
'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన అనారోగ్యం గురించి చెప్పి షాక్ ఇచ్చింది. నాకు కిడ్నీ ఇన్‌ఫెక్షన్ అని తెలిసిందే.
'నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని ఫలితంగా ఇలా జరిగింది. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అడ్డంకులు ఎదురైనా అధిగమించాలి.
అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్. ఇక నాలా మీరు మాత్రం చేయకండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి' అంటూ పాయల్ సూచించింది. ఆర్ఎక్స్ 100తో హిట్ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్‌లోనే పాయల్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment