నాన్న క్లాసుల్లో భలే సరదా | Satyanand son raghavendra chit chat with sakshi city plus | Sakshi
Sakshi News home page

నాన్న క్లాసుల్లో భలే సరదా

Published Sun, Feb 15 2015 12:32 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

నాన్న క్లాసుల్లో భలే సరదా - Sakshi

నాన్న క్లాసుల్లో భలే సరదా

తండ్రి చిత్రసీమలో హేమాహేమీలను తయారు చేసిన స్టార్ మేకర్..నటనకు బాల శిక్షలాంటి ఇంటి వాతావరణం..యాక్టర్ కావాలనే కోరిక. ఇవుంటే చాలు సినీ ఫీల్డ్‌లో ప్రవేశించాలంటే..కానీ ఆ యువకుడు స్వతంత్రంగా తానేమిటో నిరూపించదలుచుకున్నాడు. నాన్నచాటు బిడ్డగా కాకుండా వెండితెరపై వెలుగులీనాలనుకున్నాడు. అందుకే అవకాశం కోసం ఎదురు చూశాడు కాస్త లేటైన లేటెస్టుగా ప్రేక్షకులను మెప్పించే కామేడీ రోల్స్‌ను ఎంచుకుని భేష్ అనిపించుకుంటున్నాడు..ఇంతకీ అతనెవరో కాదండి  స్టార్ మేకర్ సత్యానంద్ తనయుడు రాఘవేంద్ర. తన సినీ జర్నీ గురించి అతని మాటల్లోనే...
 
 నేను టింపనీ స్కూల్లో చదివాను. నారాయణ కాలేజీలో ఇంటర్ చే శాను. అవంతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశాను. నాన్న స్టార్ మేకర్. అమ్మ స్కూల్ టీచర్. అమ్మ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. నీకు ఏ ఇంట్రస్ట్ ఉన్నా సరే అవన్నీ చదువు తర్వాతే అన్నారు. అందుకే బీటెక్ పూర్తి చేసి సినిమాల వైపు వచ్చాను.
 
 టాలెంట్ ఉంటేనే...
 నేను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు ‘బబ్లూ విత్ లవ్’ అనే ఒక ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఒక పక్క ఎగ్జామ్స్, షూటింగ్, క్లాసెస్...ఇలా అన్నీ క్లాష్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అటో ఇటో తెలియక క న్ఫ్యూజ్ అయ్యాను. అమ్మతో చెబితే ఇప్పుడు ఇవేమీ పెట్టుకోకు అని చెప్పారు. అందుకే ఇంజినీరింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేశాను. తర్వాత సంవత్సరం పాటు సినిమాల్లో ట్రై చేశాను. మా నాన్న ‘ఇతను మా అబ్బాయి.. ఇతనికి ఛాన్స్ ఇవ్వండి’ అని ఎప్పుడూ చెప్పరు. నీ అంతట నువ్వు వెళ్లు. ఆడిషన్ ఇవ్వు.. నచ్చితే తీసుకుంటారు. లేదంటే లేదు అని చెప్పేవారు.
 
 సినిమా ఫీల్డ్‌లోనే...
 బీటెక్ అయిపోయిన సంవత్సరం వరకు సినిమాల్లోనే ట్రై చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి కానీ పెద్ద క్యారెక్టర్స్‌కు రిజక్ట్ చేసేవారు. ఈలోగా నాకు ఒక జాబ్ వచ్చింది. సరే ఏదో ఒకటి చేయాలి కదా అని జాబ్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యాను. మరొక వారం రోజుల్లో జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న సమయంలో ఎమ్‌ఎస్ నారాయణ గారి అమ్మాయి శశికిరణ్ నుంచి ఫోన్ వచ్చింది. నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. దానికి నువ్వైతే కరెక్ట్‌గా సూట్ అవుతావు అని చెప్పింది. అమ్మను అడిగితే జాబ్ మళ్లీ వస్తుంది,ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయి అని చెప్పింది. అలా ‘సాహెబా సుబ్రమణ్యం’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పడ్డానండీ ప్రేమలో మరి’లో హీరో ఫ్రెండ్ రోల్ చేశాను.
 
 సినిమాటోగ్రఫీ ఇంట్రస్ట్...
 నాన్న చెప్పే క్లాసులు చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాను. ఫ్రేమింగ్ మీద సైన్స్ క్లాస్ ఉండేది. ఎప్పుడైతే అవి విన్నానో నాకు సినిమాటోగ్రఫీ మీద ఇంట్రస్ట్ వచ్చింది. కెమెరా యాంగిల్స్ ఇలా పెట్టాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా చూసుకోవాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకున్నాను. 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఇలా మొత్తం సైన్స్ ఉంటుంది. అది నచ్చి సినిమాటోగ్రఫీ వైపు వచ్చాను. తర్వాత  యాక్టింగ్‌లోకి వచ్చాను. నాన్న చెప్పే క్లాసులు అన్నీ సరదా సరదాగా ఉంటాయి.. బాగా ఎంజాయ్ చేసేవాడిని.
 
 స్టార్స్‌ను చూస్తూ పెరిగాను...
 నా చిన్నప్పటి నుంచి నాన్న ట్రైనింగ్ ఇచ్చే యాక్టర్స్‌ను చూస్తూ పెరిగాను. ప్రభాస్‌కు ట్రైనింగ్ ఇస్తున్న దగ్గర నుంచీ నేను అక్కడే ఉండేవాడిని. అప్పుడు నేను 6వ క్లాస్ చదువుతున్నాను. వాళ్లకి ఏది చెప్పారో నేను కూడా వాళ్లతో కలిసి అది చేసేసే వాడిని. ఒక్కోసారి వాళ్లని చూస్తే సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ప్రభాస్ అప్పట్లో సన్నగా పొడుగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు బాహుబలి...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement