2018 జులై 12.. 'ఆర్‌ఎక్స్ 100' థియేటర్‌లో విడుదలైంది. సినిమా హిట్.. అందాల విందుతో పాటు అదిరిపోయే నటనను ప్రదర్శించిన పాయల్ రాజ్‌పూత్ గురించి అప్పట్లో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సాధించింది..’ అనుకున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు కానీ అది నిజం కాలేదు. 'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో ఆమెకు ఫ్యాన్ బేస్ పెరిగింది కానీ. తరువాత తను చేసిన సినిమాల విషయంలో ఎంపిక సరిగా లేకపోవడంతో పాయల్ వెనకపడిపోయింది.
(ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?)
తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఇలా చెప్పింది. 'ఆర్‌ఎక్స్ 100' తర్వాత టాలీవుడ్‌లో నన్ను కొంతమంది తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే నేను మాత్రమే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. దాంతో ఇక్కడున్న కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో వారు నన్ను మిస్ గైడ్ చేశారు. పలాన సినిమా మాత్రమే చయండి.. వారితో ఇలా మెలగండి అంటూ సలహాలిచ్చేవారు. చివరకు కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించి, అప్పట్లో నాకున్న ఫేమ్‌ను వాడుకున్నారని' సంచలన కామెంట్స్ చేసింది పాయల్.
ప్రస్థుతం అన్ని రకాలుగా అలోచించే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని పాయల్ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తనకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది. ఎటువంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని తెలిపింది. సినిమా రంగంలో ఎవరైనా టాప్ లోకి వెళతాం.. అలాగే కిందకి కూడా పడిపోతాం ఇదీ సహజం. కానీ వాటిని తట్టుకొని నిలబడాలని ఈ బ్యూటీ పేర్కొంది. నెగటివిటీని వదిలేసి.. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాని తెలిపింది. 'ఆర్‌ఎక్స్ 100'తో లైఫ్ ఇచ్చిన అజయ్ భూపతినే తనకు మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబోలో 'మంగళవారం' సినిమాతో మళ్లీ రాబోతున్నారు.
ప్రభాస్‌పై కామెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని పాయల్ తెలిపింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నానని తను తెలిపింది. ఆయన హైట్‌కు తగినట్లు మ్యాచ్ అవుతానని ఈ బ్యూటీ చెప్పింది. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఈ బ్యూటీ ప్రభాస్ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. ఐకాన్ స్టార్ బన్నీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది.
(ఇదీ చదవండి: Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..)
Comments
Please login to add a commentAdd a comment