మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రెడీ అవుతున్నారు. యస్.. మీ గెస్ కరెక్టే. ఇక్కడున్న ఫొటో చూడగానే చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ అరంగేట్రానికి రంగం షురూ అయిందని ఊహించేసి ఉంటారు. వచ్చే ఏడాది కల్యాణ్ కెమెరా ముందుకు రానున్నారు. ‘అందాల రాక్షసి’, ‘ఈగ’, ‘లెజెండ్’, ‘దిక్కులు చూడకు రామయ్య’... ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వారాహి చలన చిత్రమ్ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడిగా జస్ట్ వన్ మూవీ ఓల్డ్ అయిన రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అసలు ఈ ప్రాజెక్ట్‌కి ఎలా శ్రీకారం జరిగింది? అనేది రాకేశ్ శశి మాటల్లో తెలుసుకుందాం.
‘‘డైరెక్టర్‌గా నా ఫస్ట్ మూవీ ‘జత కలిసే’ చూసి, సాయి కొర్రపాటిగారు ఇంప్రెస్ అయ్యారు. ఆయనే ఆ సినిమాని రిలీజ్ చేశారు. అప్పుడే వారాహి బ్యానర్లో దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని మాటిచ్చారాయన. మంచి కథ రెడీ చేసుకున్నా.వైజాగ్ సత్యానంద్‌గారు ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు కాబట్టి, ఎవరైనా కొత్త హీరో ఉంటే చెప్పమని ఆయన్ను అడిగా. కథ కూడా చెప్పాను. ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌కి అయితే కరెక్ట్‌గా సూట్ అవుతుంది’’ అని సలహా ఇచ్చారు సత్యానంద్‌గారు. ‘నేనా.. చిరంజీవిగారి అల్లుడితోనా? చాన్స్ ఇస్తారా?’ అనుకున్నా. అయినా కల్యాణ్‌ను కలిసి, కథ చెప్పా. ఓకే అన్నారు. కానీ ‘ఓసారి మామయ్య చిరంజీవిగారికి కథ చెప్పండి’ అని కల్యాణ్ అన్నారు. అనుకోని కారణాల వల్ల చిరంజీవిగారితో నా ఫస్ట్ అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవిగారిని కలిసి, కథ చెప్పాం. ఆయన ఇంప్రెస్ అయ్యారు. కథ చాలా బాగుందని అభినందించారు. ఆ క్షణాలను మరచిపోలేను’’ అన్నారు రాకేశ్ శశి. మరి కల్యాణ్‌తో తీయబోయే సినిమా లవ్‌స్టోరీనా? అని అడగ్గా.. ‘‘లేదు. డిఫరెంట్ స్క్రిప్ట్. జనవరిలో లేదా ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్తాం. వారాహిలాంటి పెద్ద బేనర్, చిరంజీవిగారి అల్లుడు.. ఇలా నా రెండో సినిమాకే మెగా చాన్స్ కొట్టేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాకేశ్.
Comments
Please login to add a commentAdd a comment