీరోయిన్ గీత టైప్మిషన్ దగ్గర ఐ లవ్యూ చెప్పే సీన్లో ఒక డ్యూయెట్ కూడా అనుకున్నారు. అంతకు ముందు అంతగా ఆడని ‘తిరుగులేని మనిషి’లో తొలిసారిగా ఎన్టీఆర్‌తో కలసి చిరంజీవి నటించారు. సెంటిమెంట్లు బలంగా పనిచేసే సినీరంగంలో చివరకు ‘కొండవీటి సింహం’లోని నెగటివ్ పాత్రకు చిరంజీవి బదులు మోహన్‌బాబును తీసుకున్నారు. చిరంజీవి కోసం అనుకున్న డ్యూయెట్‌ను కూడా స్క్రిప్టులో నుంచి తొలగించేశారు. ఎన్టీఆర్‌తో కొత్త క్లైమాక్స్... రీషూట్! చెడ్డవాడైన కొడుకును పోలీసు విధి నిర్వహణలో తండ్రే చంపేయడం, ఆ అంకితభావానికి మెచ్చి ప్రభుత్వం బంగారు పతకం ఇవ్వడం – శివాజీ ‘తంగపతకం’ క్లైమాక్స్. ‘కొండవీటి సింహం’కి కూడా మొదట ఎన్టీఆరే, కొడుకు మోహన్‌బాబును చంపినట్టు, అదే రకం క్లైమాక్స్ తీశారు. కానీ, ఆ తర్వాత ఎందుకనో దర్శక, రచయితలు పునరాలోచనలో పడ్డారు. కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్టు తీస్తే, సెంటిమెంట్ మరింత పండుతుందని భావించారు. నిజానికి, అప్పటికే 3 షెడ్యూళ్ళలో 30 రోజుల్లో సినిమా అయిపోయింది. అలాంటిది మళ్ళీ ఆ ఏడాది ఆగస్టు చివరలో ఒక వారం అదనపు డేట్లు తీసుకొని, హొగెనకల్ వెళ్ళి, కొత్త క్లైమాక్స్ తీశారు. అలా ఇప్పుడు సినిమాలో ఉన్న రెండో క్లైమాక్స్ వచ్చింది. క్రాంతికుమార్ అంచనా తప్పింది! అయిపోయిన చిత్రాన్ని రీషూట్ చేస్తున్నారనే సరికి, ఎన్నో అనుమానాలు, సినిమా బాగా లేదనే పుకార్లు షికారు చేశాయి. కొత్త క్లైమాక్స్‌తో సినిమా సిద్ధమయ్యాక, సలహా కోసం సీనియర్ దర్శక – నిర్మాత క్రాంతికుమార్‌కు ప్రివ్యూ చూపించారు. ‘మొదటి 10 నిమిషాలు, చివరి 10 నిమిషాలే ఇది ఎన్టీఆర్ సినిమా. మిగతా అంతా ఏయన్నార్ సినిమాలా ఉంది. జనం మెచ్చరు’ అంటూ ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రంపై పెదవి విరిచారు. దాంతో, నిర్మాతలూ కొంత భయపడి, రిలీజుకు ముందే అన్ని ఏరియాలూ సినిమా అమ్మేశారు. తీరా రిలీజయ్యాక ‘కొండవీటి సింహం’ ఆ భయాలు, అనుమానాలను బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టింది. 1981 అక్టోబర్ 7న విజయదశమి కానుకగా రిలీజైన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. సినిమా ప్రదర్శన హక్కులు కొన్న ప్రతి ఒక్కరికీ పెట్టిన రూపాయికి అయిదు నుంచి పది రూపాయల లాభం రావడం అప్పట్లో సంచలనం. కన్నీటికి... మహిళల కలెక్షన్ల వాన పెద్ద వయసు భార్యాభర్తల అనురాగాలు, అనారోగ్యంతో చక్రాల కుర్చీకే భార్య పరిమితమైతే భర్తే ఆమెకు సేవలు చేసే అనుబంధాలు, దారితప్పిన కొడుకుతో తల్లితండ్రుల అంతఃసంఘర్షణ, కన్నతల్లి కడచూపునకు కూడా రాని కొడుకు అమానవీయత – ఇవన్నీ ‘కొండవీటి సింహం’ కథకు ఆయువుపట్టు. మాస్ అంశాలకు, మనసును ఆర్ద్రంగా మార్చే ఈ లేడీస్ సెంటిమెంట్ తోడవడంతో మహిళలు తండోపతండాలుగా వచ్చి, ఈ సినిమాను మెచ్చారు. ‘మా ఇంటిలోన మహలక్ష్మి నీవే...’ అంటూ ఎన్టీఆర్, జయంతిపై వచ్చే కరుణ రస గీతం జనం గుండెల్లో నిలిచిపోయింది. కన్నీళ్ళతో కరిగిన రిపీట్ లేడీ ఆడియన్స్ ఘన నీరాజనంతో కలెక్షన్ల వర్షం కురిసింది. బాక్సాఫీస్ సింహగర్జన కర్తవ్యనిర్వహణ అనే మాస్ ఎలిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ – రెండింటినీ రంగరించిన చిత్రం ఇది. ఎస్పీ రంజిత్ కుమార్‌గా తండ్రి పాత్రలో ఎన్టీఆర్ గంభీరమైన నటనకు జనం జేజేలు పలికారు. ఆ రోజుల్లో 47 ప్రింట్లతో, 43 కేంద్రాల్లో ‘కొండవీటి సింహం’ రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో క్రిక్కిరిసిన ప్రేక్షకులతో 70 రోజులాడింది. అప్పటికి అత్యధికంగా 37 కేంద్రాలలో వంద రోజులు జరుపుకొంది. ఏకంగా 15 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. వైజాగ్‌లో షిఫ్టులతో 315 రోజులు ప్రదర్శితమైంది. అలాగే, లేట్ రన్లో సైతం ఈ బాక్సాఫీస్ సింహం దాదాపు 200 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 15 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఫస్ట్ రిలీజుకు నాలుగు నెలల తర్వాత రిలీజైన అనకాపల్లిలో నేరుగా 178 రోజులు ఆడి, లేట్ రన్లో ఇప్పటికీ స్టేట్ రికార్డుగా నిలిచి ఉంది. (చదవండి: ChaySam: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్ వైరల్) సీమలో 4 ఆటల సంస్కృతి విశేషం ఏమిటంటే, సాధారణంగా వారం, రెండు వారాలు మాత్రమే సినిమాలు ఆడే మారుమూల ‘సి’ క్లాస్ సెంటర్లలో సైతం విపరీతమైన మహిళాదరణ ఫలితంగా ‘కొండవీటి సింహం’ 50 రోజులు ఆడింది. పలు కేంద్రాల్లో మునుపటి రికార్డ్ చిత్రాల వంద రోజుల వసూళ్ళను, నాలుగంటే 4 వారాలకే దాటేసింది. ఒకప్పుడు రాయలసీమ ఏరియాలో సాధారణంగా ఫస్ట్ షో, సెకండ్ షోలే ఎక్కువ రోజులు వేసేవారు. ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ చిత్రం సీమలో మ్యాట్నీతో సహా 3 ఆటలను రెగ్యులర్ షోల పద్ధతిగా అలవాటు చేసింది. ఇక, రెగ్యులర్ గా మార్నింగ్ షోల సంస్కృతిని ప్రవేశపెట్టి, రోజూ 4 ఆటల పద్ధతిని నేర్పింది – ఎన్టీఆర్‌దే ‘కొండవీటి సింహం’. ఆనాటి ఇండస్ట్రీ రికార్డ్... ఇదే! వసూళ్ళపరంగా ఇండస్ట్రీ రికార్డుల్లోనూ ఎన్టీఆర్ కాలంతో పోటీపడ్డారు. యాభై రోజులకు ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ రూ. 81 లక్షలతో రికార్డు. తరువాత ఎన్టీఆర్‌దే ‘వేటగాడు’ రూ. 96 లక్షలతో కొత్త రికార్డయింది. ఇక, ‘కొండవీటి సింహం’ యాభై రోజులకు కనివిని ఎరుగని రీతిలో రూ. 1.21 కోట్ల గ్రాస్ సంపాదించింది. అప్పటికి సరికొత్త ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. అప్పట్లో వంద రోజులకు సింగిల్ థియేటర్ కలెక్షన్లలో స్టేట్ రికార్డులూ పెద్ద ఎన్టీఆర్వే. ‘అడవి రాముడు’ (1977 – హైదరాబాద్ ‘వెంకటేశా’ థియేటర్లో) రూ. 9.40 లక్షలు ఆర్జించింది. ఆ వెంటనే ‘వేటగాడు’ (హైదరాబాద్ ‘సంగమ్’లో) రూ. 9.90 లక్షలు సంపాదించింది. ‘కొండవీటి సింహం’ (వైజాగ్ ‘శరత్’లో) రూ. 9.95 లక్షలు తెచ్చింది. దాసరి – ఎన్టీఆర్ కాంబినేషన్లోని ‘బొబ్బిలిపులి’ (1982– హైదరాబాద్ ‘సుదర్శన్’లో) ఏకంగా రూ. 10.06 లక్షలు సంపాదించి, పై మూడు రికార్డులనూ దాటేసింది. అలా 1977 నుంచి 1982 దాకా ఆరేళ్ళ పాటు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలుకొడుతూ దూసుకెళ్ళి, ఏకంగా రాజకీయ సింహాసనాన్నే అధిష్ఠించేశారు. జయంతి సెకండ్ ఇన్నింగ్స్ షురూ! తమిళంలో కె.ఆర్. విజయ చేసిన తల్లి పాత్రకు ఇటీవలే కన్నుమూసిన సీనియర్ నటి జయంతి తెలుగులో ప్రాణం పోశారు. చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యంతో ఈ సినిమాలోని 7 పాటలూ హిట్టే. శ్రీదేవితో వచ్చే ‘బంగినపల్లి మామిడిపండు..’, ‘అత్త మడుగు వాగులోన..’, ‘వానొచ్చే వరదొచ్చే..’, ‘పిల్ల ఉంది..‘ లాంటి మాస్ పాటలతో పాటు జయంతితో వచ్చే ‘ఈ మధుమాసంలో ఈ దరహాసంలో..’ లాంటి హుందా డ్యూయట్ కూడా నేటికీ నాటి ప్రేక్షక జనం నోట నానుతుండడం గమనార్హం. ఎన్టీఆర్ ‘జగదేక వీరుని కథ’ (1961)తో మొదలైన జయంతి ప్రస్థానం సరిగ్గా ఇరవై ఏళ్ళ తరువాత అదే ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘కొండవీటి సింహం’తో కొత్త మలుపు తిరిగింది. ఈ తరహా సెంటిమెంటల్ భార్య, అమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరయ్యారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో కృష్ణ ‘రక్తసంబంధం’ సహా పలువురు పెద్ద హీరోల ఓల్డ్ క్యారెక్టర్లకు ఆమె సరిజోడీ అయ్యారు. ఈ కథ సత్తా అది... కొన్ని కథలు ఏ భాషలోకి వెళ్ళినా సార్వజనీనంగా మెప్పిస్తాయి. ‘తంగపతకం’ డ్రామా హిట్. అదే పేరుతో సినిమాగా (1974) తమిళంలో పెద్ద హిట్. దాన్ని తెలుగులో ‘బంగారుపతకం’ (1976)గా అనువదిస్తే, అదీ హిట్టు. రైట్స్ లేని ఆ కథనే కొంతమార్చి, ‘కొండవీటి సింహం’ (1981) చేస్తే బాక్సాఫీస్ రికార్డు. హిందీలో ఈ కొత్త కథను జితేంద్ర, హేమమాలినితో ‘ఫర్జ్ ఔర్ కానూన్’ (1982 ఆగస్ట్ 6)గా ఇదే దర్శక, నిర్మాతలు చేస్తే అదీ ఓకే. మరోపక్క ‘తంగపతకం’ అధికారిక హిందీ రీమేక్‌గా దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్లు కలసి నటించిన ఏకైక చిత్రం ‘శక్తి’ (1982 అక్టోబర్ 1) రిలీజైంది. రమేశ్ సిప్పీ దర్శకత్వంలో అదీ బంపర్ హిట్. అన్నయ్య పోలీసు – తమ్ముడు దొంగ – వారి మధ్య ఘర్షణ, పిల్లల మధ్య నలిగిన తల్లి ఆత్మసంఘర్షణగా వచ్చిన అమితాబ్ సూపర్‌హిట్ ‘దీవార్’ (1975)లోనూ ఈ కథ ఛాయలు కనిపిస్తాయి. వెరసి, అనేక భాషల్లో, అనేక కోణాల్లో తిరిగి, వెళ్ళిన ప్రతిచోటా విజయవంతం కావడం ఈ సెంటిమెంటల్ పోలీసు కథ బాక్సాఫీస్ సత్తా. ఒకే వేదికపై... రెండు సింహాలు 1982 జనవరి 21వ తేదీ సాయంత్రం మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలులో ‘కొండవీటి సింహం’ శతదినోత్సవం జరిగింది. షావుకారు జానకి వ్యాఖ్యాత్రిగా సాగిన ఉత్సవానికి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ అధ్యక్షత వహిస్తే, ఎన్టీఆర్‌కు సమకాలికుడైన మరో స్టార్ హీరో ఏయన్నార్ ముఖ్య అతిథిగా వచ్చి, జ్ఞాపికలు అందజేశారు. ఎన్టీఆర్‌పై సభాంగణం బాల్కనీ నుంచి అభిమానులు పుష్పవృష్టి కురిపించడం విశేషం. ఎన్టీఆర్, ఏయన్నార్లను రెండు సింహాలుగా ప్రస్తావిస్తూ, 'ఈ ఇద్దరు ఉన్నంత కాలం తెలుగు సినీ పరిశ్రమకు ఏ బాధా లేద'ని ఎల్వీ ప్రసాద్ పేర్కొనడం విశేషం. ఎన్టీఆర్ సింహమే కానీ, శారీరకంగా తాను సింహం కాదని ఏయన్నార్ అంటే – దానికి ఎన్టీఆర్ తన ప్రసంగంలో బదులిచ్చారు. శారీరకంగా సింహం కాకపోవచ్చేమో కానీ, మేధాపరంగా అలాంటివాడే ఏయన్నార్ అన్నారు. 'చిన్న విగ్రహమైనప్పటికీ గాంధీ ప్రజల్ని సమీకరించి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు కదా' అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఇక, ఒకానొకప్పుడు తాను రిటైర్ అవుతానంటే, ‘బ్రదర్! ఆర్టిస్టు రిటైర్ కాకూడదు’ అని సలహా ఇచ్చింది ఎన్టీఆరే అని వేదికపై ఏయన్నార్ వెల్లడించారు. ‘ప్రేక్షకులు ఆదరించినంత కాలం మేమిద్దరం సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు’ అని తమ ఇద్దరి తరఫున ఎన్టీఆర్ ఆ సభలో ప్రకటించడం విశేషం. మొత్తానికి, ‘కొండవీటి సింహం’ శతదినోత్సవ సంరంభం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం. రాజకీయాల్లోకి... ఘనమైన సినీ వీడ్కోలు ఎంట్రీ ఎంత గొప్పగా ఉంటుందో, ఎగ్జిట్ కూడా అంతే హుందాగా, గౌరవంగా ఉండాలంటారు. జనాదరణతో ముడిపడిన సినీరంగంలో ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు. మరీ ముఖ్యంగా స్టార్లు. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు నటరత్న ఎన్టీరామారావుకు అలాంటి అద్భుతమైన విజయాలతో తెలుగు సినీ పరిశ్రమ నుచి ఘనమైన వీడ్కోలు దక్కింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ముందు వరుసగా దక్కిన నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్లలో ‘కొండవీటి సింహం’ రెండోది. దేశభక్తి, స్వాతంత్య్ర సమర నేపథ్యంలో ‘సర్దార్ పాపారాయుడు’, చట్టం – పోలీసు వ్యవస్థతో ‘కొండవీటి సింహం’, న్యాయవ్యవస్థతో ‘జస్టిస్ చౌదరి’, సైన్యం – విప్లవ నేపథ్యంతో ‘బొబ్బిలిపులి’ – ఇలా నాలుగూ నాలుగు వేర్వేరు నేపథ్యాలతో, విభిన్నమైన చిత్రాలు కావడం విశేషం. అన్నీ సంచలన విజయాలే. ఆ రోజుల్లో ఈ 4 సినిమాల డైలాగులూ ఎల్పీ రికార్డులుగా రావడం మరో విశేషం. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన కొత్తల్లో ‘కొండవీటి సింహం’ డైలాగ్‌లు క్యాసెట్లుగా వచ్చి, ఊరూవాడా మారుమోగడం మరీ విశేషం. వెరసి, ఎన్టీఆర్ కెరీర్లో, అలాగే తెలుగు బాక్సాఫీస్ చరిత్రలో ‘కొండవీటి సింహం’ అప్పటికీ, ఇప్పటికీ స్పెషల్. – రెంటాల జయదేవ -
రెండో అల్లుడి మొదటి మూవీ
మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రెడీ అవుతున్నారు. యస్.. మీ గెస్ కరెక్టే. ఇక్కడున్న ఫొటో చూడగానే చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ అరంగేట్రానికి రంగం షురూ అయిందని ఊహించేసి ఉంటారు. వచ్చే ఏడాది కల్యాణ్ కెమెరా ముందుకు రానున్నారు. ‘అందాల రాక్షసి’, ‘ఈగ’, ‘లెజెండ్’, ‘దిక్కులు చూడకు రామయ్య’... ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వారాహి చలన చిత్రమ్ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడిగా జస్ట్ వన్ మూవీ ఓల్డ్ అయిన రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అసలు ఈ ప్రాజెక్ట్‌కి ఎలా శ్రీకారం జరిగింది? అనేది రాకేశ్ శశి మాటల్లో తెలుసుకుందాం. ‘‘డైరెక్టర్‌గా నా ఫస్ట్ మూవీ ‘జత కలిసే’ చూసి, సాయి కొర్రపాటిగారు ఇంప్రెస్ అయ్యారు. ఆయనే ఆ సినిమాని రిలీజ్ చేశారు. అప్పుడే వారాహి బ్యానర్లో దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని మాటిచ్చారాయన. మంచి కథ రెడీ చేసుకున్నా.వైజాగ్ సత్యానంద్‌గారు ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు కాబట్టి, ఎవరైనా కొత్త హీరో ఉంటే చెప్పమని ఆయన్ను అడిగా. కథ కూడా చెప్పాను. ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌కి అయితే కరెక్ట్‌గా సూట్ అవుతుంది’’ అని సలహా ఇచ్చారు సత్యానంద్‌గారు. ‘నేనా.. చిరంజీవిగారి అల్లుడితోనా? చాన్స్ ఇస్తారా?’ అనుకున్నా. అయినా కల్యాణ్‌ను కలిసి, కథ చెప్పా. ఓకే అన్నారు. కానీ ‘ఓసారి మామయ్య చిరంజీవిగారికి కథ చెప్పండి’ అని కల్యాణ్ అన్నారు. అనుకోని కారణాల వల్ల చిరంజీవిగారితో నా ఫస్ట్ అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవిగారిని కలిసి, కథ చెప్పాం. ఆయన ఇంప్రెస్ అయ్యారు. కథ చాలా బాగుందని అభినందించారు. ఆ క్షణాలను మరచిపోలేను’’ అన్నారు రాకేశ్ శశి. మరి కల్యాణ్‌తో తీయబోయే సినిమా లవ్‌స్టోరీనా? అని అడగ్గా.. ‘‘లేదు. డిఫరెంట్ స్క్రిప్ట్. జనవరిలో లేదా ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్తాం. వారాహిలాంటి పెద్ద బేనర్, చిరంజీవిగారి అల్లుడు.. ఇలా నా రెండో సినిమాకే మెగా చాన్స్ కొట్టేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాకేశ్. -
ఫ్యాషన్ డిజైనర్లో స్టార్ మేకర్ వారసుడు
సీనియర్ దర్శకుడు వంశీ, ఒకప్పుడు సంచలన విజయం సాధించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈసినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ మేకర్ సత్యానంద్ వారసుడు నటిస్తున్నాడు. లేడీస్ టైలర్ సినిమాలో హీరో పాటు సినిమా అంతా కనిపించే కీలక పాత్ర బట్టల సత్యం, ఈ పాత్రకు కొడుకుగా సత్యానంద్ కొడుకు రాఘవేంద్ర నటిస్తున్నాడు. దాదాపు తెలుగు వెండితెర మీద గత పదిహేనేళ్లలో పరిచయం అయిన స్టార్ వారసులందరికీ గురువుగా గుర్తింపు తెచ్చుకున్న సత్యానంద్, ఫ్యాషన్ డిజైనర్ సినిమాతో తన వారసుడిగా రాఘవేంద్రను పరిచయం చేస్తున్నాడు. తండ్రి దగ్గరే నటనలో శిక్షణ పొందిన రాఘవేంద్ర కామెడీ పాత్రలో ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
స్వీట్ హార్ట్
‘‘నేత్ర’ చిత్రదర్శకుడు యాదకుమార్ నా శిష్యుడే. నేనిప్పటి వరకు 149 మందిని యాక్టర్స్‌గా తీర్చిదిద్దా. వారిలో తొంభై ఐదు మంది హీరోలయ్యారు. నేను, నా కుమారుడు కలిసి తొలిసారి ఈ చిత్రంలో నటించాం’’ అని వైజాగ్ సత్యానంద్ అన్నారు. గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మించిన చిత్రం ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. ఉదయ్‌నాగ్ రతన్ దాస్ స్వర పరచిన ఈ చిత్రం పాటలను నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ‘‘లవ్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. పీరికట్ల రాము, గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల, ఉదయ్‌నాగ్ రతన్ దాస్, నిర్మాత రామ సత్యనారాయణ, నటుడు శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు. -
నేత్ర ఎవరు?
గోపీచరణ్, ఐశ్వర్య జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తున్న సినిమా ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్... అనేది ఉపశీర్షిక. ‘‘ఈ నెలలో ఆడియో, నవంబర్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘లవ్ అండ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్. ‘నేత్ర’ ఎవరు? ఆమె ఎవర్ని ప్రేమించింది? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరం. స్టార్ మేకర్ సత్యానంద్, వాళ్లబ్బాయి కలసి నటించిన మొదటి చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. -
కొండవలస నా ఆత్మబంధువు
-నట శిక్షకుడు సత్యానంద్ విశాఖపట్నం : ప్రముఖ రంగస్థల, సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు నా ఆత్మబంధువుని, అలాంటి హాస్యప్రియున్ని కోల్పోవడం చాలా విచారకరమని సినీ దర్శకుడు, స్టార్‌మేకర్ ఎల్. సత్యానంద్ పేర్కొన్నారు. లక్ష్మణరావు మరణ వార్త తెలియగానే ఆవేదనకు గురయ్యానన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ లక్ష్మణరావు మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు నాటక రంగంలో ఆయనతో కలసి ప్రయాణం చేసానన్నారు. ప్రముఖ నాటక రచయిత అత్తిలి కృష్ణయ్య రచించిన ‘యుగ సంధ్య’అనే నాటికలో లక్ష్మణరావు కొర్లలయ్య పాత్ర ప్రదర్శిస్తే తాను బాలనటుడుగా రాముడి పాత్ర ప్రదర్శించానని తెలిపారు. అప్పట్లో లక్ష్మణరావు పోర్టులో ఉద్యోగం చేస్తున్న సమయంలో కృష్ణయ్య నాట్య భారతి సంస్థ ద్వారా లక్ష్మణరావుతో కలసి 20 నాటికలకు పైగా ప్రదర్శించామన్నారు. తూర్పు లేఖలు, యుగసంధ్య, దారితప్పిన ఆకలి, సారాంశం, టామీ టామీ, నిజం, వంటి ప్రాచుర్యం పొందిన నాటికల్లో ఆయనతో కలిసి నటించానని, అలాగే కొండవలస లక్ష్మణరావు స్వర రచనలో ‘స్వార్థం బలితీసుకొంది’అనే నాటకానికి తాను దర్శకత్వం వహించి ‘రామదాసు’ పాత్ర పోషించానన్నారు. తాను కూడా ఆ నాటికతోనే పాపులర్ అయ్యానని పేర్కొన్నారు. ఆ తర్వాత కొండవలస లక్ష్మణరావు కళా లహరి సంస్థ ద్వారా ప్రముఖ రంగస్థల, సినీ రచయితలు ఆకెళ్ల సూర్యానారాయణ, కాశీవిశ్వనాథ్‌తో కలసి పాపులర్ అయ్యారని తెలిపారు. తూర్పు లేఖల నాటికలో తాను సూరయ్య పాత్ర (80ఏళ్ల వయస్సు ముసలివాడిగా)ను, లక్ష్మణరావు తన కొడుకుగా (చుక్కడు)పాత్రలో నటించి మెప్పించామని చెబుతూ లక్ష్మణరావుతో తనకు గల ఆత్మీయ బంధాన్ని స్మరించుకున్నారు. -
వంద మంది కథా నాయకులను అందిస్తా
స్టార్ ఫిల్మ్ మేకర్ సత్యానంద్ సీతమ్మధార: విశాఖలో పుట్టిన తనకు ఎంతో మంది సినిమా నటులను తీర్చిదిద్దే అవకాశం కల్పించిన కళామతల్లికి సర్వదా రుణపడి ఉంటానని ఫిల్మ్ స్టార్ మేకర్ ఎల్.సత్యానంద్ అన్నారు. సీతమ్మధారలో నూతనంగా ఏర్పాటు చేసిన మిరాకిల్ డాన్స్ అకాడమీని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్రరంగానికి 100 మంది కథానాయకులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు సినీ రంగంలో ఎంతో కీర్తినార్జించిన 85 మంది ప్రముఖ కథానాయకులకు శిక్షణ ఇచ్చిన భాగ్యం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. మిరాకిల్ డాన్స్ అకాడమీ డెరైక్టర్ ఎం.డి.షకీల్ మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించి ఇప్పటికి పదేళ్లు పూర్తకావస్తుందన్నారు. నగరంలో అక్కయ్యపాలెం, ఎం.వి.పి.కాలనీలలో ఇప్పటికే తమ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు సీతమ్మధారలో నూతనంగా ప్రారంభించి బ్రాంచ్‌లో శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ ఓక్ ఫ్రీ స్కూల్ ైడె రెక్టర్ పి.వి.రాజు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నాన్న క్లాసుల్లో భలే సరదా
తండ్రి చిత్రసీమలో హేమాహేమీలను తయారు చేసిన స్టార్ మేకర్..నటనకు బాల శిక్షలాంటి ఇంటి వాతావరణం..యాక్టర్ కావాలనే కోరిక. ఇవుంటే చాలు సినీ ఫీల్డ్‌లో ప్రవేశించాలంటే..కానీ ఆ యువకుడు స్వతంత్రంగా తానేమిటో నిరూపించదలుచుకున్నాడు. నాన్నచాటు బిడ్డగా కాకుండా వెండితెరపై వెలుగులీనాలనుకున్నాడు. అందుకే అవకాశం కోసం ఎదురు చూశాడు కాస్త లేటైన లేటెస్టుగా ప్రేక్షకులను మెప్పించే కామేడీ రోల్స్‌ను ఎంచుకుని భేష్ అనిపించుకుంటున్నాడు..ఇంతకీ అతనెవరో కాదండి స్టార్ మేకర్ సత్యానంద్ తనయుడు రాఘవేంద్ర. తన సినీ జర్నీ గురించి అతని మాటల్లోనే... నేను టింపనీ స్కూల్లో చదివాను. నారాయణ కాలేజీలో ఇంటర్ చే శాను. అవంతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశాను. నాన్న స్టార్ మేకర్. అమ్మ స్కూల్ టీచర్. అమ్మ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. నీకు ఏ ఇంట్రస్ట్ ఉన్నా సరే అవన్నీ చదువు తర్వాతే అన్నారు. అందుకే బీటెక్ పూర్తి చేసి సినిమాల వైపు వచ్చాను. టాలెంట్ ఉంటేనే... నేను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు ‘బబ్లూ విత్ లవ్’ అనే ఒక ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఒక పక్క ఎగ్జామ్స్, షూటింగ్, క్లాసెస్...ఇలా అన్నీ క్లాష్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అటో ఇటో తెలియక క న్ఫ్యూజ్ అయ్యాను. అమ్మతో చెబితే ఇప్పుడు ఇవేమీ పెట్టుకోకు అని చెప్పారు. అందుకే ఇంజినీరింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేశాను. తర్వాత సంవత్సరం పాటు సినిమాల్లో ట్రై చేశాను. మా నాన్న ‘ఇతను మా అబ్బాయి.. ఇతనికి ఛాన్స్ ఇవ్వండి’ అని ఎప్పుడూ చెప్పరు. నీ అంతట నువ్వు వెళ్లు. ఆడిషన్ ఇవ్వు.. నచ్చితే తీసుకుంటారు. లేదంటే లేదు అని చెప్పేవారు. సినిమా ఫీల్డ్‌లోనే... బీటెక్ అయిపోయిన సంవత్సరం వరకు సినిమాల్లోనే ట్రై చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి కానీ పెద్ద క్యారెక్టర్స్‌కు రిజక్ట్ చేసేవారు. ఈలోగా నాకు ఒక జాబ్ వచ్చింది. సరే ఏదో ఒకటి చేయాలి కదా అని జాబ్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యాను. మరొక వారం రోజుల్లో జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న సమయంలో ఎమ్ఎస్ నారాయణ గారి అమ్మాయి శశికిరణ్ నుంచి ఫోన్ వచ్చింది. నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. దానికి నువ్వైతే కరెక్ట్‌గా సూట్ అవుతావు అని చెప్పింది. అమ్మను అడిగితే జాబ్ మళ్లీ వస్తుంది,ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయి అని చెప్పింది. అలా ‘సాహెబా సుబ్రమణ్యం’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పడ్డానండీ ప్రేమలో మరి’లో హీరో ఫ్రెండ్ రోల్ చేశాను. సినిమాటోగ్రఫీ ఇంట్రస్ట్... నాన్న చెప్పే క్లాసులు చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాను. ఫ్రేమింగ్ మీద సైన్స్ క్లాస్ ఉండేది. ఎప్పుడైతే అవి విన్నానో నాకు సినిమాటోగ్రఫీ మీద ఇంట్రస్ట్ వచ్చింది. కెమెరా యాంగిల్స్ ఇలా పెట్టాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా చూసుకోవాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకున్నాను. 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఇలా మొత్తం సైన్స్ ఉంటుంది. అది నచ్చి సినిమాటోగ్రఫీ వైపు వచ్చాను. తర్వాత యాక్టింగ్‌లోకి వచ్చాను. నాన్న చెప్పే క్లాసులు అన్నీ సరదా సరదాగా ఉంటాయి.. బాగా ఎంజాయ్ చేసేవాడిని. స్టార్స్‌ను చూస్తూ పెరిగాను... నా చిన్నప్పటి నుంచి నాన్న ట్రైనింగ్ ఇచ్చే యాక్టర్స్‌ను చూస్తూ పెరిగాను. ప్రభాస్‌కు ట్రైనింగ్ ఇస్తున్న దగ్గర నుంచీ నేను అక్కడే ఉండేవాడిని. అప్పుడు నేను 6వ క్లాస్ చదువుతున్నాను. వాళ్లకి ఏది చెప్పారో నేను కూడా వాళ్లతో కలిసి అది చేసేసే వాడిని. ఒక్కోసారి వాళ్లని చూస్తే సర్ప్రైజింగ్గా ఉంటుంది. ప్రభాస్ అప్పట్లో సన్నగా పొడుగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు బాహుబలి... -
రంగడే రంగంలోకి దించాడు...
ఒకప్పటి బాలనటుడు నేడు స్టార్ హీరోలను తయారు చేస్తున్నారు. రంగస్థల నటుడిగా ఆరంగేట్రం చేసి సినీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నటుడిగా, దర్శకునిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఊహ తెలియక ముందే నాటకరంగంలో ప్రవేశించారు. అనూహ్యంగా జరిగిన ఓ ఘటన ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. సినీరంగంలో తెరవెనక నా అనే వారు లేకపోయినా, ఉన్నత స్థాయికి ఎదిగి ఎందరో స్టార్ హీరోలను తయారు చేస్తున్న లంక సత్యానంద్ టర్నింగ్ పాయింట్ ఈ వారం.. అది విశాఖపట్నంలోని కోటవీధి. రంగస్థల దర్శకుడు వై.ఎస్.రాజు ఇల్లు నాటకాల రిహార్సల్స్‌తో సందడిగా ఉండేది. 1967 జనవరిలో 'నాలుగిళ్ల చావిడి' అనే నాటకానికి పూజా కార్యక్రమం జరుగుతోంది. బాలనటుడు రంగడు పాత్రధారి దానికి గైర్హాజరయ్యాడు. అంతే.. అందరిలోనూ ఆందోళన. ఏం చేద్దాం.. ఆపేద్దామా? అని ఆలోచించారు. ఇంతలో ఇంట్లోని వారు 'ఆపేయడం ఎందుకు? మన బన్నూ ఉన్నాడుగా.. వాడితోనే రంగడు వేషం వేయించొచ్చుకదా!' అన్నారు. ఏరా బన్నూ...రంగడు కేరక్టర్ వేస్తావట్రా! అన్నాడు మేనమామ వై.ఎస్ రాజు. ఓ ఎస్ మావయ్యా అంటూ ఓకే చెప్పాడు బన్నూ. ఆ బన్నూయే సత్యానంద్! అలా ఆ రంగడు ఆబ్సెంట్ అవడంతో రంగస్థలంలోకి అనూహ్యంగా ప్రవేశించాడు ఏడేళ్ల మన ‘రంగడు’. అదే ఏడాది నవంబర్‌లో 'విధి' నాటకంలో కుర్రాడి పాత్రకు సత్యానంద్‌ను ఎంపిక చేశారు. ఆ నాటకంలో ఉత్తమ ప్రతిభకు మెచ్చి ఎస్వీరంగారావు సత్యానంద్‌కు రూ.116, వెండికప్ ఇచ్చారు. అప్పట్నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. 40సార్లు ఉత్తమ బాలనటుడి అవార్డులందుకున్నాడు. రంగస్థల దిగ్గజాలు అత్తిలి కృష్ణారావు, చాట్ల శ్రీరాములు, జేవీ రమణమూర్తి, సోమయాజులు వంటి వారి దర్శకత్వాల్లో వచ్చిన నాటకాల్లో 25 సార్లు ఉత్తమ నటునిగా ప్రసంశలందుకున్నారు. నిక్కరు వేసుకునే వయసులోనే ఫుల్ఫ్యాంట్ ఎరువు తెచ్చుకుని యుగసంధ్య అనే నాటకానికి దర్శకత్వం వహించారు. కళాజ్యోత్స్న నాటక సంస్థను స్థాపించి 15 నాటకాలు, 60 నాటికలను ప్రదర్శించి 98 సార్లు ఉత్తమ దర్శకునిగా ఖ్యాతి గడించారు. సినీ ప్రస్థానంలోకి... సత్యానంద్ సినీరంగ ప్రవేశమూ అనూహ్యంగానే జరిగింది. ‘మనిషి నూతిలో పడితే’ నాటకం ఆయనను సినిమాల వైపు మళ్లించింది. దర్శకుడు జంధ్యాల ఈ నాటకంలో సత్యానంద్ (అప్పటికి 20 ఏళ్ల వయసు) దర్శక ప్రతిభను చూసి మల్లెపందిరి (1980) సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేయమని ఆహ్వానించారు. మద్రాస్‌లో ఆంధ్ర క్లబ్ నాటకోత్సవాల్లో వంశీతో పరిచయం ఏర్పడింది. తన మంచుపల్లకి సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత శ్రీమతి కావాలి, చైతన్యం, కళ్లు, కలికాలం ఆడది వంటి సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. 82 మంది స్టార్లకు శిక్షణ.... మంచుపల్లకి సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి సత్యానంద్‌కు పరిచయమయ్యారు. 1991లో తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు శిక్షణ ఇవ్వాలని చిరు సత్యానంద్‌కు ఫోన్ చేశారు. మెగాస్టార్ తమ్ముడికి నటనలో శిక్షణ ఇవ్వడాన్ని చాలెంజ్‌గా తీసుకుని సక్సెస్ అయ్యారు. 1992లో సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సూచనతో మహేష్‌బాబుకు, ఆ తర్వాత ప్రభాస్, రవితేజ, కల్యాణ్‌రామ్, జయం రవి, బ్రహ్మాజీ తదితరులు ఆయన వద్ద నటనలో శిక్షణ పొందారు. ఇప్పటిదాకా సత్యానంద్ తెలుగు, తమిళ, కన్నడల్లో 82 మంది స్టార్లను తయారు చేశారు. 1994లో ఏయూ థియేటర్ ఆర్ట్స్‌లో సత్యానంద్ ఫ్యాకల్టీగా ఉద్యోగంలో చేరారు. రెండు పడవలపై ప్రయాణం సరికాదని 2002లో జాబ్‌కు రిజైన్ చేశారు. స్నేహితుల ప్రోత్సాహం.... ఉద్యోగం మానేసి యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనుందని తన ఫ్రెండ్, ఆడిటర్ ఈమని భాస్కరరామ్మూర్తికి చెప్పారు. ఆయన మంచి నిర్ణయమన్నాడు. సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ (సాయి) పేరును ఆయన అప్పటికప్పుడే ఖరారు చేశారు. ఈ సంగతిని బాల్యమిత్రుడు అన్నంరెడ్డి కృష్ణకుమార్‌కు చెప్పారు. ఆయన జగదాంబ జంక్షన్లో ఇనిస్టిట్యూట్ కట్టించి ఇచ్చారు. 100 మంది హీరోలు లక్ష్యం.. ఇప్పటికి 82 మందికి నటనలో శిక్షణ ఇచ్చి హీరోలుగా తీర్చిదిద్దాను. ఆ సంఖ్యను వందకు చేర్చాలన్నది నా సంకల్పం. సినిమాకు దర్శకత్వం వహించాలని కోరిక ఉంది. నటనలో శిక్షణపై సిలబస్‌ను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఎంతమంది సినీ పెద్దలు ప్రెజర్ పెట్టినా హైదరాబాద్ వెళ్లలేక పోతున్నాను. ఇంకోమాట...నాటకాల్లోనే మునిగి తేలుతున్నాడు.. కుటుంబానికి ఉపయోగపడడని కుటుంబ సభ్యులు అనేవారు. అమ్మా, నాన్న చనిపోయాక ఐదుగురు తమ్ముళ్లకు, ఏకైక సోదరికి పెళ్లి చేశాను. వాళ్లకు ఇళ్లు కట్టించి ఇచ్చాను. నాకు ఇప్పటికీ సొంతిల్లు లేదు. కేఆర్ఎం కాలనీలో అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఫిల్మ్ ఇని స్టిట్యూట్‌కు ప్రభుత్వం స్థలం ఇవ్వాలని కోరుతున్నాను. మా అబ్బాయి సినిమా విడుదల.. నా కుమారుడు రాఘవేంద్రరాజ్ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను ఎందరినో సినీ నటులుగా తీర్చిదిద్దుతున్నా తనకు మాత్రం జాబ్‌పైనే ఆసక్తి. కానీ తనలో టాలెంట్‌ను నేను ఎపుడో గుర్తించాను. సమయం వచ్చినప్పుడు సినిమాల్లో పెట్టాలనుకునే వాడిని. మా కుటుంబానికి హాస్యనటుడు ఎంఎస్ నారాయణతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎంఎస్ కుమార్తె శశికిరణ్ నారాయణ 'సాహెబా సుబ్రహ్మణ్యం' అనే మలయాళ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. అనూహ్యంగా అందులో రాఘవేంద్రరాజ్కు కామెడీ రోల్ లభించింది. ఆ సినిమా శనివారం రాష్ట్రంలో విడుదలయింది. విశాఖలో తప్ప. ఎందుకంటే రజనీకాంత్ లింగ సినిమా విడుదలవుతున్నందున థియేటర్లు దొరకలేదు. ఇంకా మరో రెండు సినిమాల్లో రాజ్ నటిస్తున్నాడు. -
మెరిపిస్తాం..మురిపిస్తాం..
‘న్యూస్‌లైన్’తో విశాఖ సినీ తేజాల మాటామంతీ విశాఖ నగరానికి సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఈ అందాల తీరం షూటింగ్‌లకు నుకూలమన్న విషయం తెలిసిందే. అలాగే ఎంతోమంది నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు మన నగరం నుండి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. వీరిలో కొంతమంది తమ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ను ‘న్యూస్‌లైన్’కు వివరించారు. లవ్ స్టోరీతో వస్తున్నా... నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ ఎటాక్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం చాలా వరకు పూర్తి కావచ్చింది. మంచి యూత్ ఫుల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్‌ను విడుదల చేయనున్నామన్నారు. ఇప్పుడాయన బ్యాంకాక్‌లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి ఈ చిత్రంపైనే ఉందని, మిగతా ప్రాజెక్టుల వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు విజయవంతమై పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ ఏడాది కూడా విశాఖలో షూటింగ్... ఈ ఏడాది కూడా విశాఖలోనే తన తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఆయనకు ఈ నగరమంటే సెంటిమెంట్. హీరో, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇలా తాను డెరైక్ట్ చేసిన సినిమాలు విశాఖలోనే తీశారు. తన సొంత బ్యానర్ శ్రావ్య ఫిలిమ్స్‌పై యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రూపొందిస్తున్నానని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. మరింత కామెడీ పండిస్తా... విశాఖ నుండి వెళ్లిన కొద్ది కామెడియన్లలో ప్రస్తుత జనరేషన్లో బాగా పాపులర్ అయిన నటుడు సుమన్ శెట్టి. పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఈ నటుడు కామెడీ పండించడంలో తనదంటూ ఓ ముద్ర వేశాడు. కొత్త సంవత్సరంలో మరి న్ని మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, బెస్ట్ కామెడీ పండి స్తానని చెప్పాడు. ఈ ఏడాది ఓ స్త్రీ ప్రేమకధ, రింగ్‌టోన్, తనీష్ హీరోగా చేస్తున్న తమిళ, తెలుగు చిత్రాలు, వరుణ్ సందేశ్ నటిస్తున్న నాతో వస్తావా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం స్టార్ మేకర్ సత్యానంద్ అంటే తెలియని వారుండరు. సుమారు 70మంది హీరోలను, 12మంది క్యారెక్టర్ నటులను, ఎనిమిదిమంది దర్శకులను, ఎందరో టీవీ ఆర్టిస్టులను అందించిన ఘనత ఆయనది. ఈ సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమని సత్యానంద్ చెప్పారు. కారణం ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను తొలిసారిగా నటిస్తున్న బిల్లారంగ చిత్రం ఈ ఏడాది విడుదలవుతోంది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తీస్తున్న కొత్త చిత్రంలో కూడా సత్యానంద్ నటించబోతున్నారు. ఈ ఏడాది తన దృష్టి అంతా యాక్టింగ్పైనేనని చెప్పారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ల చిత్రాలు ఈ ఏడాది రిలీజవుతున్నాయి. వీరిద్దరూ సత్యానంద్ స్కూలు నుండి వచ్చిన వారే. ఈ ఏడాది విశాఖ నుండి మరింతమంది చిత్ర పరిశ్రమకు చేరాలని కోరుతున్నానన్నారు.