Kidney infections
-
షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన అనారోగ్యం గురించి చెప్పి షాక్ ఇచ్చింది. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తెలిసిందే. 'నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని ఫలితంగా ఇలా జరిగింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అడ్డంకులు ఎదురైనా అధిగమించాలి. అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్. ఇక నాలా మీరు మాత్రం చేయకండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి' అంటూ పాయల్ సూచించింది. ఆర్ఎక్స్ 100తో హిట్ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్లోనే పాయల్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి
ఇటీవల కాలంలో సినీ సెలబ్రెటీలు వరుసగా అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ల నుంచి నటీమణుల వరకు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో ప్రముఖ నటి, బుల్లితెర హీరోయిన్ కూడా ఆస్పత్రి పాలైంది. బాలీవుడ్ టీవీ నటి, ‘బాలికా వధు 2’ ఫేం శివాంగీ జోషి కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు స్వయంగా ఆమె వెల్లడింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు తెలిపింది. ‘హాలో.. మీ అందరికి ఒకటి చెప్పాలి. గత కొద్ది రోజులుగా నేను కఠిన పరిస్థితులను చూశాను. కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆస్పత్రిలో చేరాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డాక్టర్స్ సపోర్టుతో ప్రస్తుతం కోలుకున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మీ శరీరాన్ని కాపాడుకోవాలంటూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు ఆమె సూచించింది. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రెట్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చింది. కాగా ‘బాలిక వధు 2’తో నటిగా గుర్తింపు పొందిన శివాంగి జోషి ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యింది. అంతేకాదు ప్రముఖ రియాలిటీ షో ‘ఖత్రోంకి ఖిలాడీ 12’ సీజన్లో కంటెస్టెంట్‌గా చేసి తనదైన ఆటతో అందరికి ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) -
ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత
మధురమైన గానం, సంగీతంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ (63)కన్నుమూశారు. చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నకుమార్ పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్ వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు... ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గాయకుడిగా పేరు గడిస్తే, రత్నకుమార్ మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలనుకున్నా, సరైన బ్రేక్ రాలేదు రత్నకుమార్‌కి. ఆ సమయంలో తమిళ చిత్రం ‘కంచి కామాక్షి’కి తెలుగులో డబ్బింగ్ చెప్పారాయన. అప్పటినుంచి నాలుగు దశాబ్దాల కెరీర్లో వెయ్యికిపైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. పదివేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్‌కు గాత్రాన్ని ఇచ్చారు. 50కి పైగా డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ అందించారు. ఓ సందర్భంలో ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి, ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్నారు. అదే విధంగా ‘అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ ఆయన పేరు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఉత్తమ అనువాద కళాకారుడి’గా ‘తాత–మనవడు’ చిత్రంలో వినోద్‌కుమార్ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కి నంది అవార్డును అందుకున్నారు. ఇంకా తెలుగులో రోజా, బొంబాయి సినిమాల్లో అరవింద్ స్వామి పాత్రలకు, ‘పుణ్యస్త్రీ, అభినందన’ చిత్రాల్లో కార్తీక్ పాత్రలకు, ‘అన్నమయ్య’ తమిళ డబ్బింగ్ ‘అన్నమాచార్య’లో నాగార్జున పాత్రకు... ఇలా తన గాత్రంతో ఆ పాత్రలు హైలైట్ అయ్యేలా చేశారు రత్నకుమార్. ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్రంలో టైటిల్ రోల్ చేసిన ఆకాష్ ఖురానాకి చెప్పిన డబ్బింగ్ తనకు చాలా సంతృప్తినిచ్చిందని పలు సందర్భాల్లో రత్నకుమార్ పేర్కొన్నారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ వంటి 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు. అలాగే ఒక మెగా సీరియల్, ఒక సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నారు. తన తండ్రి ఘంటసాల జ్ఞాపకార్థం ఓ భారీ సినిమా తీయాలనుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారు. రత్నకుమార్‌కి భార్య కృష్ణకుమారి, కుమార్తెలు వీణ, వాణి ఉన్నారు. తల్లి సావిత్రమ్మ కూడా కొడుకు వద్దే ఉంటున్నారు. రత్నకుమార్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. ఘంటసాల రత్నకుమార్ మరణం దక్షిణ భారత చలన చిత్ర రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ¯Œ మోహ¯Œ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లతాశ్రీ
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం): పసి హృదయం ప్రాణాంతక వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. వైద్యానికి అవసరమైన సాయం అందించే చేతులకోసం ఆశగా ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. విశాఖ నగరంలోని బర్మా క్యాంపులో నివాసం ఉంటున్న కానూరి కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏడవ తరగతి చదువుతున్న లతాశ్రీ యూరిన్ బ్లాడర్‌లో పెరాల్సిస్ స్ట్రోక్ రావడం వల్ల దాని ప్రభావం కిడ్నీపై చూపింది. దీనివల్ల ఆమె తరచూ జ్వరంతో బాధపడుతోంది. కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిస్తే శస్త్ర చికిత్స అసాధ్యమని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు. మందులు వాడుతున్నా వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో లతాశ్రీని ఎంవీపీ కాలనీలో ఫిజియెథెరపీ కేంద్రంలో పరీక్షలు చేయించారు. ఫిజియోథెరపీ ద్వారా నయం చేస్తామని అక్కడ హామీ ఇచ్చినట్టు వారు వివరించారు. అయితే ఫిజియోథెరపీ ఖర్చుతో కూడినది కావడంతో వారు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రోజుకు రూ.2 వేలు ఖర్చు అవుతుందని రెండు నెలలపాటు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్టు లతాశ్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఇంత మొత్తం భరించడం వాళ్లకు తలకు మించినదిగా మారింది. లతాశ్రీ తండ్రి ఆటో డ్రైవర్‌గా, తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితుల్లో తాము ఫిజియోథెరపీ చేయించే స్థోమత లేదని వారు వాపోతున్నారు. దాతలు ముందకు వచ్చి ఫిజియోథెరపీకి అవసరమైన మొత్తాన్ని అందించి తమ కుమార్తె ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. వివరాలకు 9010943730 నంబరులో సంప్రదించాలని వారు తెలిపారు. ఫిజియోథెరపీ చేయించాలి మా మమ్మీ,డాడీల బాధ నన్ను మరింత మనోవేదనకు గురి చేస్తోంది. నేను వ్యాధి నుంచి బయట పడితే అందరిలా విద్యలో రాణించి వారికి కొండంత అండగా ఉందామనుకున్నాను. వైద్యానికి సాయం అందించే వారు (ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐ ఎన్0020573, ఖాతా: 36749638537, ఐటీఐ బ్రాంచి) నంబరులో జమచేసి ఆదుకోవాలి. – లతాశ్రీ, బాధిత చిన్నారి -
దాతల కరుణే ఆమెకు ఊపిరి
సాక్షి కడప : అనుకున్న లక్ష్యం కోసం.. అనుక్షణం పోరాటం చేస్తోంది.. ఇంటి కష్టాలు ఉద్యోగంతోనే దూరమవుతాయని భావించింది.. మూడేళ్లుగా పట్టుదలతో శ్రమిస్తోంది. ఇదే సమయంలో ఆమెను విధి వక్రించింది. అనుకోని జ్వరం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే ఎస్ఐ పరీక్షలో దేహదారుడ్య, ఇతర ప్రాథమిక పరీక్షలను నెగ్గిన ఆ యువతి.. ఈనెల 24వ తేదిన జరిగే మెయిన్ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితిలో తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రాణం కోసం పోరాడుతోంది. పులివెందులలోని నరసారెడ్డి పెట్రోలు బంకు సమీపంలో నివసిస్తున్న విద్యావతమ్మకు నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒకరు బాబు. తండ్రి మృతి చెందడంతో అనీన్ తల్లే చూసుకుంటోంది. పులివెందుల సమీపంలోని పాఠశాలలో పాఠాలూ చెబుతూ పిల్లలను చదివించుకుంటోంది. నాల్గవ సంతానమైన శ్రీవాణిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని బాగా చదివించింది. నంద్యాలలోని కోచింగ్ సెంటర్‌కు పంపింది. కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ వేటలో ఉన్న శ్రీవాణి?కి ఈనెల మొదటి వారంలో జ్వరం వచ్చింది. పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించాక కడపకు తరలించారు. కోలుకోలేదు. ప్రస్తుతం వేలూరులోని అపోలో ఆస్పత్రిలో శ్రీవాణి అపస్మారక స్థితిలో ఉంది. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. యువతి ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ చేరింది. రూ. 10–15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే రూ 3–4 లక్షలు ఖర్చు పెట్టారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాపను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దయార్థ హృదయులు దయతలిస్తేనే... శ్రీవాణికి జీవితాన్ని ప్రసాదించాలని దయార్థ హృదయులను, మానవతా వాదులును కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అంతో ఇంతో అయితే తాము పెట్టుకునే వారమని...బయట కూడా అప్పులు తెచ్చామని....స్థాయికి మించి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతోనే తప్పని పరిస్థితుల్లో శ్రీవాణికి జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నామన్నారు. స్వచ్చంద సంస్థలు, మానవతా వాదులు, దాతలు ఆర్థికంగా చేయూతనందిస్తే శ్రీవాణికి పునర్జన్మ ప్రసాదించిన వారవుతారని తల్లి కన్నీరుమున్నీరవుతూ చెప్పింది. శ్రీవాణిని ఆదుకోవాలనుకుంటే ఎం.శ్రీ సాయిరాం, అకౌంట్ నెం. 36988129978, ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 0000849, ఎస్బీఐకి ఆర్థికసాయాన్ని పంపించాలన్నారు. వివరాలకు శ్రీ సాయిరాంను 7416303974 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
అరుణ్ జైట్లీకి అనారోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(65) మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సమస్య గురించి పూర్తిగా వివరించకుండా.. ‘కిడ్నీ సంబంధిత సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను. భవిష్యత్ చికిత్సను డాక్టర్లు నిర్ధారిస్తారు’ అని మాత్రమే జైట్లీ ట్వీట్ చేశారు. అయితే, జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుందని ఎయిమ్స్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కిడ్నీ దాతకు సంబంధించిన విధి, విధానాలు కూడా పూర్తయ్యాయని తెలిపాయి. డాక్టర్ల సలహాతో త్వరలో జైట్లీ ఎయిమ్స్‌లో కొత్తగా నిర్మించిన అత్యాధునిక కార్డియో–న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. జైట్లీ కుటుంబానికి సన్నిహితుడైన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోదరుడు, అపోలో ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా జైట్లీకి ఆ ఆపరేషన్ చేస్తారని తెలిసింది. 2014లో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడమే ప్రస్తుత సమస్యకు కారణమై ఉండొచ్చని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాక్స్ ఆసుపత్రిలో ఆ సర్జరీ జరిగినప్పటికీ.. ఆపరేషన్ అనంతరం పలు సమస్యలు రావడంతో అప్పట్లోనే ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. జైట్లీ చాన్నాళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ కూడా జరిగింది. జైట్లీ ఈ సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జైట్లీ.. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 2న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికీ హాజరుకాలేదు. లండన్‌లో ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనాల్సిన ఆయన, ఆ పర్యటనను కూడా రద్దుచేసుకున్నారు. -
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే
జి.సిగడాం: జిల్లాలోని ఉద్దాన తీర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులపై పూర్తి స్థాయిలో సర్వే చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు వెల్లడించారు. స్థానిక 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్దానం తీరప్రాంతాల్లో 7 మండలాల్లో 114 గ్రామాల్లో సుమారుగా 1.30లక్షల మందికి కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే జరుపుతామన్నారు. ఇంతవరకు 15 బృందాలతో 77 గ్రామాల్లో 47 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లాలోని రిమ్స్ కేంద్రంలో ఉచితంగా డెంగీ తనిఖీ, రక్తఫలకికల (ప్లేట్లెట్స్) నమూనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో రోగులకు ఉచితంగా డెంగీ పరీక్ష చేస్తామని, అవసరమైన వారికి ప్లేట్లెట్స్ అందిస్తామని తిరుపతిరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా రాకుండా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చామని వివరించారు. కొన్ని పంచాయతీల్లో తాగునీటిలో ఫ్లోరిన్ ఉండడంతో.. వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ రాకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం రిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. జ్వరాల కోసం జిల్లాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. రాజాం, పాలకొండ, టెక్కలి, పలాస, శ్రీకాకుళం రిమ్స్ ఆరోగ్యకేంద్రాల్లో 24 గంటలు ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశామని తిరుపతిరావు తెలిపారు. వేసవిలో ఎండలు అధికంగా ఉన్నాయని, వీటి అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయనతోపాటు వైద్యఅధికారులు ముంజేటి కోటేశ్వరరావు, శివప్రసాద్, గౌతమి ప్రియాంకలతోపాటు సిబ్బంది ఉన్నారు. -
కిడ్నీకీ... క్రియాటినిన్‌కు సంబంధం ఏమిటి?
నా వయసు 38. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కావడంతో రోజుకు కనీసం 10 -12 గంటలకు పైగా ఇంటర్నెట్ మీద కూర్చుంటాను. ఇటీవలే మా కంపెనీలో యాన్యువల్ హెల్త్ చెకప్ జరిగినప్పుడు, క్రియాటినిన్ 1.7 ఉన్నట్లుగా రిపోర్టు వచ్చింది. కిడ్నీ స్పెషలిస్ట్‌కు తప్పక చూపించాల్సిందిగా మా కంపెనీ డాక్టర్ సలహా ఇచ్చారు. క్రియాటినిన్కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? క్రియాటినిన్ తగ్గడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. - కె.ఎన్.వి., హైదరాబాద్ మూత్రపిండాల (కిడ్నీ) పనితీరును తెలుసుకోవడానికి చేసే పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా చాలా ముఖ్యమైనవి. సాధారణంగా శరీరంలో క్రియాటినిన్ పరిమాణం 0.5 ఎంజీ/డీఎల్ నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అదే బ్లడ్ యూరియా అయితే 20 ఎంజీ/డీఎల్ నుంచి 40 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం 1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు సామర్థ్యం తగ్గినదానికి ఒక సూచనగా పరిగణించాలి. అదే క్రియాటినిన్ పరిమాణం 4 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు 80శాతం నుంచి 90శాతం వరకు తగ్గినట్లుగా భావించాలి. శరీరంలో క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైన కొన్ని కారణాలు... హైబీపీ, డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి వాపు, నొప్పి నివారణ మందులు దీర్ఘకాలంపాటు వాడటం, ఉప్పు,మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం వంటివి. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా వస్తే కేవలం కిడ్నీకి సంబంధించిన పరీక్షలే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి కూడా చెక్ చేయించుకుని కిడ్నీ స్పెషలిస్ట్‌ను కలవాలి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో క్రియాటినిన్ పరిమాణం పెరగకుండా ఉండాలంటే రోజూ 3-4 లీటర్ల నీటిని తాగుతూ, అరగంటకు తగ్గకుండా ఒళ్లు అలిసేలా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. మీరు చెప్పిన విధంగా ఇంటర్నెట్పై 10 గంటలు కూర్చుండటం వల్ల క్రియాటినిన్ పెరుగుతుందనే అంశంపై ఇంకా శాస్త్రీయమైన నిరూపణలేమీ లేవు. అయినా మీరు వైర్లెస్ ఇంటర్నెట్ ఉపయోగాన్ని వీలైనంతగా తగ్గించడం, బాగా వేడిని వెలువరించే ల్యాప్‌టాప్‌లను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచి ఉపయోగిస్తే మంచిది. మధ్య మధ్య వీలైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. నా వయసు 28. చాలా సన్నగా ఉంటాను. ఎంత తిన్నా నా బరువు 48 కిలోలు దాటడం లేదు. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత చాలా నీరసంగా ఫీలవుతున్నాను. మాంసాహారం అలవాటు లేదు. రోజుకు 10 సిగరెట్స్ తాగే అలవాటు ఉంది. రెండు నెలల నుంచి అంగస్తంభన సరిగా జరగడం లేదు. ఏ ఆహారపదార్థాలు తీసుకుంటే సెక్స్ పొటెన్సీ పెరుగుతుంది? తగిన సలహా ఇవ్వగలరు. - సి.ఆర్.ఎమ్., ఒంగోలు ఎత్తుకు తగిన బరువు ఉండటం మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. చాలామంది సన్నగా ఉన్నవారు లావెక్కాలని, లావుగా ఉన్నవారు సన్నబడాలని ప్రయత్నిస్తుంటారు. ఎత్తు-బరువు ఛార్ట్ చూసుకుని, దానికి తగ్గట్లుగా ఉంటే మీ బరువును గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక సెక్స్ అనేది మీ మానసిక-శారీరక నిలకడను సూచిస్తుంది. శాకాహారమైనా, మాంసాహారమైనా సరైన మోతాదులో శరీరానికి అవసరమైన పాళ్లలో తీసుకుంటే శారీరక దృఢత్వంలో తేడా ఉండదు. మీరు శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా అది సమతుల ఆహారమై ఉండి, అన్ని పోషకాలూ సమపాళ్లలో అందేలా తీసుకుంటే శరీరంలో, సెక్స్‌లో పటుత్వం ఎప్పటికీ తగ్గదు. మూడుపూటలా ఆకలవుతూ ఉండి, బాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండటం కేవలం ఒక్క సెక్స్ విషయంలోనే గాక... శారీరక ఆరోగ్యానికీ మంచిది. మీరు సిగరెట్స్ పూర్తిగా మానేసి, సమతులాహారం తీసుకునేలా జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఎంత ఎక్కువగా తింటున్నా లావెక్కడం లేదని బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. నా వయసు 19. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. స్నానం చేసే సమయంలో పురుషాంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాగి ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అయితే ఈవుధ్య అంగం మీది చర్మం బాగా పొడిగా అయిపోయి వుునుపటిలా వెనక్కు రావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం వస్తోంది. ఈ సవుస్యతో చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్‌కు చూపించాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.ఎస్.ఆర్., అమలాపురం పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే కండిషన్‌ను ఫైమోసిస్ అంటారు. దీనివల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పి రావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా ముందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేయించుకోవడం మంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కూడా సులువు. సెక్స్ చేయడానికీ అనువుగా ఉంటుంది. మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే సమస్యలు కూడా ఇతర సమస్యల్లాంటివే. ఇతర సమస్యలను ప్రస్తావించడానికి మనం ఎలా సిగ్గుపడమో, డాక్టర్ వద్ద ఈ సమస్యలను చెప్పడానికీ అలాగే సిగ్గుపడాల్సిన, బిడియ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఉన్నదే ఇలాంటి సమస్యలను చక్కదిద్దడానికి. అందుకే చెడు అలవాట్లు ఉన్నా లేకపోయినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించి సమస్య నుంచి విముక్తి పొందడమే మనం చేయాల్సింది. ఏ డాక్టర్ కూడా దీనికి మిమ్మల్ని నిందించడు. తక్కువగా చూడడు. చెడుగా అనుకోడు. కాబట్టి మీ దగ్గర్లోని డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స చేయించుకుని, మీ బాధల నుంచి విముక్తి పొందండి. నిర్వహణ: యాసీన్ డాక్టర్ వి.చంద్రమోహన్ యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్