Adipurush Dialogue Writer Manoj Muntashir Comments On Bajrangbali Goes Viral - Sakshi
Sakshi News home page

‘హనుమంతుడు దేవుడు కాదు’.. ఆదిపురుష్‌ రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు!

Published Tue, Jun 20 2023 9:32 PM | Last Updated on Mon, Jul 31 2023 8:16 PM

Adipurush Dialogue Writer Manoj Muntashir Comments On Bajrangbali Goes Viral - Sakshi

‘ఆదిపురుష్‌’ సినిమా మొదలెట్టినప్పుడు ఆ చి​త్రానికి ఎంత హైప్‌ వచ్చిందో ప్రస్తుతం అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్‌ చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్‌తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి వేషధారణ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇన్ని వివాదాల నడుమ ఆదిపురుష్‌ సినిమా డైలాగ్‌ రైటర్‌, లిరిసిస్ట్‌ మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయనొక భక్తుడు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్’ ఇటీవల విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవైపు భారీగా కలెక్షన్లను రాబడుతున్నా అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్‌ సినిమా డైలాగ్‌ రైటర్‌ మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా మాట్లాడుతూ.. ‘హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడు.

ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వివాదాల నడుమ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆదిపురుష్‌ చిత్రానికి మరింత మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు.


చదవండి: Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement