ఫ్యాషన్ డిజైనర్లో స్టార్ మేకర్ వారసుడు | Star Maker Son in fashion Designer | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ డిజైనర్లో స్టార్ మేకర్ వారసుడు

Published Thu, Apr 13 2017 11:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

ఫ్యాషన్ డిజైనర్లో స్టార్ మేకర్ వారసుడు

ఫ్యాషన్ డిజైనర్లో స్టార్ మేకర్ వారసుడు

సీనియర్ దర్శకుడు వంశీ, ఒకప్పుడు సంచలన విజయం సాధించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.  అయితే ఈసినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ మేకర్ సత్యానంద్ వారసుడు నటిస్తున్నాడు. లేడీస్ టైలర్ సినిమాలో హీరో పాటు సినిమా అంతా కనిపించే కీలక పాత్ర బట్టల సత్యం, ఈ పాత్రకు కొడుకుగా సత్యానంద్ కొడుకు రాఘవేంద్ర నటిస్తున్నాడు.

దాదాపు తెలుగు వెండితెర మీద గత పదిహేనేళ్లలో పరిచయం అయిన స్టార్ వారసులందరికీ గురువుగా గుర్తింపు తెచ్చుకున్న సత్యానంద్, ఫ్యాషన్ డిజైనర్ సినిమాతో తన వారసుడిగా రాఘవేంద్రను పరిచయం చేస్తున్నాడు. తండ్రి దగ్గరే నటనలో శిక్షణ పొందిన రాఘవేంద్ర కామెడీ పాత్రలో ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement